E-Paper
Advertisement

Paneer: పనీర్ ప్రతిరోజూ తింటే ఆరోగ్యానికి ప్రమాదమా?

Paneer: పనీర్ ప్రతిరోజూ తింటే ఆరోగ్యానికి ప్రమాదమా?
Advertisement

పనీర్ అంటే శాఖాహారులకు చాలా ఇష్టం. వారు ఎక్కువగా తినే ఆహారాల్లో పనీర్ ఒకటి. కర్రీలలో, సలాడ్లలో, స్నాక్స్‌లో పనీర్ వాడకం రోజు రోజుకీ పెరుగుతోంది. అయితే పనీర్‌ను ప్రతిరోజూ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? రోజూ తింటే ఏం జరుగుతుంది? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

పనీర్ అనేది పాలు నుంచి తయారయ్యే ఒక పాల ఉత్పత్తి. ఇందులో ప్రోటీన్, కాల్షియం, ఫ్యాట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే జిమ్‌కు వెళ్లే వారు, కండరాలు పెంచుకోవాలనుకునే వారు పనీర్‌ను ఎక్కువగా తమ ఆహారంలో చేర్చుకుంటారు. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం మోతాదులో తింటే శరీరానికి చాలా లాభాలు ఉంటాయి. ముఖ్యంగా శాకాహారులకు ఇది మంచి ప్రోటీన్ మూలం. రోజూ 40 నుంచి 50 గ్రాముల వరకు పనీర్ తినడం సురక్షితమేనని చెబుతున్నారు.

Advertisement

పనీర్ తో ఉపయోగాలు
పనీర్‌లో ఉన్న ప్రోటీన్ శరీరంలోని కండరాలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిల్లలు ఎదుగుదల దశలో ఉన్నప్పుడు, వృద్ధులకు కండరాల బలహీనత ఉన్నప్పుడు పనీర్ ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే, పనీర్‌లో కాల్షియం ఎక్కువగా ఉండటంతో ఎముకలు, పళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా మహిళల్లో వచ్చే ఎముకల సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. పనీర్ తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. దీని వల్ల మధ్య మధ్యలో జంక్ ఫుడ్ తినే అలవాటు తగ్గుతుంది. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారు సరైన మోతాదులో పనీర్ తీసుకుంటే ఉపయోగం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Also read: Bald Head: టోపీ పెట్టుకుంటే బట్టతల వచ్చేస్తుందా? ఇందులో నిజమెంత?

Advertisement

అతిగా తింటే సమస్యలు
పనీర్‌ను అతిగా తినడం వల్ల కొన్ని సమస్యలు కూడా రావచ్చు. పనీర్‌లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఫుల్ ఫ్యాట్ పనీర్ ఎక్కువ మోతాదులో తీసుకుంటే బరువు పెరగడం, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వంటి ప్రమాదాలు ఉంటాయి. రోజూ పెద్ద మోతాదులో పనీర్ తినేవారిలో ఊబకాయం సమస్య వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొంతమందికి పనీర్ జీర్ణం కావడం కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా లాక్టోజ్ సమస్య ఉన్నవారికి పనీర్ తిన్న తర్వాత గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందులు రావచ్చు. అలాంటి వారు రోజూ పనీర్ తినడం కన్నా, అప్పుడప్పుడు మాత్రమే తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

పనీర్ మీద మాత్రమే ఆధారపడి ఇతర ఆహారాలను పక్కన పెట్టడం సరైంది కాదు. శరీరానికి ప్రోటీన్‌తో పాటు ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు కూడా అవసరం. కేవలం పనీర్ తినడం వల్ల ఈ పోషకాలు పూర్తిగా అందవు. అందుకే పప్పులు, కూరగాయలు, పండ్లు వంటి ఆహారాలను కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. పనీర్‌ను ఎలా తింటామన్నది కూడా చాలా ముఖ్యం. ఎక్కువ నూనె, వెన్న, క్రీమ్ వేసి తయారుచేసిన పనీర్ కర్రీలు రోజూ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. బదులుగా ఉడికించిన పనీర్, గ్రిల్ చేసిన పనీర్, లేదా సలాడ్లలో వేసుకుని తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

పనీర్ ఆరోగ్యానికి మంచిదే కానీ మోతాదు చాలా ముఖ్యం. రోజూ కొద్దిగా తింటే లాభాలు ఉంటాయి. అదే అతిగా తింటే ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందుకే పనీర్‌ను ఒక బ్యాలెన్స్‌డ్ డైట్‌లో భాగంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×