E-Paper
Advertisement

Facepack: కేవలం యాభై రూపాయలతో ముఖాన్ని ఇలా మెరిపించేయండి, ఇదొక్కటి చాలు

Facepack: కేవలం యాభై రూపాయలతో ముఖాన్ని ఇలా మెరిపించేయండి, ఇదొక్కటి చాలు
Advertisement

ఆధునిక కాలం అందమైన, మెరిసే చర్మం కోసం ఖరీదైన క్రీములు, ఫేస్ ప్యాక్‌లు వాడుతున్నవారు అధికంగా ఉన్నారు. వేల రూపాయలు ఖర్చు చేసినా చర్మానికి మెరుపు రాకపోవడంతో బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో కేవలం యాభై రూపాయలు మాత్రమే ఖర్చుతో ఇంట్లోనే తయారు చేసుకునే ఒక మాచా ఫేస్ ప్యాక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా డల్‌గా, అలసటగా కనిపించే చర్మం ఉన్నవారు ఈ ప్యాక్ వాడి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అందుకే ఈ మ్యాచా ఫేస్ ప్యాక్ ఇప్పుడు యువతలోనే కాకుండా… గృహిణులు, ఉద్యోగులు కూడా ఈ చిట్కాను పాటిస్తున్నారు.

మాచా అంటే ఏమిటి
మాచా అనేది ఒక ప్రత్యేకమైన గ్రీన్ టీ పొడి. ఇందులో చర్మానికి ఉపయోగపడే యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ముఖంపై పేరుకుపోయే మురికి, కాలుష్యం ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ ఎండలో తిరగడం, దుమ్ము, పొగ వల్ల చర్మం తన సహజమైన కాంతిని కోల్పోతుంది. అప్పుడు చర్మం డల్‌గా, నల్లగా కనిపిస్తుంది. మాచాలో ఉండే గుణాలు చర్మాన్ని లోపల నుంచి శుభ్రం చేయడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే మాచా చర్మాన్ని కూల్‌గా ఉంచి, ఆయిల్ ఎక్కువగా వచ్చే సమస్యను కూడా కొంతవరకు తగ్గిస్తుంది. అందుకే ఈ మాచా ఫేస్ ప్యాక్ వాడితే ముఖం తాజాగా, ప్రకాశంగా కనిపిస్తుందని చాలామంది చెబుతున్నారు.

Advertisement

Also read: Relationships: ఇలాంటి వ్యక్తితో బతకడం కష్టమనిపిస్తోంది.. అతనితో ఉండాలా? విడిపోవాలా?

ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి?
ఈ వైరల్ ఫేస్ ప్యాక్ తయారు చేయడం చాలా సులువు. దీనికి అవసరమయ్యే పదార్థాలు కూడా చాలా తక్కువే. ఒక టీ స్పూన్ మాచా పొడి, ఒక టీ స్పూన్ ముల్తాని మట్టి, ఒకటి లేదా రెండు టీ స్పూన్లు పెరుగు లేదా తేనె అవసరం. ఈ మూడు పదార్థాలను ఒక చిన్న గిన్నెలో వేసి మెత్తగా కలపాలి. గడ్డలు లేకుండా పేస్ట్‌లా తయారు చేయాలి. తర్వాత శుభ్రమైన ముఖంపై ఈ ప్యాక్‌ను సమానంగా అప్లై చేయాలి. సుమారు 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. పూర్తిగా ఆరిపోకుండా చూసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని నెమ్మదిగా కడగాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు వాడితే చర్మం మెత్తగా, కాంతిగా మారుతుందని చెబుతున్నారు.

Advertisement

వాడేముందు జాగ్రత్తలు…
ఈ మాచా ఫేస్ ప్యాక్ ఎంత వైరల్ అయినా అందరికీ ఒకేలా పనిచేస్తుందనే గ్యారెంటీ లేదు. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయడం చాలా అవసరం. చేతి మీద లేదా చెవి వెనుక చిన్న మోతాదులో ప్యాక్ వేసి చూడాలి. ఎలాంటి మంట, దురద లేకపోతేనే ముఖానికి వాడాలి. అలాగే ప్రతిరోజూ ఈ ప్యాక్ వాడకూడదు. అవసరానికి మించి వాడితే చర్మం డ్రై అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నిపుణుల సూచనలతో జాగ్రత్తగా వాడితేనే మంచి ఫలితం కనిపిస్తుంది. తక్కువ ఖర్చుతో అందంగా మారాలనుకునే వారికి ఈ మాచా ఫేస్ ప్యాక్ ఒక మంచి ఎంపికగా మారిందని చెప్పొచ్చు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×