E-Paper
Advertisement

Anti Aging Drinks: వయసు పెరుగుతున్నా అందంగా కనిపించాలంటే ఈ డ్రింక్ పక్కా ట్రై చేయాల్సిందే

Anti Aging Drinks: వయసు పెరుగుతున్నా అందంగా కనిపించాలంటే ఈ డ్రింక్ పక్కా ట్రై చేయాల్సిందే
Advertisement

Anti Aging Drinks: ప్రస్తుతం ఆడ, మగ అనే తేడా లేకుండా అందంగా కనిపించాలని అనుకుంటున్నారు. ఈ తరుణంలో మార్కెట్లో దొరికె రకరకాల ప్రొడెక్ట్స్ అన్నీ వాడుతుంటారు. ముఖ్యంగా మేకప్ వేసుకోకుండా మాత్రం అస్సలు బయటికి రావడానికి ఇష్టపడడం లేదు. స్కూలు పిల్లల నుంచి మొదలుకుని ముసలి వాళ్ల వరకు తాము అందంగా కనిపించాలని తెగ ఆశపడుతుంటారు. ఇంట్లో చిన్న పార్టీ జరిగినా కూడా మేకప్ లేకుండా అస్సలు కనిపించరు. అయితే మార్కెట్లో దొరికె ప్రొడక్ట్స్, మేకప్ ఐటమ్స్ వాడడం వల్ల కేవలం అప్పటి వరకు మాత్రమే అందంగా కనిపిస్తారు. కానీ శరీరం లోపల నుంచి ఎప్పటికీ అందంగా ఉండాలంటే ఇంట్లో తయారు చేసే పండ్ల రసాలు తాగాలి.

చర్మ సంరక్షణ కోసం కేవలం ప్రొడక్ట్స్ మాత్రం వాడితే సరిపోదు. తరచూ తీసుకునే ఆహారంపై కూడా చర్మ సంరక్షణ ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా చర్మం కాంతివంతంగా ఉండడానికి ఆహారమే ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్ది అందంగా కనిపించాలంటే కొన్ని డ్రింక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వయసు ప్రభావం చర్మంపై పడకుండా తరచూ పాలను తీసుకోవాలి. పాలను తీసుకోవడం వల్ల ఇందులో ఉండే కాల్షియం ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.

Advertisement

అంతేకాదు సోయా పాలు తీసుకున్నా కూడా చర్మంపై ముడతలు రాకుండా సంరక్షించుకోవచ్చు. చర్మం కాంతివంతంగా ఉండడానికి ప్రతీ రోజు ఓ గ్రీన్ టీ కూడా తీసుకోవాలి. తరచూ కాకపోయినా కూడా వారానికి మూడు సార్లు అయినా కూడా తీసుకోవాలి. రసాయనాలు కలిపిన ప్రొడక్ట్స్ వాడడం వల్ల చర్మం అనారోగ్య సమస్యలకు గురవుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతకర వ్యాధులు కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. అందువల్ల తరచూ పండ్ల రసాలు, పాలు, గ్రీన్ టీ వంటివి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాదు క్యారెట్ జ్యూస్ కూడా రెగ్యులర్ గా తీసుకున్నా కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. బీట్రూట్ వంటి జ్యూస్ తాగినా కూడా మంచి ఫలితాలు ఉంటాయని కూడా నిపుణులు సూచిస్తున్నారు. అందువల్ల వయసు పెరుగుతుందని అయినా కూడా అందంగా ఉండాలి అనుకునే వారు ఈ డ్రింక్స్ తాగితే మంచిది.

ఇక వీటిని నేరుగా తీసుకోవడం కష్టంగా ఉన్న వారు. జ్యూస్ తయారుచేసుకుని అందులో నిమ్మరసం లేదా తేనె కలుపుకుని తాగినా కూడా తాగడానికి రుచిగా ఉంటుంది. వీటిని రోజులో ఎప్పుడుపడితే అప్పుడు కాకుండా ఉదయం టిఫిన్ చేసిన తర్వాత తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.

Advertisement

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×