// //

How To Stop Receding Hairline : మన తలపై జుట్టు నిండుగా ఉంటే ఆ కాన్పిడెన్స్ వేరు. జుట్టు ఒత్తుగా ఉండటం వల్ల అందంగా కనిపిస్తారు. తలపై జుట్టు రాలుతుంటే ఆ బాధ చెప్పలేనిది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయినప్పటికీ తల్లో దురదగా ఉండటం, మాడు కనిపించడం, జుట్టు పలుచబడటం వంటి సమస్యలు ఎదుర్కొంటారు.
తలపై దురదగా ఉండటం, జుట్టు పలుచబడటం, తల చుట్టూ జుట్టు క్రమంగా తగ్గిపోవడాన్ని రిసిడీంగ్ హెయిర్ లైన్ అంటారు. ఈ సమస్యను తగ్గించుకోవడం కొంచెం కష్టమనే చెప్పాలి. ఈ సమస్య రావటానికి మనం చేసే చిన్నచిన్న తప్పులే మొదటి కారణం. ఆ తప్పులెంటో తెలుసుకొని జాగ్రత్త పడితే ఈ సమస్యను దూరం చేయొచ్చు.
Also Read : మేక పాలు.. బెనిఫిట్స్ తెలిస్తే షాక్ అవుతారు!
ఈ తప్పులు చేయకండి
ఈ జాగ్రత్తలు పాటించండి
పోషకాహారం
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవడం ముఖ్యం. విటమిన్లు, మినరళ్లు, ప్రొటీన్లున్న ఆహారం తీసుకోండి. ఇవి జుట్టు ఎదుగుదలకు సహాయపడతాయి. గుడ్లు, చేపలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు తినండి. ఆహారంలో తీసుకోండి.
మాడు శుభ్రత
మాడును ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. తక్కువ గాఢత ఉన్న షాంపులను వాడండి. వేడిగా ఉన్న నీళ్లతో స్నానం చేయొద్దు. జట్టును ఎక్కువగా రుద్దొద్దు. ఎక్కువగా ఆయిల్స్ వాడకండి. జుట్టులో సహజమైన ఆయిల్స్ ఉంటాయని మరచిపోవద్దు. గది ఉష్ణోగ్రత దగ్గర ఉండే నీటితో స్నానం చేయండి.
Also Read : ఇండియన్ టాయిలెట్స్ Vs వెస్ట్రన్ టాయిలెట్స్.. ఏది మంచిది?
ఒత్తిడి
ఒత్తిడి కారణంగా జుట్టు అధికంగా ఊడే ప్రమాదం ఉంది. తరచూ వ్యాయామం, వాకింగ్ చేయండి. వీటిని మీ జీవితంలో ఓ భాగం చేసుకోండి. ఈ అలవాటు మీ జుట్టు ఆరోగ్యానికే కాదు.. మీ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
Disclaimer: ఈ కథనాన్ని పలు మెడికల్ జర్నల్స్ ఆధారంగా, ఇంటర్నెట్‌లోని సమచారం మేరకు అందిస్తున్నాం. దీనిని కేవలం అవగాహనగా భావించండి.