E-Paper
Advertisement

Jamun Seeds Powder: నేరేడు విత్త‌నాల పొడిని ఇలా వాడారంటే.. ఎలాంటి రోగమైన పారిపోవాల్సిందే!

Jamun Seeds Powder: నేరేడు విత్త‌నాల పొడిని ఇలా వాడారంటే.. ఎలాంటి రోగమైన పారిపోవాల్సిందే!
Advertisement

Jamun Seeds Powder: అనేక పోషకాలను కలిగి ఉన్న నేరేడు పండ్లు ప్రస్తుత సీజన్‌లో దొరక్కపోవచ్చు కానీ.. విత్త‌నాల పొడి దొరుకుతుంది. మన ఆరోగ్యానికి నేరేడు పండ్లే కాదు.. నేరుడు గింజల పొడి కూడా అద్భుత‌మైన ఔష‌ధం. వీటిని కూడా ఒక మూలిక‌గా ప‌రిగ‌ణిస్తారు వైద్య నిపుణులు. ఆయుర్వేదంలో ఈ విత్త‌నాల‌ను ప‌లు ఔష‌ధాల త‌యారీకి కూడా ఉప‌యోగిస్తారు. నేరేడు విత్తనాల పొడితో అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప‌లు వ్యాధుల‌ను న‌యం చేసుకునేందుకు ఈ పొడి బాగా ప‌నిచేస్తుంది.

షుగర్ లెవెల్స్ నియంత్రణలో..

నేరేడు విత్తనాల పొడిని మధుమేహం ఉన్నవాళ్లు తీసుకుంటే.. షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఈ పొడిని భోజనానికి ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి తాగాలి. ఈ పొడిలో జంబోలైన్‌, జంబోసైన్ అనే స‌మ్మేళ‌నాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తాయి. ప్రతిరోజూ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం ఇన్సులిన్‌ను మెరుగ్గా పొందగలదు. టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారికి కూడా నేరుడు విత్తనాల పొడి ఎంతో మేలు చేస్తుంది. దీంతో అతిదాహం, అతి మూత్ర విస‌ర్జ‌న వంటి స‌మ‌స్య‌లను తగ్గించుకోవచ్చు.

యాంటీఆక్సిడెంట్లు పుష్కలం..

Advertisement

శరీరంలో ఏవైనా వాపులు ఉంటే.. నేరేడు విత్త‌నాల పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల త‌గ్గిపోతాయి. నేరేడు గింజల పొడి యాస్ట్రింజెంట్ గుణాల‌ను క‌లిగి ఉంటుంది కాబట్టి.. ముఖ్యంగా పేగుల్లో వ‌చ్చే వాపులు త‌గ్గుతాయి. ఈ పొడితో విరేచ‌నాల నుంచి బ‌య‌టపడొచ్చు. దీంతోపాటు జీర్ణాశ‌యం, పేగుల్లో ఉండే అల్స‌ర్లు న‌య‌మ‌వుతాయి. ఈ విత్త‌నాల పొడిలో ఫ్లేవ‌నాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల.. ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను తొల‌గిస్తాయి. దీనివ‌ల్ల ర‌క్త నాళాల వాపులు తగ్గి, గుండె జ‌బ్బులు రాకుండా సురక్షితంగా ఉండ‌వ‌చ్చు.

ఫ్యాటీ లివర్ సమస్య ఉంటే..

ఫ్యాటీ లివ‌ర్ స‌మ‌స్య ఉన్న‌వారికి.. నేరేడు విత్త‌నాల పొడి ఎంతో మేలు చేస్తుంది. లివ‌ర్‌లో ఉండే వ్య‌ర్థాలు సుల‌భంగా బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. అలాగే ఈ పొడిని రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. సీజ‌న‌ల్‌గా వ‌చ్చే చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. నేరేడు గింజ‌ల పొడిని రోజుకు 1 నుంచి 2 టీస్పూన్ల మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని నీళ్లు లేదా మ‌జ్జిగ‌లో క‌లిపి తాగ‌వ‌చ్చు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×