E-Paper
Advertisement

Lingad Vegetable: సూపర్ ఫుడ్ అడవి లింగుడా.. మీ డైట్‌లో తప్పక ఉండాల్సిన శక్తివంతమైన కూరగాయ!

Lingad Vegetable: సూపర్ ఫుడ్ అడవి లింగుడా.. మీ డైట్‌లో తప్పక ఉండాల్సిన శక్తివంతమైన కూరగాయ!
Advertisement

Lingad Vegetable: చాలా అరుదుగా, ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ అడవుల్లో దొరికే ఒక ప్రత్యేకమైన కూరగాయ లింగుడా(Lingura). దీనిని ఇంగ్లీష్‌లో ఫిడిల్‌హెడ్ ఫెర్న్ అని పిలుస్తారు. ఈ కూరగాయ వర్షాకాలంలో మాత్రమే ఎక్కువగా దొరుకుతుంది. చేప, మాంసం లాంటి సాధారణ ఆహారాల కంటే.. ఎక్కువ పోషక విలువలతో నిండిన ఈ కూరగాయ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఇప్పుడు ఈ అరుదైన అడవి కూరగాయలో దాగిన ఔషధ గుణాలు, శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలేవో చూద్దాం.

ఆరోగ్య ప్రయోజనాలు:

* ఈ కూరగాయలో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాలు వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే కణ నష్టాన్ని నివారించి, గుండె సంబంధిత జబ్బులు, కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

Advertisement

Also Read: శరీరాన్ని లోపల నుంచే శుద్ధి చేసే బ్రోకోలీ మొలకలు.. ప్రయోజనాలు తెలిస్తే తప్పకుండా తింటారు!

* సాధారణంగా చేపలు, కొన్ని నట్స్‌లో లభించే ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు ఈ కూరగాయలో కూడా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించే ముఖ్యమైన పోషకాలుగా ఉపయోగపడతాయి.

Advertisement

* ఈ కూరగాయలో డైటరీ ఫైబర్ అధికంగా ఉండటంతో.. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి, మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అదనంగా, ఫైబర్ కారణంగా బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగకరమే.

* ఐరన్, విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన.. రక్త ఉత్పత్తి పెరిగి రక్తహీనత సమస్యను నివారించడంలో సహాయపడుతుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

* విటమిన్ A, బీటా-కెరోటిన్ అధికంగా ఉండటంతో, కంటి చూపును మెరుగుపరుస్తూ.. ముఖ్యంగా రేచీకటి సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి.

* అడవిలో దొరుకే లింగుడా కూరగాయ కేవలం కూర కోసం మాత్రమే కాదు.. ఇది ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన ఔషధం. తక్కువ కేలరీలు, అధిక పోషక విలువలు, రోగనిరోధక శక్తి పెంచే లక్షణాల కారణంగా, వర్షాకాలంలో దీన్ని ఆహారంలో తప్పక చేర్చుకోవడం మంచిది.

Also Read: అవకాడోలో దాగున్న పోషక రహస్యాలు.. గుండె, మెదడు, జీర్ణక్రియకు పూర్తి సంరక్షణ!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×