E-Paper
Advertisement

Diabetes Risk: ఒంటరిగా ఉంటున్నారా? అయితే జాగ్రత్త.. మీకు షుగర్ వచ్చే ఛాన్స్ 50% ఎక్కువట!

Diabetes Risk: ఒంటరిగా ఉంటున్నారా? అయితే జాగ్రత్త.. మీకు షుగర్ వచ్చే ఛాన్స్ 50% ఎక్కువట!
Advertisement

Diabetes Risk: ఎక్కువ సమయం ఒంటరిగా గడిపేవారిలో షుగర్ వస్తుందని మీకు తెలుసా? ఏంటీ షాక్ అవుతున్నారా.. అవును మీరు విన్నది నిజమే! కొన్నిసార్లు చుట్టూ వందల మంది ఉన్నా, లోలోపల ఒంటరితనంతో కుమిలిపోయే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే, ఈ ఒంటరితనం కేవలం మనసును మాత్రమే కాదు, నేరుగా మనిషి రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సామాజిక దూరం పెరిగేకొద్దీ శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరిగి, అది టైప్-2 డయాబెటిస్‌కు దారితీసే ప్రమాదం ఉందని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.

ఒత్తిడి హార్మోన్ పెరగడం:

మనం ఒంటరిగా ఉన్నప్పుడు మన శరీరం నిరంతరం ఒక రకమైన ఆందోళనకు గురవుతుంది. దీనివల్ల శరీరంలో కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ పెరగడం వల్ల ఇన్సులిన్ పనితీరు మందగించి, కణాలకు గ్లూకోజ్ అందకుండా పోతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర నిల్వలు పెరిగిపోతాయి. దీనికి తోడు ఒంటరితనం వల్ల కలిగే నిద్రలేమి సమస్య రోగ నిరోధక శక్తిని తగ్గించి, జీవక్రియలను అస్తవ్యస్తం చేస్తుంది. ఇది క్రమంగా థైరాయిడ్ వంటి ఇతర సమస్యలకు కూడా కారణమవుతుంది.

Advertisement

Also Read: ఏ రంగు పుచ్చకాయలో పోషకాలు అధికం? ఏది తింటే ఆరోగ్యానికి ఎక్కువ లాభం?

జీవనశైలిలో అనూహ్య మార్పులు:

ఒంటరిగా ఉండేవారిలో శారీరక శ్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. తోడు లేకపోవడం వల్ల బయటకు వెళ్లడం లేదా వ్యాయామం చేయడం వంటి పనులపై ఆసక్తి నశిస్తుంది. దీనివల్ల బరువు పెరగడం, శరీరంలో కొవ్వు పేరుకుపోవడం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా.. ఒంటరితనం ఇచ్చే డిప్రెషన్ వల్ల ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోతాయి. కొందరు అతిగా తినడం లేదా మరికొందరు సరైన సమయానికి పోషకాహారం తీసుకోకుండా జంక్ ఫుడ్స్ మీద ఆధారపడటం వల్ల డయాబెటిస్ రిస్క్ రెట్టింపు అవుతుంది.

ఆరోగ్యకరమైన అలవాట్లతో:

Advertisement

ఒంటరితనం నుంచి బయటపడటం అంటే.. కేవలం నలుగురిలో ఉండటం మాత్రమే కాదు. మనసు విప్పి మాట్లాడే ఆత్మీయులను కలిగి ఉండటం. స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడిపే సమయం శరీరంలో ఆక్సిటోసిన్ వంటి సంతోషాన్నిచ్చే హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇవి ఒత్తిడిని తగ్గించి రక్తపోటును, చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. కాబట్టి.. ఆరోగ్యకరమైన అలవాట్లతో పాటు, బలమైన సామాజిక బంధాలను ఏర్పరచుకోవడం మధుమేహాన్ని తరిమికొట్టడానికి మంచి మెడిసిన్‌లా పనిచేస్తుంది.

Also Read: పసుపు పుచ్చకాయలకు పెరిగిన డిమాండ్.. బెనిఫిట్స్ తెలిస్తే మీరూ వదలరు!

 

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×