E-Paper
Advertisement

Weight loss drinks: డైలీ మార్నింగ్ ఈ డ్రింక్స్ తాగితే.. వద్దన్నా బరువు తగ్గుతారు తెలుసా ?

Weight loss drinks: డైలీ మార్నింగ్ ఈ డ్రింక్స్ తాగితే.. వద్దన్నా బరువు తగ్గుతారు తెలుసా ?
Advertisement

Weight loss drinks: సమ్మర్ వచ్చిందంటే చాలు ఉక్కపోత, దాహం మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. అయితే.. ఈ కాలాన్ని బరువు తగ్గడానికి ఒక మంచి అవకాశంగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా ఎండల వల్ల మన శరీరం త్వరగా నీటిని కోల్పోతుంది. కాబట్టి ఉదయాన్నే తీసుకునే డ్రింక్స్ మనల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచడమే కాకుండా.. శరీరంలోని అనవసర కొవ్వును కరిగించడానికి దోహదపడతాయి. ప్రకృతి సిద్ధంగా లభించే వస్తువులతో.. ఇంట్లోనే తయారు చేసుకునే ఈ డ్రింక్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ వేసవిలో బరువు తగ్గడానికి ఏయే డ్రింక్స్ తాగాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

వేసవిలో బరువు తగ్గడానికి ఉత్తమ డ్రింక్స్
నిమ్మరసం , తేనె :
వేసవి ఉదయాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన డ్రింక్స్ నిమ్మరసం. గోరు వెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసం , ఒక చెంచా తేనె కలిపి తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. దీని వల్ల మనం తిన్న ఆహారం త్వరగా శక్తిగా మారుతుంది. అంతే కాకుండా కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. వేసవిలో శరీరానికి చలువ చేయడానికి ఇది ఒక సులభమైన.

Advertisement

జీలకర్ర నీరు:
జీలకర్ర కేవలం వంటలకే కాకుండా బరువు తగ్గడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. రాత్రి పూట ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా జీలకర్ర వేసి నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని మరిగించి వడకట్టుకుని తాగాలి. జీల కర్ర శరీరంలోని జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇది ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడానికి బాగా తోడ్పడుతుంది. వేసవిలో వచ్చే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి కూడా ఇది ఉపశమనం కలిగిస్తుంది.

మెంతుల నీరు :
బరువు తగ్గాలని కఠినమైన నియమాలు పాటించే వారికి మెంతుల నీరు ఒక గొప్ప వరం. రాత్రి నానబెట్టిన మెంతుల నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. దీని వల్ల మనం అనవసరమైన ఆహారం తీసుకోకుండా ఉంటాము. మెంతుల్లో ఉండే పీచు పదార్థం రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. వేసవిలో ఈ నీటిని తాగడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా.. చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది.

Advertisement

Also Read: ఆకుపచ్చ ద్రాక్ష Vs నల్లటి ద్రాక్ష.. ఏవి ఆరోగ్యానికి బెస్ట్ ?

సబ్జా గింజల డ్రింక్:
వేసవి కాలంలో సబ్జా గింజలు ఇచ్చే ఉపశమనం అంతా ఇంతా కాదు. ఇవి నీటిని పీల్చుకుని ఉబ్బుతాయి. ఉదయాన్నే నీటిలో నానబెట్టిన సబ్జా గింజలను నిమ్మరసంతో కలిపి తాగడం వల్ల కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది బరువు తగ్గడానికి చాలా కీలకం. సబ్జా గింజలు శరీర వేడిని తగ్గించి, పేగుల ఆరోగ్యాన్ని కాపాడతాయి. అధిక బరువుతో బాధపడేవారు వేసవిలో రోజూ దీన్ని తీసుకోవడం వల్ల తక్కువ కాలంలోనే మంచి మార్పును గమనించవచ్చు.

పైన పేర్కొన్న డ్రింక్స్ కేవలం బరువు తగ్గడానికే కాకుండా.. వేసవిలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయ పడతాయి. వీటితో పాటు తగినంత నీరు తాగడం, సరైన ఆహారం తీసుకోవడం కూడా ముఖ్యం. ఎలాంటి రసాయనాలు లేని ఈ సహజ డ్రింక్స్ మీ లైఫ్ స్టైల్ లో భాగం చేసుకోండి. క్రమం తప్పకుండా పాటిస్తే.. ఈ వేసవి ముగిసేలోపు మీరు కోరుకున్న శరీర ఆకృతిని పొందవచ్చు. ఆరోగ్యకరమైన అలవాట్లే మిమ్మల్ని ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంచుతాయి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×