E-Paper
Advertisement

Aloo Paratha: పంజాబీ స్టైల్లో ఆలూ పరాటా ఇలా చేసేయండి, రెండు మూడు తినేయాలనిపిస్తుంది

Aloo Paratha: పంజాబీ స్టైల్లో ఆలూ పరాటా ఇలా చేసేయండి, రెండు మూడు తినేయాలనిపిస్తుంది
Advertisement

ఆలూ పరాటా పేరు చెబితేనే నోరూరిపోతుంది. ఇది సాంప్రదాయ భారతీయ వంటకాలలో ఒకటి. ముఖ్యంగా పంజాబ్‌లో ఆలూ పరాటాకు అభిమానులు ఎక్కువ. దాదాపు ప్రతిరోజు వారు ఆలూ పరాటా తినేందుకు ఇష్టపడతారు. మహారాష్ట్రలో కూడా ఆలూ పరాటాలు అధికంగానే తింటారు. బంగాళదుంప మసాలాలు దట్టించి చేసే ఈ ఆలూ పరాటా రెసిపీ చాలా సులువు. దీన్ని లంచ్ లోను, అల్పాహారంలోనూ, డిన్నర్లో కూడా తినవచ్చు. ఈ ఆలూ పరాటా తినేందుకు పక్కన ఎలాంటి చట్నీ, కూరా లేకపోయినా ఫరవాలేదు. దీని రుచి ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది. ఆలూ పరాటా రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

కావాల్సిన పదార్థాలు
గోధుమపిండి – రెండు కప్పులు
ఉప్పు – రుచికి సరిపడా
నీరు – తగినంత
నూనె – ఒక స్పూను
బంగాళదుంపలు – మూడు
ఉల్లిపాయ – ఒకటి
పచ్చిమిర్చి – రెండు
కొత్తిమీర తరుగు – అర స్పూను
కారం – అర స్పూను
గరం మసాలా – అర స్పూను
ఆమ్చూర్ పొడి – అర స్పూను
జీలకర్ర – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
నెయ్యి – అరకప్పు

Advertisement

పంజాబీ స్టైల్ లో ఆలూ పరాటా రెసిపీ
1. ఆలూ పరాటా తయారు చేయడానికి ముందుగా గోధుమ పిండిని తీసుకుని గిన్నెలో వేయాలి.
2. రుచికి సరిపడా ఉప్పును వేసి నీరు కూడా పోసి మెత్తగా పిండిలా కలుపుకోవాలి.
3. ఒక స్పూన్ నూనె కూడా జోడిస్తే పరాటా మెత్తగా, మృదువుగా వస్తుంది.
4. ఇప్పుడు ఆ చపాతీ పిండి మీద మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టేయండి.
5. ఇప్పుడు బంగాళదుంపలను ఉడికించి పైన పొట్టు తీసి ఒక గిన్నెలో వేయాలి.
6. చేత్తోనే వాటిని మెత్తగా మెదపాలి. అందులోనే ఉల్లిపాయల తరుగును, పచ్చిమిర్చి తరుగును, కొత్తిమీర తరుగు, కారం, గరం మసాలా, ఆమ్చూర్ పొడి, జీలకర్ర పొడి, అర స్పూను ఉప్పు వేసి బాగా కలపాలి.
7. కొత్తిమీర తరుగును కూడా వేసి బాగా కలుపుకోవాలి.
8. ఇప్పుడు చపాతీ పిండి నుంచి కొంత ముద్దను తీసి చిన్న పూరీలా వత్తాలి.
9. బంగాళదుంప మిశ్రమాన్ని కొంత తీసి పూరీ మధ్యలో పెట్టాలి.
10. ఈ మొత్తాన్ని కవర్ చేసి రౌండ్ గా చేసుకోవాలి.
11. ఇప్పుడు దాన్ని పరాటాలా వత్తాలి.
12. స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి వేయాలి. ఈ పరాటాను రెండు వైపులా కాల్చాలి. అంతే టేస్టీ ఆలూ పరాటా రెడీ అయినట్టే.
ఇది పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. ఆలూ పరాటాను ఒక్కసారి తిన్నారంటే మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. పంజాబీ స్టైల్ లో చేసే ఈ ఆలూ పరాటా మీ ఇంటిల్లిపాదికి మంచి విందులా అనిపించడం ఖాయం.

Also Read: అన్నం మిగిలిపోతే పడేయకుండా ఇలా దోశలు వేసేయండి, రెసిపీ ఇదిగో

Advertisement

ఆలూ పరాటా తినేటప్పుడు కాస్త బటర్ రాసుకుంటే టేస్టీగా ఉంటుంది. లేదా నిమ్మకాయ పికెల్ అద్దుకొని తిన్నా రుచిగా ఉంటుంది. పంజాబ్లో ఆలూ పరాటాన్ని పెరుగులో ముంచుకుని తింటూ ఉంటారు. అలాగే పుదీనా చట్నీతో కూడా తింటారు. ఎలా తిన్న ఇది రుచిలో అద్భుతమైన చెప్పాలి. ఆలూ పరాటాను చికెన్ గ్రేవీ తో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×