E-Paper
Advertisement

Honey:- వెన్నెతో ఇలా చేస్తే మీ చర్మం పట్టులా మారుతుంది.

Honey:- వెన్నెతో ఇలా చేస్తే మీ చర్మం పట్టులా మారుతుంది.
Advertisement

Honey:- సాధారణంగా మనం పాల నుండి తయార‌య్యే వెన్నను ఆహారంతో పాటు తీసుకుంటూ ఉంటాం. మనకు కావాల్సిన చాలా పోషకాలు వెన్నెలో ఉంటాయి. వెన్నెలో పాస్పరస్‌, కాల్షియంలాంటి ఖనిజాలతో పాటు విటమిన్‌ ఇ, విటమిన్‌ డి ఎక్కువగా ఉంటాయి. నిత్యం ఆహారంలో వెన్నెను భాగం చేసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్‌ పెరుగుతుంది. ఆరోగ్యానికి మేలుతో పాటు సౌంద‌ర్య సాధ‌నంగా కూడా వెన్నె అద్భుతంగా పనిచేస్తుంది. డైలీ వెన్నె తీసుకోవడం వల్ల చ‌ర్మంపై డెడ్‌స్కిన్‌ తొల‌గిపోయి చ‌ర్మం కాంతి వంతంగా మారుతుంది. వెన్నెను ఆహారంలో భాగంగా తీసుకున్నా లేదా శరీరానికి పట్టించుకుని స్నానం చేసినా ఆరోగ్యంతో పాటు శ‌రీర రంగు కూడా పెరుగుతుంది. చర్మ సౌందర్యానికి వెన్నె ఎంతో ఉపయోగపడుతుంది. చిన్న పిల్లలకు స్నానం చేపించడానికి ముందు వెన్నెను శరీరానికి బాగా పట్టించి నలుగుపెట్టి చేయిస్తే పిల్లల చ‌ర్మం మృదువుగా మరియు కాంతివంతంగా తయారవుతుంది. అంతే కాకుండా చ‌ర్మంపై అవాంచిత రోమాలు కూడా తొలగిపోతాయి. వెన్నె ముఖానికి రాసుకునిసున్నిపిండిలో ప‌సుపును క‌లిపి ముఖాన్ని రుద్దుకుంటే ముఖం తేజోవంతంగా మారుతుంది. న‌ల్లగా ఉన్న వారు వెన్నెలో తేనె క‌లిపి ప్రతిరోజు చ‌ర్మంపై రాయడం వల్ల చ‌ర్మం కాంతి వంతంగా మారుతుంది. లిప్ స్టిక్, లిప్ బామ్‌కి బదులు వెన్నెలో గులాబీ రెక్కల పేస్ట్ కలిపి రాస్తే పెద‌వులు పింక్ రంగులో మారడమే కాకుండా ఎండిపోకుండా ఉంటాయి. వెన్నెలో కోడిగుడ్డు తెల్ల సొన‌ క‌లిపి రాసుకుంటే క‌ళ్ల కింద ఉండే మ‌చ్చలు, ముడ‌తలు పోతాయి. వెన్నెలో ప‌సుపు క‌లిపి రాసుకుంటే పాదాల ప‌గుళ్లు త‌గ్గిపోతాయి. వెన్నెలో న‌ల్ల నువ్వులు క‌లిపి మూత్రలుగా చేసి తింటే జుట్టు నెర‌వ‌కుండాఉంటుంది. ప్రతిరోజూ భోజ‌నంలో ఒక ముద్దలో వెన్నె కలిపి తింటే వృద్ధాప్య ఛాయ‌లు రాకుండా ఉంటాయి. కంటి రెప్పలపై వెన్నె రాసుకుంటే కనురెప్పలు రాలకుండా ఉంటాయి. బొప్పాయి పండు గుజ్జులో వెన్నె కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం పొడిబారకుండా ఉంటుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×