E-Paper
Advertisement

వర్షాకాలంలో కిడ్నీ సమస్యలకు కారణమయ్యే ఆ తప్పు మీరూ చేస్తున్నారా?

వర్షాకాలంలో కిడ్నీ సమస్యలకు కారణమయ్యే ఆ తప్పు మీరూ చేస్తున్నారా?
Advertisement

Monsoon Dehydration: చలికాలం, ఎండాకాలంలోనే కాదు.. వర్షాకాలంలో కూడా డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చల్లటి వాతావరణం వల్ల మనకు దాహం వేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. వానాకాలంలో చల్లని గాలుల వలన నీరు ఎక్కువగా తాగడానికి చాలామంది ఇష్టపడరు. దీంతో శరీరంలో తీవ్రమైన వేడికి గురవుతుంది. దీంతో డీహైడ్రేషన్ సమస్య తలెత్తి.. కిడ్నీల మీద ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.

వానాకాలంలో డీహైడ్రేషన్ ఎందుకు?

వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండటంతో చాలామంది నీళ్లు తాగడం బాగా తగ్గిస్తారు. అయితే, ఈ కాలంలో గాలిలో ఉండే తేమ (హ్యుమిడిటీ) వల్ల మనకు తెలియకుండానే చెమట రూపంలో శరీరం నుంచి నీరు బయటకు పోతుంది. పైగా వర్షాకాలంలో వచ్చే విరేచనాలు, వాంతులు, జ్వరాల వల్ల కూడా ఒంట్లో నీటి శాతం వేగంగా తగ్గిపోయి డీహైడ్రేషన్ ముప్పు పెరుగుతుంది.

Advertisement

Also Read: కీటకాలు, నెగటివ్ ఎనర్జీ మాయం.. ఇంటి మెయిన్ డోర్ వద్ద ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!

కిడ్నీలపై తీవ్ర ప్రభావం:

ఒంట్లో నీటి శాతం తగ్గినప్పుడు కిడ్నీలకు రక్తప్రసరణ మందగిస్తుంది. దీనివల్ల కిడ్నీల పనితీరు హఠాత్తుగా దెబ్బతిని ‘అక్యూట్ కిడ్నీ ఇంజూరీ’ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే మూత్రం బాగా చిక్కగా మారిపోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడటం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు (UTI) వంటి సమస్యలు కూడా ఈ కాలంలో ఎక్కువగా వస్తుంటాయి.

ఎవరికి ముప్పు ఎక్కువ?

Advertisement

ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, డయాబెటిస్ లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఈ ముప్పు చాలా ఎక్కువ. అలాగే ఎక్కువ సమయం ఏసీల్లో ఉంటూ నీళ్లకు బదులు టీ, కాఫీలు ఎక్కువగా తాగే ఆఫీస్ ఉద్యోగులు కూడా సులభంగా డీహైడ్రేషన్‌కు గురవుతారు.

సురక్షితంగా ఉండాలంటే?

దాహం వేయకపోయినా రోజుకు సరిపడా మంచి నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. కేవలం నీళ్లే కాకుండా మజ్జిగ, ఉప్పు కలిపిన నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అందుతాయి. మూత్రం రంగు లేత పసుపు లేదా తెల్లగా ఉంటే తగినంత నీరు తాగుతున్నారని అర్థం. వానాకాలంలోనూ కిడ్నీలను సురక్షితంగా ఉంచుకోవడానికి నీరు తాగడం అస్సలు మర్చిపోకూడదు.

Also Read: వాషింగ్ మెషీన్‌లో వెనిగర్ వేస్తే ఏమౌతుందో తెలుసా? ఇన్నాళ్లూ ఈ సూపర్ ట్రిక్ తెలియక నష్టపోయాం!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×