E-Paper
Advertisement

Sankrathi 2026 Wishes: సంక్రాంతి సందర్భంగా.. మీ ఆత్మీయులకు స్పెషల్ విషెస్ చెప్పండిలా !

Sankrathi 2026 Wishes: సంక్రాంతి సందర్భంగా.. మీ ఆత్మీయులకు స్పెషల్ విషెస్ చెప్పండిలా !
Advertisement

Sankrathi 2026 Wishes: తెలుగువారి లోగిళ్లలో సరికొత్త వెలుగులు నింపే పండగ సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ సమయం ప్రకృతిలోనూ, మనుషులలోనూ సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. భోగి మంటల వెచ్చదనం, ముంగిట ముగ్గుల అందం, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు పల్లెటూరి సంప్రదాయాన్ని కళ్లకు కడతాయి. ఇది కేవలం పంటల పండగే కాదు, బంధుమిత్రుల కలయికకు, దానధర్మాలకు నెలవు. ఈ పవిత్రమైన మకర సంక్రాంతి సందర్భంగా మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపాల్సిన ఆత్మీయ సందేశాలు కొన్ని మీకోసం.

సంక్రాంతి శుభాకాంక్షలకు సంబంధించి మెసేజ్‌లు:

Advertisement

1.భోగి మంటల వెచ్చదనం, సంక్రాంతి కాంతులు మీ జీవితంలో నిరంతరం వెలుగులు నింపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు!

2.ఈ సంక్రాంతి మీ ఇంట్లో సిరిసంపదలను, మీ మనసులో సుఖశాంతులను నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. హ్యాపీ సంక్రాంతి!

Advertisement

3. ఈ పండగ వేళ మన బంధం మరిన్ని మధుర జ్ఞాపకాలతో నిండాలి. మీకు, మీ కుటుంబానికి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు రా!

4. గాలిపటాల పోటీలు, పిండివంటల రుచులు.. మన చిన్ననాటి పండగ సరదాలు మళ్లీ గుర్తుకొస్తున్నాయి. ఈ పండగ మీకు విపరీతమైన ఆనందాన్ని ఇవ్వాలి. హ్యాపీ సంక్రాంతి

5. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.

6. పంట చేతికొచ్చిన రైతుకు కలిగే ఆనందం మీ జీవితంలో ప్రతిరోజూ ఉండాలని ఆశిస్తూ.. సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

7. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన ఈ శుభవేళ.. మీలోని అజ్ఞానమనే చీకటి తొలగి, జ్ఞానమనే వెలుగు ప్రసరించాలని కోరుకుంటూ.. మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

8.హరిదాసుల కీర్తనల పరమార్థం, బసవన్నల దీవెనలు మీ ఇంట శుభాలను చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను. హ్యాపీ సంక్రాంతి

9.ముంగిట ముగ్గులు.. ముత్యాల రంగులు.. పచ్చని పొలాలు.. పడగెత్తే ఆశలు.. తెలుగు వారి సంస్కృతి.. ఈ సంక్రాంతి రీతి.. మీకు, మీ కుటుంబానికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు!

10.భోగి మంటల వెచ్చదనంతో మీలోని కష్టాలన్నీ కాలిపోవాలని, సంక్రాంతి కాంతులతో మీ ఇంట సుఖశాంతులు వెల్లివిరియాలని, కనుమ సంబరాలు మీ జీవితంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు!

11.రంగురంగుల ముగ్గుల హరివిల్లులా.. గాలిపటాల సరదా సందడిలా.. కొత్త బియ్యపు పాయసం తీపిలా.. ఈ పండగ మీ జీవితంలో మధురమైన జ్ఞాపకాలను మిగల్చాలని ఆశిస్తున్నాను. హ్యాపీ సంక్రాంతి!

12.గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనల మధ్య మన తెలుగు సంస్కృతి ప్రతిబింబించే ఈ గొప్ప పండగ వేళ.. ఆ సూర్యభగవానుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని, మీరు తలపెట్టిన ప్రతి కార్యం దిగ్విజయంగా పూర్తి కావాలని కోరుకుంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు!

13.పచ్చని పైరుల పరవళ్లు.. సంక్రాంతి లక్ష్మికి ఆహ్వానాలు.. ఈ లోగిళ్ల పండగ మీ ఇంట్లో సిరిసంపదలను, ఆయురారోగ్యాలను నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు!

14. బంధుమిత్రుల కలయికతో, పిండివంటల ఘుమఘుమలతో మీ ఇల్లు ఒక నందనవనం కావాలని.. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మీ జీవితంలో ఒక గొప్ప మలుపు కావాలని కోరుకుంటూ.. మీకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు!

Tags

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×