E-Paper
Advertisement

వర్షాకాలంలో జుట్టు రాలడం, చుండ్రు సమస్యలా ?

వర్షాకాలంలో జుట్టు రాలడం, చుండ్రు సమస్యలా ?
Advertisement

Monsoon Hair Care Tips: వర్షాకాలం రాగానే వాతావరణం చల్లగా మారి మనసుకు హ్యాపీగా అనిపిస్తుంది కానీ, మన జుట్టుకు మాత్రం పెద్ద తిప్పలే వస్తాయి. గాలిలో ఉండే విపరీతమైన తేమ వల్ల ఈ సీజన్‌లో జుట్టు విపరీతంగా రాలిపోవడం, స్కాల్ప్ జిడ్డుగా మారి చుండ్రు పెరగడం చాలా కామన్. పార్లర్లకు వెళ్లి వేలల్లో ఖర్చు పెట్టే కంటే, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే దొరికే వస్తువులతో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. వర్షాకాలంలో మీ జుట్టును సిల్కీగా, హెల్తీగా మార్చే 5 సూపర్ హోమ్ రెమెడీస్ ఇప్పుడు చూద్దాం!

జుట్టు రాలడం తగ్గించి, చుండ్రును మాయం చేసే మ్యాజికల్ టిప్స్ :

Advertisement

1. మెంతులు , పెరుగు ప్యాక్ :
చుండ్రును వదిలించడంలో మెంతులు నంబర్ వన్ అని చెప్పొచ్చు. మెంతుల్లో ఉండే నికోటినిక్ యాసిడ్ జుట్టు రాలడాన్ని అడ్డుకుంటుంది.

ఎలా వాడాలి: రెండు చెంచాల మెంతులను రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే పేస్ట్‌లా చేయండి. దీన్ని మూడు చెంచాల పెరుగుతో కలిపి స్కాల్ప్‌కు రాయండి. 30 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో కడిగేయండి.

Advertisement

2. వేప, నిమ్మరసం టోనర్ :
వర్షాకాలంలో స్కాల్ప్‌పై ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు రావడం వల్ల చుండ్రు ఎక్కువవుతుంది. వేపలోని యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు దీనికి పర్ఫెక్ట్ మెడిసిన్.

ఎలా వాడాలి: కొన్ని వేపాకులను నీళ్లలో వేసి బాగా మరిగించండి. ఆ నీరు చల్లారాక కొద్దిగా నిమ్మరసం కలపండి. తలస్నానం చేయడానికి గంట ముందు ఈ నీటిని జుట్టు కుదుళ్లకు పట్టించండి.

3. అలోవెరా జెల్ మ్యాజిక్ :
తేమ వల్ల జుట్టు చిట్లిపోవడం, డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అలోవెరా జుట్టుకు బెస్ట్ నేచురల్ కండిషనర్‌లా పనిచేస్తుంది.

ఎలా వాడాలి: కలబంద మొక్క నుంచి ఫ్రెష్ జెల్ తీసి నేరుగా స్కాల్ప్‌కు అప్లై చేసి మసాజ్ చేయండి. ఇది స్కాల్ప్‌ను చల్లబరిచి, జుట్టుకు మంచి షైనింగ్ ఇస్తుంది.

4. ఉల్లిపాయ రసం :
జుట్టు రాలడం తక్షణమే తగ్గడానికి ఉల్లిపాయ రసం ఒక అద్భుతమైన రెమెడీ. ఇందులో ఉండే సల్ఫర్ కొత్త జుట్టు మొలవడానికి హెల్ప్ అవుతుంది.

ఎలా వాడాలి: ఒక ఉల్లిపాయను మిక్సీ పట్టి రసం తీయండి. కాటన్ బాల్ సహాయంతో ..ఈ రసాన్ని స్కాల్ప్‌కు పట్టించి 20 నిమిషాల తర్వాత వాష్ చేయండి. వారానికి రెండు సార్లు చేస్తే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది.

5. కొబ్బరి నూనె, కరివేపాకు మసాజ్ :
వర్షాకాలంలో జుట్టుకు ఆయిల్ పెట్టడం మానేస్తారు. కానీ అది తప్పు. జుట్టుకు పోషణ అందాలంటే వారానికి ఒక్కసారైనా హాట్ ఆయిల్ మసాజ్ అవసరం.

ఎలా వాడాలి: కొద్దిగా కొబ్బరి నూనెలో గుప్పెడు కరివేపాకులు వేసి వేడి చేయండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు పట్టించి మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి జుట్టు స్ట్రాంగ్‌గా మారుతుంది.

వర్షాకాలంలో చేయకూడని తప్పులు :
తడి జుట్టు: వర్షంలో తడిస్తే వెంటనే తలస్నానం చేయండి. తడి జుట్టుతో అస్సలు దువ్వకూడదు, ఎందుకంటే ఆ సమయంలో కుదుళ్లు చాలా బలహీనంగా ఉంటాయి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×