E-Paper
Advertisement

బెల్లం Vs పంచదార.. జుట్టు, చర్మానికి ఏది బెస్ట్?

బెల్లం Vs పంచదార.. జుట్టు, చర్మానికి ఏది బెస్ట్?
Advertisement

Jaggery Vs Sugar: ఈ రోజుల్లో హెల్త్ కాన్షియస్ ఉన్న ప్రతి ఒక్కరి ఇంట్లో వినిపించే కామన్ డిస్కషన్.. “పంచదార వాడాలా? బెల్లం వాడాలా?”. టీ, కాఫీ నుంచి మొదలు కొని స్వీట్ల వరకు పంచదార స్థానంలో.. బెల్లం వాడటం ఒక ట్రెండ్‌గా మారింది. బెల్లం తింటే ఆరోగ్యం, పంచదార తింటే.. అనారోగ్యం అని చాలా మంది ఫిక్స్ అయిపోతుంటారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుంది? వీటిని సరైన పద్ధతిలో.. ఎలా వాడాలో తెలుసుకుందాం .

బెల్లం vs పంచదార:
బెల్లం,పంచదార.. ఈ రెండూ చెరకు రసం నుంచే తయారవుతాయి. కానీ.. ఇవి మన ప్లేట్‌లోకి వచ్చే ప్రాసెస్‌లోనే పెద్ద వ్యత్యాసం ఉంటుంది.

Advertisement

చెరకు రసాన్ని బాగా మరిగించి, ఎలాంటి కెమికల్స్ కలపకుండా సహజ పద్ధతిలో ఘనీభవింపజేస్తే బెల్లం తయారవుతుంది. ఇందులో.. చెరకులో ఉండే సహజసిద్ధమైన మినరల్స్ అలాగే ఉంటాయి. అదే చెరకు రసాన్ని మల్టిపుల్ టైమ్స్ రిఫైన్ చేసి, సల్ఫర్ వంటి రసాయనాలను కలిపి క్రిస్టల్స్‌గా మారిస్తే పంచదార వస్తుంది. ఈ రిఫైనింగ్ ప్రాసెస్‌లో.. పంచదారలో ఉండే పోషకాలన్నీ నశించి, కేవలం ‘ఎంటీ క్యాలరీలు’మాత్రమే మిగులుతాయి.

ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుంది?
ఖచ్చితంగా పంచదారతో పోలిస్తే.. బెల్లం చాలా బెటర్ ఆప్షన్. ఎందుకంటే బెల్లంలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

Advertisement

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తినడం వల్ల జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. ఇది మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.

రక్తహీనతకు చెక్: బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి ఎనీమియా రాకుండా కాపాడుతుంది.

లివర్ డిటాక్స్: బెల్లం మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, లివర్‌ను శుభ్రపరచడంలో సహాయ పడుతుంది.

కానీ, పంచదార వల్ల శరీరానికి ఎటువంటి పోషకాలు అందవు. పైగా ఇది బరువు పెరగడానికి, గుండె జబ్బులకు , టైప్-2 డయాబెటిస్‌కు దారి తీస్తుంది.

క్యాలరీలు:
ఇక్కడే చాలా మంది పప్పులో కాలేస్తుంటారు. బెల్లం హెల్తీ కదా అని గుప్పెళ్లు గుప్పెళ్లు తినేస్తుంటారు. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. 100 గ్రాముల పంచదారలో దాదాపు 387 క్యాలరీలు ఉంటే, 100 గ్రాముల బెల్లంలో 383 క్యాలరీలు ఉంటాయి. అంటే క్యాలరీల పరంగా రెండింటిలోనూ పెద్ద తేడా లేదు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు లేదా డయాబెటిస్ (షుగర్) ఉన్నవారు బెల్లం తిన్నా సరే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.

బెల్లాన్ని సరైన పద్ధతిలో ఎలా వాడాలి?
టీ/కాఫీలో వాడేటప్పుడు: పాలు బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి, కాసేపు ఆగిన తర్వాతే బెల్లం పౌడర్ కలపాలి. మరుగుతున్న పాలల్లో బెల్లం వేస్తే పాలు విరిగిపోయే అవకాశం ఉంది.

లిమిట్ ముఖ్యం: బెల్లం మంచిదే కదా అని ఎక్కువగా తినకూడదు. రోజుకు 1 నుంచి 2 చిన్న ముక్కలు (దాదాపు 10-15 గ్రాములు) మాత్రమే తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

ఆర్గానిక్ బెల్లం: మార్కెట్లో దొరికే తెల్లటి లేదా పచ్చటి బెల్లంలో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కాస్త నలుపు లేదా ముదురు గోధుమ రంగులో ఉండే కెమికల్ ఫ్రీ ఆర్గానిక్ బెల్లాన్ని ఎంచుకోండి.

బాటమ్ లైన్: పంచదార అనేది ‘స్లో పాయిజన్’ లాంటిది. దానికి వీలైనంత దూరంగా ఉండటమే మంచిది. పంచదారకు బదులు బెల్లాన్ని ప్రత్యామ్నాయంగా వాడుకోవడం బెస్ట్. కానీ అమృతం అయినా మోతాదు మించితే ప్రమాదమే కాబట్టి లిమిట్‌గా వాడటం మర్చిపోకండి!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×