E-Paper
Advertisement

Jaggery: చిన్న తీపి ముక్క చాలు.. చలికాలంలో వేధించే అనేక సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

Jaggery: చిన్న తీపి ముక్క చాలు.. చలికాలంలో వేధించే అనేక సమస్యలకు చెక్ పెట్టొచ్చు!
Advertisement

Jaggery: ఇంట్లో ఏదైనా తీపి వంటకం చేయాలంటే ముందుగా గుర్తొచ్చే పదార్థం బెల్లం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కువమంది ఉప‌యోగించే ఆహార ప‌దార్థాల్లో బెల్లం కూడా ఒక‌టి. బెల్లంలో పోషకాలు మెండుగా ఉంటాయి. కాబట్టి చలికాలంలో ప్రతిరోజూ క‌చ్చితంగా చిన్న బెల్లం ముక్క‌ను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. రోజూ మ‌ధ్యాహ్నం లేదా రాత్రి పూట భోజ‌నం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క‌ను తినాల‌ని సూచిస్తున్నారు. దీనివ‌ల్ల అనేక వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చ‌ని, చ‌లికాలంలో మ‌న‌కు ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని అంటున్నారు.

ఇమ్యూనిటీ బూస్టర్:

శీతాకాలంలో బెల్లం మన శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం.. బెల్లం భిన్న‌మైన స్వ‌రూపాన్ని క‌లిగి ఉంటుంది. ఇది చ‌క్కెర‌తో పోలిస్తే అధిక పోషకాలను కలిగి ఉంటుంది. అలాగే దీనిలో సంక్లిష్ట‌మైన పిండి ప‌దార్థాలు ఉంటాయి. ఇవి నెమ్మ‌దిగా జీర్ణమవుతాయి. మన శ‌రీరానికి నిరంత‌రం శ‌క్తిని అందిస్తాయి. దీనివ‌ల్ల శ‌రీరంలో శ‌క్తి స్థాయిలు పెరుగుతాయి. చిన్న బెల్లం ముక్క రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది. రోజూ చిన్న బెల్లం ముక్క తినడం వల్ల నీర‌సం, అల‌స‌ట దరిచేరవు.

Advertisement

Read Also: సాక్సులు ధరించే నిద్రపోతున్నారా.. ఈ అలవాటు మంచిదా? కాదా? తెలుసుకోండిలా!

అనేక సమస్యలకు దివ్యౌషధం:

బెల్లాన్ని స‌హ‌జ‌సిద్ధ‌మైన క్లీనింగ్ ప‌దార్థంగా చెబుతుంటారు నిపుణులు. సిమెంట్ ఫ్యాక్ట‌రీల్లో ప‌నిచేసే కార్మికులకు శ్వాస‌కోశ వ్య‌వ‌స్థ శుభ్రంగా ఉండేందుకు గాను రోజూ బెల్లం తిన‌మ‌ని ఇస్తారట. బెల్లం శ్వాస‌కోశ వ్య‌వ‌స్థను శుభ్రపరుస్తుంది. అలాగే గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే క‌ఫం, దుమ్ము, ధూళి, పొగ వంటివి తొల‌గిస్తాయి. దీంతో పాటు బెల్లం తినడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. చలికాలంలో వచ్చే గొంతు స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. ముఖ్యంగా ద‌గ్గు, జ‌లుబు నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. బెల్లాన్ని అల్లం లేదా మిరియాల పొడితో క‌లిపి తీసుకుంటే.. ఆరోగ్యాన్ని ఎంతగానో మేలు జరుగుతుంది.

రక్త‌హీన‌త స‌మ‌స్య‌కు చెక్:

Advertisement

రక్తహీనత సమస్యలతో బాధపడుతున్న వాళ్లు బెల్లం తరచూ తీసుకుంటే ఐరన్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. బెల్లం శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్ప‌త్తికి స‌హాయం చేస్తుంది. దీని వ‌ల్ల ర‌క్తం వృద్ధి చెందుతుంది. అలాగే ర‌క్త‌హీన‌త కార‌ణంగా వ‌చ్చే నీర‌సం, అల‌స‌ట సైతం త‌గ్గిపోతాయి. బెల్లం తరచూ తిన‌డం వ‌ల్ల మెగ్నిషియం, జింక్‌, సెలీనియం వంటి మిన‌ర‌ల్స్‌ను పొంద‌వ‌చ్చు. ఇవి మ‌న శ‌రీర మెట‌బాలిజాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. శీతాకాలంలో మన శ‌రీర మెట‌బాలిజం త‌గ్గుతుంది. ఇలాంటి సమయంలో బెల్లం తీసుకుంటే మెట‌బాలిజాన్ని పెంచుకోవ‌చ్చు. దీంతోపాటు బెల్లం వల్ల క్యాల‌రీలు సుల‌భంగా ఖర్చ‌యి కొవ్వు క‌రుగుతుంది. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నవాళ్లకి బెల్లం చక్కటి పరిష్కారం. ఇక చ‌లికాలంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచడంలో బెల్లం ఎంతగానో సహాయపడుతుంది.

Read Also: సీజనల్ వ్యాధులకు చెక్.. శీతాకాలంలో ఈ కూరగాయలు తింటే నిండు ఆరోగ్యం!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×