E-Paper
Advertisement

Health Tips: పప్పు వండేటప్పుడు వచ్చే నురగ అమృతమా? అనారోగ్యమా? నిపుణులు చెప్పిన షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోండి..

Health Tips: పప్పు వండేటప్పుడు వచ్చే నురగ అమృతమా? అనారోగ్యమా? నిపుణులు చెప్పిన షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోండి..
Advertisement

Health Tips: వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని.. దానిలోకి పప్పు కలుపుకుని తింటే ఆ మజానే వేరు కదా. చాలామంది ఫేవరెట్ రెసిపీ కూడా పప్పే. మనమందరం అంతలా ఇష్టపడి తినే పప్పును ఇంట్లో ప్రతిరోజూ వండినా లొట్టలేసుకుంటూ తినేస్తుంటాం. అయితే పప్పు ఉడికేటప్పుడు పైన తెల్లటి లేదా పసుపు రంగులో నురగ రావడం గమనిస్తూనే ఉంటాం. పాతకాలంలో మన పెద్దలు ఈ నురగను గరిటతో తీసిసేవాళ్లు.

అయితే, నేటి కాలంలో కుక్కర్ల వినియోగం పెరగడంతో ఆ నురగను అలాగే ఉంచేస్తున్నాం. నిజానికి ఈ నురగ పప్పులోని ప్రొటీన్లు, పిండి పదార్థాల సమ్మేళనం మాత్రమే. పప్పు వేడికి గురైనప్పుడు అందులోని గాలి, ఆవిరి కలిసి ఇలా నురగలా పైకి తేలుతాయి. ఇది పూర్తిగా సహజమైన ప్రక్రియే తప్ప విషపూరితం మాత్రం కాదు. ఈ నురగ వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి హాని జరగదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

అతిగా వద్దు..

Advertisement

పప్పు ఉడికేటప్పుడు వచ్చే నురగలో శాపోనిన్స్ అనే ప్రత్యేక రసాయనాలు ఉంటాయి. ఇవి మొక్కలకు రక్షణనిచ్చే యాంటీఆక్సిడెంట్లలా పనిచేస్తాయి. పరిమితంగా తీసుకుంటే ఇవి శరీరానికి మేలు చేస్తాయి. కానీ, అతిగా తీసుకుంటే మాత్రం పేగుల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Also Read: సూర్యోదయం కంటే ముందే మీ రోజూ మొదలైతే.. ఆరోగ్యం మీ గుప్పిట్లో ఉన్నట్లే!

అలాంటి వాళ్లు తినొద్దు:

Advertisement

ముఖ్యంగా పేగు సంబంధిత సమస్యలు ఉన్నవారు దీనివల్ల ఇబ్బంది పడవచ్చు. అలాగే పప్పులోని ఈ పదార్థాల వల్ల రుచిలో స్వల్పంగా చేదు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఆ నురగను తీసేయడమే మేలని నిపుణుల అభిప్రాయం.

కడుపు ఉబ్బరానికి కారణం?

కొంతమంది పప్పు తింటే కడుపు ఉబ్బరంగా ఉందని, గ్యాస్ వస్తోందని చెబుతుంటారు. దీనికి కారణం పప్పులో ఉండే FODMAPS అనే సంక్లిష్ట పిండి పదార్థాలు. ఇవి చిన్న పేగులో పూర్తిగా అరగకుండా నేరుగా పెద్ద పేగులోకి చేరుతాయి. అక్కడ ఉండే బ్యాక్టీరియా వీటిని పులియబెట్టడం వల్ల గ్యాస్ విడుదలవుతుంది. దీనివల్లే కడుపులో అసౌకర్యం, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే, ఇది అందరిలోనూ ఒకేలా ఉండదు. కొందరి శరీర తత్వం వీటిని త్వరగా జీర్ణం చేసుకోలేకపోవడమే గ్యాస్ ససమ్యకు అసలు కారణం.

పప్పు వండే విధానం ఇలా:

పప్పును వండటానికి ముందే కనీసం గంట లేదా రెండు గంటల పాటు నానబెట్టడం వల్ల అందులోని సంక్లిష్ట పిండి పదార్థాలు విచ్ఛిన్నమవుతాయి. అలాగే పప్పును బాగా శుభ్రంగా కడగటం, అధిక ఉష్ణోగ్రత వద్ద మెత్తగా ఉడికించడం వల్ల కూడా హానికారక అంశాలు తొలగిపోతాయి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పప్పు వల్ల కలిగే పోషకాలను పొందుతూనే, గ్యాస్ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు.

Also Read: సైలెంట్ ఎనిమీ.. గోర్లు కొరకడం వల్ల శరీరంలోకి చేరే వేలకోట్ల బ్యాక్టీరియా గురించి మీకు తెలుసా?

 

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×