// // Hair Care In Winter: చలికాలంలో జుట్టు రాలుతోందా ? ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ -->
E-Paper
Advertisement

Hair Care In Winter: చలికాలంలో జుట్టు రాలుతోందా ? ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్

Hair Care In Winter: చలికాలంలో జుట్టు రాలుతోందా ? ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్
Advertisement

Hair Care In Winter: చలికాలంలో చాలా మందికి జుట్టు రాలడం ఒక సాధారణ సమస్యగా మారుతుంది. వేసవితో పోలిస్తే.. ఈ సీజన్‌లో జుట్టు రాలడం అకస్మాత్తుగా పెరుగుతుంది. దీనికి కారణం అనారోగ్యం కాదు. శరీరం, తలలో కొన్ని సహజ మార్పులు మాత్రమే. మీరు ఈ సంకేతాలను గుర్తించి సకాలంలో చర్యలు తీసుకుంటే.. చలికాలంలో జుట్టు రాలడాన్ని సులభంగా నియంత్రించవచ్చు. చలికాలంలో జుట్టు రాలడానికి దోహదపడే మూడు ప్రధాన అంశాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

జుట్టు రాలడానికి గల కారణాలు:

తలకు రక్త ప్రసరణ:

Advertisement

ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు.. శరీరం తనను తాను వెచ్చగా ఉంచుకోవడానికి అనేక విధానాలను అవలంబిస్తుంది. వీటిలో ఒకటి వాసోకాన్స్ట్రిక్షన్, అంటే చిన్న రక్త నాళాలు ఇరుకుగా మారడం. ఈ ప్రక్రియ చల్లని వాతావరణంలో తలపై కూడా జరుగుతుంది. ఫలితంగా జుట్టు మూలాలకు ఆక్సిజన్, పోషకాలు చేరడం తగ్గుతుంది. బలహీనమైన కుదుళ్ల వల్ల జుట్టు రాలడం పెరుగుతుంది.

ఏం చేయాలి ?

ఇలాంటి సందర్భం లో ప్రతి రోజూ 4 నిమిషాలు మసాజ్ చేయండి. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది . ప్రతి రోజూ 30 నిమిషాల వాకింగ్ లేదా ఏదైనా వ్యాయామం చేయడం కూడా మంచిది. బయటకు వెళ్ళే టప్పుడు మీ తలని కొద్దిగా వెచ్చగా ఉంచుకోండి. కానీ చెమట పేరుకుపోయేలా చేసే ఏదీ వాడ కూడదు.

రక్త ప్రసరణను పెంచే ఆహారాలు:

వాల్నట్

బీట్‌రూట్

పాలకూర

దానిమ్మ

గుమ్మడికాయ గింజలు

చుండ్రు, పొడి చర్మం సమస్యలు:

చలికాలంలో పొడి గాలి, తక్కువ తేమ.. తల చర్మం యొక్క సహజ తేమను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా తలపై చర్మం ఎండి పోయి నప్పుడు.. చర్మం వేగంగా పొరలుగా మారడం ప్రారంభమవుతుంది. నూనెలు ఈ పొరలతో కలిసి.. తలపై చుండ్రు ను పెంచుతాయి. ఫలితంగా దురద, చికాకు. దువ్వెటప్పుడు జుట్టు రాలడం పెరుగుతుంది.

చలికాలంలో చుండ్రును ఎలా నివారించాలి ?

గోరు వెచ్చని నీటితో జుట్టును శుభ్రం చేసి.. చివరగా గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. చాలా బిగుతుగా ఉండే టోపీ ఎక్కువసేపు ధరించడం మానుకోండి.

వారానికి 1-2 సార్లు యాంటీ-డాండ్రఫ్ షాంపూ వాడండి.

Also Read: చలికాలంలో లవంగాలు తింటే.. వ్యాధులు రమ్మన్నా రావు తెలుసా ?

చుండ్రును తగ్గించడంలో సహాయపడే ఆహారాలు:

వాల్‌నట్స్ (ఒమేగా-3)

అవిసె గింజలు

పెరుగు

గుమ్మడికాయ గింజలు (జింక్)

విటమిన్ డి లోపం

చలికాలంలో.. పగటి సమయం తక్కువగా ఉంటుంది. అంతే కాకుండా సూర్య రశ్మి తక్కువగా ఉంటుంది. దీని అర్థం శరీరానికి తగినంత సూర్య రశ్మి లభించదు. దీని వల్ల విటమిన్ డి స్థాయిలు తగ్గుతాయి. ఈ విటమిన్ జుట్టు పెరుగుదలకు సహాయ పడుతుంది. ఈ విటమిన్ లోపం జుట్టు మూలాలను బలహీన పరుస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని పెంచుతుంది.

పరిష్కారం ఏంటి ?

వారానికి 3-4 రోజులు, మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య కనీసం 10-20 నిమిషాలు సూర్య రశ్మిలో ఉండండి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×