E-Paper
Advertisement

Katte Pongali: నోటిలో పెడితే కరిగిపోయేలా కట్టె పొంగలి ఇలా చేసేయండి, ఇష్టంగా తింటారు

Katte Pongali: నోటిలో పెడితే కరిగిపోయేలా కట్టె పొంగలి ఇలా చేసేయండి, ఇష్టంగా తింటారు
Advertisement

Katte Pongali: దక్షిణ భారతదేశంలో కట్టె పొంగలి ఎంతో సంప్రదాయ వంటకం. ముఖ్యంగా పూజల సమయంలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టేందుకు కట్టె పొంగలి చేస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా ఇది బెస్ట్ రెసిపీ అనే చెప్పాలి. నోట్లో పెడితేనే కరిగిపోయేలా వండుకోవచ్చు. కట్టె పొంగలి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీన్ని బ్రేక్ ఫాస్ట్ గా తిన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. కమ్మని కట్టె పొంగలి ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము.

కట్టె పొంగలి రెసిపీకి కావలసిన పదార్థాలు
బియ్యం – ఒక కప్పు
పెసరపప్పు – అరకప్పు
ఇంగువ – చిటికెడు
జీడిపప్పులు – గుప్పెడు
అల్లం తరుగు – అర స్పూన్
జీలకర్ర – అర స్పూన్
మిరియాలు – ఒక స్పూను
కరివేపాకులు – గుప్పెడు
నెయ్యి – నాలుగు స్పూన్లు
నూనె – ఒక స్పూన్
పచ్చిమిర్చి – నాలుగు
ఉప్పు – రుచికి సరిపడా

Advertisement

కట్టె పొంగలి రెసిపీ ఇలా చేసేయండి
1. స్టవ్ మీద కళాయి పెట్టి పెసరపప్పును వేసి బాగా వేయించండి. పెసరపప్పు మంచి వాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి.
2. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం వేసి అలాగే వేయించిన పెసరపప్పు వేసి శుభ్రంగా కడగండి.
3. ఆ తర్వాత అందులో మూడు కప్పుల నీళ్లు వేసి రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ నెయ్యి వేసి కలపండి.
4. కుక్కర్ పైన మూత పెట్టి మూడు విజిల్స్ దాకా ఉడికించుకోండి. మూడు విజిల్స్ వచ్చాక కాసేపటికి మూత తీయండి.
5. అన్నం, పెసరపప్పును గరిటెతో మెత్తగా కలుపుకోండి. ఆ తర్వాత ఇందులో మూడు కప్పుల వేడి నీళ్లు వేయండి.
6. మళ్ళీ స్టవ్ మీద రెండు నిమిషాల పాటు ఉడికించండి.
7. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేందుకు చిన్న కళాయిని స్టవ్ మీద పెట్టండి.
8. అందులో ఒక స్పూన్ నూనె, నాలుగు స్పూన్ల నెయ్యి వేయండి.
9. అది వేడెక్కాక జీలకర్ర, అల్లం తరుగు, మిరియాలు, జీడిపప్పులు, పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకులు వేసి వేయించండి.
10. ఈ మొత్తం తాళింపుని అన్నం,పెసరపప్పు మిశ్రమంపై వేయండి. తర్వాత బాగా కలిపేయండి. అంతే టేస్టీ కట్టె పొంగలి రెడీ అయినట్టే.

కట్టె పొంగలి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించి చల్లదనాన్ని అందిస్తుంది. వేసవికాలంలో కట్టె పొంగలి తినడం చాలా అవసరం. అలాగే ఇది జీర్ణక్రియ కూడా ఎంతో మేలు చేస్తుంది. మన పొట్టలో ఉన్న మంచి బాక్టీరియాను ఇది పెంచుతుంది. బియ్యము, పెసరపప్పు ఈ రెండూ కూడా మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. కట్టె పొంగలిలో విటమిన్ b6, విటమిన్ బి12 వంటి పోషకాలు నిండుగా ఉంటాయి. ఇవి రక్తహీనత తగ్గేలా చేస్తాయి. అలాగే గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ వంటి పేగు సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. ఇందులో ఉండే విటమిన్లు చర్మకాంతిని పెంచుతాయి. కట్టె పొంగలిలో ఉప్పును తక్కువగా వేసుకోవాలి. దీని వల్ల రక్తపోటు ఉన్నవారికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×