E-Paper
Advertisement

ఈ చిన్న ట్రిక్ తెలిస్తే.. ఏడాది పొడవునా ఫ్రెస్ మామిడి పండ్లు తినొచ్చు.. ఎలాగంటే?

ఈ చిన్న ట్రిక్ తెలిస్తే.. ఏడాది పొడవునా ఫ్రెస్ మామిడి పండ్లు తినొచ్చు.. ఎలాగంటే?
Advertisement

Mango Storage Tips: వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరికీ ముందుగా గుర్తొచ్చేది మామిడి పండ్లే. మామిడి ముక్కలు, నోరూరించే ఆమ్రస్, చల్లని మ్యాంగో షేక్స్, స్మూతీలు.. ఇలా రకరకాలుగా వీటిని ఆస్వాదిస్తుంటాం. కానీ, మనం పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేసే లోపే సీజన్ అయిపోతుంది. మళ్లీ వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందేనా అని చాలామంది బాధపడుతుంటారు. అయితే ఒక చిన్న చిట్కా పాటిస్తే మామిడి పండ్లను ఏకంగా 8 నెలల పాటు ఫ్రెష్‌గా దాచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

మంచి పండ్లను ఎంచుకోవాలి:

మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలి కాబట్టి.. బాగా పండిన, తియ్యటి మామిడి పండ్లను ఎంచుకోవాలి. మరీ మెత్తగా ఉన్నవి, అక్కడక్కడా దెబ్బతిన్న వాటిని అస్సలు తీసుకోకూడదు. పండ్లు ఎంత నాణ్యంగా ఉంటే, ఫ్రీజర్‌లో పెట్టిన తర్వాత కూడా వాటి రుచి, రంగు అంత బాగుంటాయి.

Advertisement

Also Read: ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదేమో.. స్మార్ట్ ఫ్రిడ్జ్‌లపై ఏకంగా రూ.57,000 తగ్గింది.. ఎక్కడ కొనుగోలు చేయాలంటే?

ముక్కలుగా కట్ చేయాలి:

ఎంచుకున్న మామిడి పండ్లను నీళ్లలో బాగా కడిగి, తడి లేకుండా పొడి గుడ్డతో పూర్తిగా తుడవాలి. తడి ఉంటే ఐస్ గడ్డలు కట్టేసి ముక్కలు పాడవుతాయి. ఆ తర్వాత తొక్క తీసేసి, అన్నీ ఒకే సైజులో ఉండేలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి.

విడివిడిగా ఫ్రీజ్ చేయడం ఎలా?

Advertisement

కోసిన ముక్కలను ఒక పెద్ద ప్లేట్ లేదా ట్రేలో ఒకదానికొకటి అంటుకోకుండా దూరం దూరంగా సర్దాలి. దీనిపై క్లింగ్ ఫిల్మ్ లేదా ప్లాస్టిక్ కవర్ కప్పి, ఒక రాత్రంతా ఫ్రీజర్‌లో ఉంచేయాలి. ఇలా చేయడం వల్ల ముక్కలు ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా గడ్డకడతాయి.

గాలి చొరబడని డబ్బాలో పెట్టాలి:

బాగా గడ్డకట్టిన మామిడి ముక్కలను ఫ్రీజర్ లోంచి తీసి, ఒక జిప్ లాక్ బ్యాగ్ లేదా ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేసి దాచుకోవాలి. బ్యాగ్ లోంచి గాలిని పూర్తిగా తీసేసి సీల్ చేయడం వల్ల పండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. మీకు కావాల్సినప్పుడు కొన్ని ముక్కలు బయటకు తీసి, ఐదు నిమిషాలు పక్కన పెట్టి నేరుగా తినూయొచ్చు.

Also Read: పాత జ్ఞాపకాలు గుర్తొచ్చేలా.. నోకియా కంపెనీ నుంచి ఊహించని క్రేజీ ఫోన్.. లీకైన లుక్స్ చూశారా?

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×