E-Paper
Advertisement

Lungs Cancer: భారతీయ మహిళల్లో పెరిగిపోతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్, ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

Lungs Cancer: భారతీయ మహిళల్లో పెరిగిపోతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్, ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
Advertisement

ఇటీవలి కాలంలో మనదేశంలో మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకు ఈ వ్యాధి ఎక్కువగా పురుషుల్లో కనిపించేది. కానీ తాజాగా మహిళల్లో కూడా ఈ వ్యాధి పెరుగుతున్న రేటు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పొగ తాగే అలవాటు లేని మహిళల్లో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా రావడం వైద్యులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

కారణాలు ఇవే
వైద్యులు చెబుతున్న ప్రకారం మహిళల్లో ఈ క్యాన్సర్ పెరగడానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వంటకు కట్టెలు, బొగ్గు, చెరకు వంటి ఇంధనాలను ఇంకా చాలామంది వాడుతున్నారు. ఈ వంట పొగలో ఉండే హానికర రసాయనాలు నేరుగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతాయి. ఇక పట్టణాల్లో గాలి కాలుష్యం పెరగడం కూడా ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. వాహనాల కాలుష్యం, ధూమపానం, నిర్మాణ ప్రాంతాల్లోని ధూళి, పరిశ్రమల పొగవల్ల మహిళలు రోజూ హానికర గాలిని పీలుస్తున్నారు. అదే విధంగా ఇంట్లో కుటుంబ సభ్యులు పొగతాగితే, ఆ పొగను మహిళలు పరోక్షంగా పీల్చడం వల్ల ‘పాసివ్ స్మోకింగ్’ ప్రమాదం పెరుగుతోంది. కొంతమంది వైద్యుల అభిప్రాయం ప్రకారం హార్మోన్ మార్పులు కూడా మహిళల్లో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతోంది. అలాగే వంటగదిలో సరైన గాలి ప్రసరణ లేకపోవడం, గ్యాస్ వాసనలు కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని చెబుతున్నారు.

Advertisement

ఈ లక్షణాలు కనిపిస్తే
ఈ వ్యాధి ప్రారంభ దశల్లో స్పష్టమైన లక్షణాలు కనిపించవు. అయితే కొన్ని సంకేతాలను గమనిస్తే ముందస్తుగా చికిత్స పొందవచ్చు. ఎక్కువ కాలం పాటూ దగ్గు వేధించడం, శ్వాసలో ఇబ్బంది, ఛాతి నొప్పి, రక్తం కలిసిన కఫం, బరువు తగ్గిపోవడం, అలసట, గొంతు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను మొదటి లేదా రెండో దశలో గుర్తిస్తే చికిత్స ప్రభావం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. కానీ భారతదేశంలో మహిళల్లో ఎక్కువగా ఈ వ్యాధి మూడో లేదా నాలుగో దశలోనే బయటపడుతోంది. దీనికి కారణం లక్షణాలను పట్టించుకోకపోడం, ఆరోగ్య పరీక్షలను వాయిదా వేయడం, కుటుంబ బాధ్యతలతో బిజీగా ఉండటం వంటివి.

పరీక్షలు, చికిత్స ఎలా?
వైద్యులు CT స్కాన్, PET స్కాన్, బయాప్సీ వంటి పరీక్షల ద్వారా ఈ క్యాన్సర్‌ను గుర్తిస్తారు. చికిత్సలో శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియేషన్ చికిత్స, ఇమ్యూనోథెరపీ వంటి పద్ధతుల్ని రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉపయోగిస్తారు. మహిళలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా జాగ్రత్తగా ఉండవచ్చు. వంటగదిలో గాలిప్రసరణ జరిగేలా చూసుకోవాలి. పొగ ఉత్పత్తి అయ్యే ఇంధనాలను వాడకూడదు. పాసివ్ స్మోకింగ్‌కు దూరంగా ఉండాలి. గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో మాస్క్ ధరించాలి. సంవత్సరానికి ఒకసారి ఊపిరితిత్తుల ఆరోగ్య పరీక్ష చేయించుకోవాలి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×