E-Paper
Advertisement

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !
Advertisement

Japanese Interval Walking: ఈ మధ్య కాలంలో ‘జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్’ (Japanese Interval Walking) అనే కొత్త రకం వ్యాయామం ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఫిట్‌నెస్ నిపుణులతో పాటు సాధారణ ప్రజలు కూడా ఈ పద్ధతిని ప్రస్తుతం ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఇంతకీ ఏంటీ జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్ , దీని ప్రయోజనాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటర్వెల్ వాకింగ్ (Japanese Interval Walking) అంటే ఏమిటి ?
ఇంటర్వెల్ వాకింగ్ అంటే ఒకే వేగంతో నడవకుండా, నెమ్మదిగా కాసేపు, వేగంగా కాసేపు ఇలా మార్చి మార్చి నడవడం. జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్ కూడా అదే సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో.. 3 నిమిషాల పాటు సాధారణ వేగంతో నడిచి, ఆ తర్వాత 3 నిమిషాల పాటు వేగంగా నడుస్తారు. ఈ ప్రక్రియను కనీసం 5 సార్లు రిపీట్ చేస్తారు.

Advertisement

ఈ పద్ధతిని జపాన్లోని షిన్షు విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీని ప్రధాన లక్ష్యం గుండె సంబంధిత సమస్యలు తగ్గించడం, రోగనిరోధక శక్తి పెంచడం, అంతే కాకుండా శరీర బరువును నియంత్రించడం.

ఎలా చేయాలి ?
మొదట సాధారణ వేగంతో 3 నిమిషాలు నడవండి. ఇది శరీరాన్ని వ్యాయామానికి సిద్ధం చేస్తుంది.

Advertisement

వేగంగా నడవడం:
తర్వాత.. 3 నిమిషాల పాటు వేగంగా నడవండి. మీరు ఎంత వేగంగా నడుస్తున్నారంటే, మీకు కొద్దిగా శ్వాస తీసుకోవడం కష్టం అనిపించాలి. కానీ మీరు మాట్లాడగలిగేలా ఉండాలి. ఇది మీ గుండె కొట్టుకునే రేటును పెంచుతుంది.

నెమ్మదిగా నడవడం :
ఆ తర్వాత, తిరిగి 3 నిమిషాల పాటు నెమ్మదిగా నడవండి. ఇది మీ గుండె కొట్టుకునే రేటును సాధారణ స్థితికి తీసుకొస్తుంది.
పునరావృతం :
ఇలా నెమ్మదిగా, వేగంగా నడవడం 5 సార్లు రిపీట్ చేయండి. అంటే.. మొత్తం 30 నిమిషాల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

Also Read: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?
ప్రయోజనాలు:
శరీర బరువు తగ్గడం: వేగంగా నడవడం వలన కేలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. తద్వారా.. బరువు తగ్గడానికి ఇది బాగా సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యం:
ఈ వ్యాయామం గుండె కండరాలను బలోపేతం చేస్తుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ నియంత్రణ:
ఈ పద్ధతి ద్వారా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అంతే కాకుండా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

మానసిక ఆరోగ్యం:
వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఫలితంగా బీపీ వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఆరోగ్యంగా కూడా ఉంటాము.

జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్ అనేది ఖర్చులేని, సులభమైన, శక్తివంతమైన వ్యాయామం. ఈ పద్ధతిని పాటించడం ద్వారా కేవలం కొద్ది కాలంలోనే మీరు మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ పద్ధతిని అనుసరించడం వల్ల మీ శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త సంవత్సరం నుంచి దీనిని మీ దినచర్యలో చేర్చుకోవడం ద్వారా మీరు మరింత ఉత్సాహంగా ఉండవచ్చు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×