E-Paper
Advertisement

Foot Care Tips: పాదాలు అందవిహీనంగా మారాయా? పార్లర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే కోమలంగా మార్చుకోండిలా!

Foot Care Tips: పాదాలు అందవిహీనంగా మారాయా? పార్లర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే కోమలంగా మార్చుకోండిలా!
Advertisement

Foot Care Tips: పాదాలు పొడిబారడం, పగుళ్లు ఏర్పడటం, చూడటానికి అందవిహీనంగా మారిపోవడం వంటి సమస్యలు కేవలం శీతాకాలంలోనే కాదు.. ఏడాది పొడవునా చాలామందిని వేధిస్తుంటాయి. ముఖ్యంగా మహిళల్లోనే పాదాల పగుళ్లు ఎక్కువ. అయితే, ప్రతిసారీ బ్యూటీపార్ల్‌కు వెళ్లి పెడిక్యూర్ చేసుకునే వెసులుబాటు అందరికీ ఉండకపోవచ్చు. అంతేకాదు.. దాని కోసం డబ్బులు కూడా ఎక్కువగానే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్లర్‌తో పని లేకుండా.. మన వంటింట్లో దొరికే వస్తువులతోనే ఈ సమస్యను అధిగమించవచ్చు. అదెలాగో చూసేద్దామా.

కొబ్బరినూనె మసాజ్..

పాదాలకు పోషణ ఇవ్వడంలో కొబ్బరినూనె అద్భుతంగా పనిచేస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని.. పాదాలు, వేళ్లు లోపలికి వెళ్లేలా.. మెల్లగా మర్దన చేయాలి. రాత్రంతా అలాగే ఉంచడం వల్ల కొబ్బరినూనె చర్మంలోని తేమను నిలిపి ఉంచుతుంది. తెల్లారి లేచేసరికి పాదాలు ఎంతో మృదువుగా మారుతాయి.

Advertisement

Also Read: పప్పు వండేటప్పుడు వచ్చే నురగ అమృతమా? అనారోగ్యమా? నిపుణులు చెప్పిన షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోండి..

చక్కెరతో స్క్రబ్..

పాదాలపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించడానికి ఆలివ్ ఆయిల్, బ్రౌన్ షుగర్‌ను సమానంగా తీసుకుని, అందులో కాస్త నిమ్మరసం కలిపి స్క్రబ్‌లా తయారు చేసుకోవాలి. దీనిని పాదాలకు పట్టించి మృదువుగా రుద్దిన తర్వాత.. గోరువెచ్చని నీటితో కడిగేసి మాయిశ్చరైజర్ రాసుకుంటే పాదాలు కాంతివంతంగా కనిపిస్తుంది.

తేనెతో మెరుపు:

Advertisement

తేనె ఒక సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌. పాదాల పగుళ్లపై తేనెను అప్లై చేసి కొద్ది నిమిషాల పాటు మసాజ్ చేస్తుండాలి. 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే.. పాదాలకు అవసరమైన తడి అందడంతో అవి కోమలంగా తయారవుతాయి.

అలోవెరా ప్రభావం:

చర్మానికి తేమ అందించడమే కాకుండా రిపేర్ చేసే గుణం కలబందకు ఉంది. తాజా కలబంద గుజ్జును పాదాలకు రాసి కాసేపు ఆరనివ్వాలి. రోజుకు రెండుసార్లు ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల పాదాల పగుళ్లు తగ్గి, సున్నితంగా మారుతుంది. అయితే పై చిట్కాలన్నీ పాటించేటప్పుడు పాదాలపై ఏదైనా గాయాలు లేదా ఇన్ఫెక్షన్లు ఉంటే అవి తగ్గిన తర్వాతే ఈ ప్రయత్నాలు చేయాలి.

Also Read: ప్రసవం తర్వాత మళ్లీ మునుపటిలా స్ట్రాంగ్‌ అవ్వాలా? అమ్మమ్మల కాలం నాటి ఆ లడ్డూ రహస్యం ఇదే!

 

 

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×