E-Paper
Advertisement

White Hair: ఒక్క తెల్లవెంట్రుక పీకితే అక్కడ పది పుట్టుకొస్తాయా?

White Hair: ఒక్క తెల్లవెంట్రుక పీకితే అక్కడ పది పుట్టుకొస్తాయా?
Advertisement

మనలో చాలా మందికి ఒక తెల్ల వెంట్రుక కనిపించినప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది. వెంటనే దాన్ని పీకేయాలనిపిస్తుంది. కానీ ఒక్క తెల్ల వెంట్రుకను పీకితే అక్కడ మరిన్ని తెల్ల వెంట్రుకలు పెరిగిపోతాయి అనే మాట గుర్తొచ్చి భయంతో ఆగిపోతారు. ఇది ఎంతవరకు నిజం? వైద్యులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. వైద్యుల మాటల్లో చెప్పాలంటే ఒకే వెంట్రుకను పీకడం వల్ల మిగతా వెంట్రుకలు తెల్లగా మారిపోవు. అంటే ఇది అసలు శాస్త్రీయంగా నిజం కాదు. అపోహ మాత్రమే. జుట్టు రంగును నిర్ణయించేది మెలానిన్ అనే రసాయన పదార్థం. అది ప్రతి వెంట్రుకకు ఉండే ఫొలికల్‌లో తయారవుతుంది. కాబట్టి ఒక ఫొలికల్‌లో జరిగే మార్పు మరొక వెంట్రుకపై ప్రభావం చూపదు. వయస్సు, జన్యువు, ఒత్తిడి, జీవనశైలి, ఆహారం వంటి కారణాల వల్లే జుట్టు తెల్లబడుతుంది కానీ పీకడం వల్ల కాదు అని నిపుణులు తెలిపారు.

వెంట్రుకలు పీకకూడదు
వెంట్రుకను పీకడం మంచిది కాదని మాత్రం వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకటి, రెండు సార్లు పీకితే పెద్దగా సమస్య రాకపోవచ్చు కానీ తరచూ ఇలా చేస్తూ ఉంటే అది ఫొలికల్‌పై ఒత్తిడిని పెంతుంది. దీని వల్ల ఫోలికల్ నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఫొలికల్‌కు గాయాలు ఏర్పడితే అక్కడ మళ్లీ వెంట్రుక రావడం కష్టంగా మారుతుంది . పైగా జుట్టును బలంగా లాగి పీకేటప్పుడు స్కాల్ప్‌పై సూక్ష్మగాయాలు ఏర్పడి, దద్దుర్లు, వాపు, చర్మం ఎర్రబడటం, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో ఫొలిక్యుటైటిస్‌ అనే ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. ఇది బాధను, అలర్జీని పెంచుతుంది. ఒక తెల్ల వెంట్రుకను పీకితే అదే చోట మరో వెంట్రుక ఏ రంగులో పెరుగుతుందో పూర్తిగా ఫొలికల్ ఆరోగ్యం, మెలానిన్ తయారీ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది.

Advertisement

ఈ విషయంలో సైన్సు చెబుతున్నది ఏమిటంటే తెల్ల వెంట్రుకను పీకడం వల్ల మిగతా వెంట్రుకలు తెల్లగా మారిపోవు. పీకిన వెంట్రుక ఉన్న ఫొలికల్‌లోనే మార్పు జరగవచ్చు కానీ పక్కనున్న ఫొలికల్‌లపై ఏ ప్రభావం ఉండదు. అయితే జుట్టు తెల్లబడటం అనేది సహజ ప్రక్రియ. వయస్సు పెరిగే కొద్దీ మెలానిన్ తగ్గిపోతుంది. ఇదే కారణంగా మొదట కొన్ని వెంట్రుకలు, తర్వాత మరిన్ని వెంట్రుకలు తెల్లబడతాయి. ఇది వెంట్రుకను పీకడం వల్ల కాదు.. శరీరంలోని సహజ మార్పుల వల్లే జరిగే విషయం. అంతేకాక ప్రస్తుతం యువతలో కూడా తెల్లజుట్టు ఎక్కువగా కనిపించడం జీవనశైలి, ఒత్తిడి, నిద్రలేమి, పోషకాహార లోపం వంటి అంశాల వల్లేనని వైద్యులు చెబుతున్నారు. ఒక వెంట్రుక తెల్లగా మారగానే పీకేయడం సమస్యను పరిష్కరించదు. అసలు కారణాలను గుర్తించి వాటిని మార్చుకోవడం వవల్ల తెల్లజుట్టు పెరుగుదలను తగ్గించడానికి మంచి మార్గం అని వారు సూచిస్తున్నారు.

వీటిని తినండి
ఒక తెల్ల వెంట్రుక కనిపించినప్పుడే భయపడాల్సిన పనిలేదు. దాన్ని పీకడం కన్నా అలాగే వదిలేయడం లేదా నెమ్మదిగా కత్తిరించడం మంచిది. తరచూ పీకడం వల్ల దీర్ఘకాలంలో జుట్టు పలచబడటం, ఆ ప్రాంతాల్లో జుట్టు పెరుగుదల తగ్గిపోవడం వంటి దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంది. జుట్టు తెల్లబడడాన్ని తగ్గించాలంటే ఆహారంలో విటమిన్ B12, ఐరన్, ఒమేగా-3 వంటి పోషకాలు ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకోవడం, సరైన నిద్ర, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జుట్టు తెల్లబడినప్పుడు పీకడం కంటే, అవసరమైతే సురక్షితమైన హెయిర్ డైలు లేదా సహజ రంగులు ఉపయోగించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×