// // Low Blood Pressure: లో బీపీని నిర్లక్ష్యం చేస్తున్నారా ? -->
E-Paper
Advertisement

Low Blood Pressure: సైలెంట్ కిల్లర్‌గా మారే లో బీపీ.. దీన్ని అస్సలు లైట్ తీసుకోవద్దు

Low Blood Pressure: సైలెంట్ కిల్లర్‌గా మారే లో బీపీ.. దీన్ని అస్సలు లైట్ తీసుకోవద్దు
Advertisement

Low Blood Pressure: సాధారణంగా చాలామంది హై బీపీ గురించి భయపడతారు కానీ.. లో బీపీ లేదా హైపోటెన్షన్ గురించి పెద్దగా పట్టించుకోరు. బీపీ ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉండటం వల్ల ప్రాణాపాయం లేదని అనుకోవడం పొరపాటు. అందుకే “లో బీపీని లైట్ తీసుకోవద్దు” అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తుంటారు. ఇంతకీ లో బీపీ అంటే ఏమిటి ? దాని లక్షణాలు, అది ఎందుకు ప్రమాదకరమో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

లో బీపీ అంటే ఏమిటి?
ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తికి రక్తపోటు 120/80 ఉండాలి. ఒకవేళ అది 90/60 కంటే తక్కువగా ఉంటే.. దానిని లో బీపీగా చెబుతారు. రక్తపోటు బాగా తగ్గిపోయినప్పుడు శరీరంలోని ముఖ్యమైన అవయవాలైన మెదడు, గుండె ,కిడ్నీలకు తగినంత ఆక్సిజన్, పోషకాలు అందవు.

Advertisement

ముఖ్యమైన లక్షణాలు:
లో బీపీ ఉన్నప్పుడు శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుంది. అవి..

తలతిరగడం లేదా కళ్లు తిరగడం: ఆకస్మికంగా కుర్చీలోంచి లేచినప్పుడు లేదా నడుస్తున్నప్పుడు కళ్లు బైర్లు కమ్మడం.

Advertisement

నీరసం: ఏ పని చేయకపోయినా విపరీతమైన అలసటగా అనిపించడం.

దృష్టి మందగించడం: కళ్లు మసకబారినట్లు అనిపించడం.

ఏకాగ్రత లోపించడం: దేనిపైనా దృష్టి పెట్టలేకపోవడం.

చల్లని చర్మం: శరీరం అకస్మాత్తుగా చల్లబడటం లేదా చెమటలు పట్టడం.

ఎందుకు ప్రమాదకరం?
లో బీపీని నిర్లక్ష్యం చేస్తే అది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

అవయవాలు దెబ్బతినడం: రక్తప్రసరణ సరిగ్గా లేకపోతే అవయవాలకు ఆక్సిజన్ అందక అవి దెబ్బతినే అవకాశం ఉంది. ముఖ్యంగా కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువ.

గుండె సమస్యలు: గుండెకు రక్తాన్ని పంపింగ్ చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. ఇది దీర్ఘకాలంలో గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది.

మెదడుకు ముప్పు: మెదడుకు రక్తప్రసరణ తగ్గితే స్పృహ తప్పి పడిపోవడం జరుగుతుంది. ఇలా పడిపోయినప్పుడు తలకు దెబ్బలు తగిలే ప్రమాదం ఉంది.

షాక్ : బీపీ అతిగా పడిపోతే మనిషి షాక్‌లోకి వెళ్లి ప్రాణాపాయం సంభవించవచ్చు.

కారణాలు ఏంటి ?
శరీరంలో నీటి శాతం తగ్గడం , గర్భం దాల్చడం, పోషకాహార లోపం (ముఖ్యంగా విటమిన్ B12, ఫోలేట్), హార్మోన్ల అసమతుల్యత లేదా కొన్ని రకాల మందుల వాడకం వల్ల లో బీపీ రావచ్చు.

Also Read: ఈ ఒక్క డ్రింక్‌తో.. ఆరోగ్య సమస్యలన్నీ పరార్

ఏం చేయాలి ?
ఉప్పు, నీరు: డాక్టర్ సలహా మేరకు ఆహారంలో కొంచెం ఉప్పు పెంచడం, తగినంత నీరు తాగడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది.

చిన్న చిన్న ఆహారాలు: ఒకేసారి ఎక్కువ ఆహారం తినకుండా.. తక్కువ మోతాదులో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవాలి.

కాఫీ లేదా టీ: బీపీ అకస్మాత్తుగా తగ్గినప్పుడు కప్పు కాఫీ లేదా టీ తాగడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుంది.

వ్యాయామం: క్రమబద్ధమైన వ్యాయామం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

లో బీపీని కేవలం నీరసంగా భావించి వదిలేయకూడదు. తరచుగా పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తుంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించి, సరైన కారణాన్ని తెలుసుకోవాలి. సరైన లైఫ్ స్టైల్, సమతుల్య ఆహారంతో దీనిని సులభంగా జయించవచ్చు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×