E-Paper
Advertisement

వంటగదిలో చిమ్నీ లేదా? ఈ చిన్న చిట్కాలతో పొగ, వాసనలకు చెక్ పెట్టండి!

వంటగదిలో చిమ్నీ లేదా? ఈ చిన్న చిట్కాలతో పొగ, వాసనలకు చెక్ పెట్టండి!
Advertisement

Kitchen Ventilation Tips: మనం చేసే వంట ఎంత రుచిగా ఉంటుందో,  చేసేటప్పుడు వచ్చే తాలింపు పొగ, మసాలా ఘాటు అంతా ఇల్లంతా వ్యాపిస్తాయి. ముఖ్యంగా చిన్న ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో చిమ్నీ లేకపోతే ఈ పొగ వల్ల కళ్లు మండటం, దగ్గు రావడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అంతే కాకుండా కిచెన్ గోడలు కూడా జిడ్డుగా మారి పోతాయి. అయితే.. చిమ్నీ లేనంత మాత్రాన చింతించాల్సిన పని లేదు. కొన్ని స్మార్ట్ చిట్కాలు , సహజమైన పద్ధతులను పాటించడం ద్వారా మీ వంట గదిని ఎల్లప్పుడూ తాజాగా ఉంచుకోవచ్చు.

సాధారణంగా మనం వంటల్లో తాలింపులు, మసాలాలు ఎక్కువగా వాడుతుంటాం. ఎండుమిర్చి, ఆవాలు చిటపటలాడినప్పుడు వచ్చే ఆ ‘ఘాటు’ ఇంటిల్లిపాదినీ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కిచెన్‌లో చిమ్నీ ఉంటే ఈ సమస్య తక్కువగా ఉంటుంది కానీ.. అది లేని వంటగదిలో గాలి ఆడక ఇబ్బందికరంగా మారుతుంది. చిమ్నీ లేకుండానే వంటగదిని ఫ్రెష్‌గా ఉంచుకోవడానికి  కొన్ని అద్భుతమైన మార్గాలున్నాయి.

వంటింటి కోసం బెస్ట్ టిప్స్:

Advertisement

1. క్రాస్ వెంటిలేషన్ పెంచండి:
వంట చేసేటప్పుడు కిచెన్ కిటికీలు , తలుపులు అన్నీ తెరిచి ఉంచండి. కిటికీకి ఎదురుగా ఉన్న తలుపు కూడా తీసి ఉంచడం వల్ల గాలి వేగంగా ప్రవహిస్తుంది. దీని వల్ల లోపల పేరుకుపోయిన వేడి గాలి, పొగ త్వరగా బయటకు వెళ్లిపోతాయి.

2. ఎగ్జాస్ట్ ఫ్యాన్:
చిమ్నీ లేని పక్షంలో మంచి నాణ్యత గల ‘హై-స్పీడ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్’ అమర్చుకోవడం బెస్ట్. ఇది వంట గదిలో పేరుకుపోయిన వేడిని, జిడ్డును బయటకు నెట్టివేయడంలో బాగా పని చేస్తుంది. వంట మొదలుపెట్టే ముందే దీన్ని ఆన్ చేయడం అలవాటు చేసుకోండి.

Advertisement

3. ఎయిర్ ప్యూరిఫైయర్ లేదా పోర్టబుల్ ఫ్యాన్లు:
మీకు కిటికీలు తక్కువగా ఉన్నట్లయితే.. ఒక చిన్న టేబుల్ ఫ్యాన్‌ను కిటికీ వైపు తిప్పి ఉంచండి. అది లోపలి పొగను బయటకు తోసేస్తుంది. ఇప్పుడు మార్కెట్లో ‘ఎయిర్ ప్యూరిఫైయర్లు’ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి గాలిలోని నూనె కణాలను, వాసనలను పీల్చుకుంటాయి.

4. సహజమైన గాలి  :
వంట అయిపోయాక కూడా ఆ ఘాటు వాసన పోకపోతే.. ఒక పాత్రలో నీళ్లు పోసి అందులో కొన్ని నిమ్మ చెక్కలు, దాల్చిన చెక్క లేదా లవంగాలు వేసి మరిగించండి. ఆ ఆవిరి ఇల్లంతా వ్యాపించి మంచి సువాసనను ఇస్తుంది. అలాగే.. ఒక గిన్నెలో వెనిగర్ లేదా బేకింగ్ సోడాను పోసి కిచెన్ మూలలో ఉంచితే.. అవి గాలిలోని దుర్వాసనను పీల్చుకుంటాయి.

5. ఇండోర్ ప్లాంట్స్ :
వంటగదిలో స్నేక్ ప్లాంట్ , మనీ ప్లాంట్ లేదా ఆలోవెరా వంటి మొక్కలను పెంచండి. ఇవి గాలి లోని కార్బన్ మోనాక్సైడ్ , ఇతర టాక్సిన్లను పీల్చుకుని ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. ఇవి కిచెన్‌కు అందాన్ని ఇవ్వడమే కాకుండా గాలిని కూడా శుద్ధి చేస్తాయి.

Also Read: ఫ్రిజ్‌లో స్పూన్ పెడితే.. ఆహారం ఎన్ని రోజులైనా పాడవ్వదు తెలుసా ?

6. ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం:
వంట చేసిన వెంటనే స్టౌ, గోడలు , కౌంటర్ టాప్‌ను తుడిచేయండి. నూనె జిడ్డు గోడలకు పడితే.. ఆ వాసన రోజుల తరబడి పోదు. వారానికి ఒకసారి గోడలను వేడి నీరు, డిష్ వాషింగ్ లిక్విడ్‌తో క్లీన్ చేయడం వల్ల కిచెన్ తాజాగా ఉంటుంది.

చిమ్నీ లేకపోయినా కేవలం కొద్దిపాటి జాగ్రత్తలు, సరైన వెంటిలేషన్ పద్ధతులతో మీ కిచెన్‌ను శుభ్రంగా ఉంచుకోవచ్చు. పైన చెప్పిన చిట్కాలు పాటిస్తే ఘాటైన వాసనలు మాయమై, మీ వంటగది ఆరోగ్యకరంగా మారుతుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×