E-Paper
Advertisement

Pregnancy Diet Tips: గర్భిణీలు నువ్వులు తింటే అబార్షన్ అవుతుందా? ఈ ఒక్క విషయం తెలిస్తే మీ భయం మొత్తం పోతుంది!

Pregnancy Diet Tips: గర్భిణీలు నువ్వులు తింటే అబార్షన్ అవుతుందా? ఈ ఒక్క విషయం తెలిస్తే మీ భయం మొత్తం పోతుంది!
Advertisement

Pregnancy Diet Tips: సాధారణంగా హిందువులు జరుపుకునే ప్రతి సంప్రదాయ పండగలోనూ కచ్చితంగా నువ్వులు కలిపిన పిండి వంటలు ఉండాల్సిందే. నువ్వులు వలన వంటకు రుచి మాత్రమే కాదు.. మన ఆరోగ్యానికీ ఎంతో మంచిది. రక్తహీనత సమస్యను తగ్గించడంలో నువ్వులు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే చాలామంది నువ్వుండలను ఎంతో ఇష్టంగా తింటుంటారు. కానీ, గర్భిణీ స్త్రీల విషయానికి వచ్చేసరికి.. ‘నువ్వులు తింటే గర్భస్రావం అవుతుంది’ అని అమ్మమ్మలు, నానమ్మలు చెబుతుంటారు.

ఈ పాతకాలపు భయం వల్ల చాలామంది మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని దూరం చేసుకుంటున్నారు. అయితే, దీని గురించి ఆధునిక వైద్యం ఏం చెబుతోంది? నువ్వులు నిజంగానే గర్భిణీలకు ప్రమాదమా? ఇందులో నిజమెంత? అని చాలామంది సందేహాలను లేవనెత్తినప్పుడు.. నిపుణులు మాత్రం ఈ విషయంలో.. నువ్వుల వలన గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి ఎలాంటి హానీ ఉండదని, నువ్వులు తింటే గర్భస్రావం అవుతుందనేది ఒట్టి అపోహ మాత్రమే అని చెబుతున్నారు. నిజానికి నువ్వులు అనేది గర్భిణీలకు ఒక సూపర్ ఫుడ్ లాంటిదని, దీనిని తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం..

Advertisement

Also Read: ఈ స్టైల్లో చికెన్ ఫ్రై చేసుకున్నారంటే.. గిన్నె మొత్తం ఊడ్చేస్తారు, అంత బాగుంటుంది!

మలబద్ధకానికి చెక్:

గర్భధారణ సమయంలో చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద సమస్య మలబద్ధకం. నువ్వులలో ఉండే పీచు పదార్థం (ఫైబర్) జీర్ణక్రియను సాఫీగా ఉంచి, ఈ సమస్యను దూరం చేస్తుంది.

రక్తహీనత సమస్య ఉండదు:

Advertisement

కడుపుతో ఉన్న స్త్రీలకు క్యాల్షియం, ఐరన్ చాలా అవసరం. నువ్వులలో ఇవి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి.. నువ్వులను తల్లి తీసుకోవడం వలన ఎముకలు బలంగా మారుతాయి. దీంతోపాటు నువ్వులతో రక్తహీనత సమస్య కూడా దరిచేరదు.

శిశువు ఎదుగుదల:

నువ్వులలో ఉండే అమైనో యాసిడ్స్, ప్రోటీన్లు, విటమిన్లు కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి. అందుకే నువ్వులు గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతుంటారు వైద్య నిపుణులు.

బీపీ కంట్రోల్:

నువ్వుల్లో మెగ్నీషియం ఉండటం వలన ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీనివల్ల డెలివరీ సమయంలో వచ్చే సమస్యలు తగ్గుతాయి. అలాగే చిరాకు, ఆందోళన వంటివి కూడా తగ్గుతాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో వచ్చే అలసటను తగ్గించి, రోజంతా ఉత్సాహంగా ఉండటానికి నువ్వుల్లోని పోషకాలు శక్తినిస్తాయి.

ఎలా తీసుకోవాలంటే?

నువ్వులు మంచివి కదా అని విచ్చలవిడిగా తినకూడదు. ఏదైనా మితంగా తీసుకున్నప్పుడే అమృతంలా పనిచేస్తుంది. నువ్వుల లడ్డూ రూపంలోనో లేదా కూరల్లో పొడి రూపంలోనో తక్కువ మోతాదులో తీసుకోవడం చాలా మంచిది. అయితే, ప్రతి ఒక్కరి శరీర తత్వం వేరుగా ఉంటుంది. కాబట్టి.. మీ డైట్‌లో వీటిని చేర్చుకునే ముందు ఒకసారి వైద్యులను సంప్రదించడం మంచిది.

Also Read: చిన్న పొరపాటే కదా అని వదిలేయకండి.. మీ రిలేషన్‌షిప్‌ను ముక్కలు చేసే ‘మైక్రో చీటింగ్’ లక్షణాలు ఇవే!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×