E-Paper
Advertisement

Tips For Coffee Stains: బట్టలపై కాఫీ,టీ మరకలా ? కంగారు పడకండి.. చిటికెలో మాయం చేసే చిట్కాలివిగో

Tips For Coffee Stains: బట్టలపై కాఫీ,టీ మరకలా ? కంగారు పడకండి.. చిటికెలో మాయం చేసే చిట్కాలివిగో
Advertisement

Tips For Coffee Stains: మనం ఆఫీసులో ఉన్నప్పుడో లేదా ఉదయాన్నే హడావిడిగా ఉన్నప్పుడో పొరపాటున కాఫీ ఒలకడం సహజం. కాఫీలో ఉండే ‘టానిన్స్’ ఫ్యాబ్రిక్ దారాల్లోకి త్వరగా ఇంకిపోయి.. ఆరిపోయే కొద్దీ గట్టి పడతాయి. చాలా మంది ఆ మరకను చూసి బట్టలు పాడైపోయాయని భావిస్తారు. కానీ.. కాఫీ పడిన వెంటనే సరైన విధంగా స్పందిస్తే.. బట్టలపై ఎలాంటి ఆనవాళ్లు లేకుండా శుభ్రం చేయవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కాఫీ మరకను ఎలా తొలగించాలి అనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం,

కాఫీ మరకలను తొలగించే చిట్కాలు:
బట్టలపై పడిన కాఫీ మరకలను ఈజీగా తొలగించడానికి ఈ కింది పద్ధతులు పాటించండి

Advertisement

1. తక్షణం చేయాల్సినవి: 
కాఫీ పడగానే మనం చేసే మొదటి తప్పు దాన్ని గట్టిగా రుద్దడం. ఇలా చేయడం వల్ల మరక ఫ్యాబ్రిక్ లోపలికి మరింత లోతుగా వెళ్తుంది.

ఏం చేయాలి: ఒక తెల్లటి కాగితం లేదా కాటన్ క్లాత్ తీసుకుని మరకపై మెల్లగా అద్దండి. దీని వల్ల ఇంకా ఆరని కాఫీ ద్రవం క్లాత్ పీల్చుకుంటుంది.

Advertisement

గమనిక: ఎప్పుడూ మరక చుట్టుపక్కల నుంచి మధ్యలోకి అద్దాలి. లేకపోతే మరక మరింత వెడల్పుగా మారుతుంది.

2. చల్లటి నీటితో మ్యాజిక్:
మరక తాజాది అయితే.. కేవలం నీటితోనే దాన్ని 80% వరకు తొలగించవచ్చు. బట్టను తిరగేసి (మరక వెనుక వైపు నుంచి) ఫోర్స్‌గా చల్లటి నీటిని ధారగా పోయండి. ఇది కాఫీ అణువులను దారాల నుంచి బయటకు నెట్టేస్తుంది. ఇందుకు వేడి నీటిని అస్సలు వాడకండి. ఎందుకంటే వేడి మరకను ‘సెట్’ చేస్తుంది.

3. లిక్విడ్ డిటర్జెంట్ , నీరు:
కొద్దిగా లిక్విడ్ డిటర్జెంట్‌ను నీటిలో కలిపి మరకపై రాయండి. 5 నిమిషాల పాటు అలాగే ఉంచి.. మెత్తటి బ్రష్‌తో లేదా వేళ్లతో వృత్తాకారంలో రుద్దండి.

ఆపై చల్లటి నీటితో కడిగేయండి. ఇలా చేయడం వల్ల తొందరగా మరకలు కూడా తొలగిపోతాయి.

4. వెనిగర్ :
పాతబడిన లేదా ఎండిపోయిన మరకలకు వెనిగర్ అద్భుతంగా పని చేస్తుంది.

మిశ్రమం: ఒక టేబుల్ స్పూన్ వైట్ వెనిగర్, ఒక టేబుల్ స్పూన్ నీరు, కొద్దిగా డిటర్జెంట్ కలిపి పేస్ట్‌లా చేయండి. ఈ పేస్ట్‌ను మరకపై అప్లై చేసి 15 నిమిషాలు వదిలేయండి. ఆపై సాధారణంగానే ఉతికేయండి. వెనిగర్‌లోని అసిడిక్ గుణాలు కాఫీ రంగును విడగొడతాయి.

5. బేకింగ్ సోడా పద్ధతి:
బేకింగ్ సోడా కాఫీలోని తేమను, రంగును పీల్చుకోవడంలో దిట్ట. తడి మరకపై బేకింగ్ సోడాను చల్లి 30 నిమిషాల పాటు ఉంచండి.

అది రంగును పీల్చుకున్నాక.. బ్రష్‌తో దులపండి. తెల్లటి దుస్తులకు ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.

Also Read: వాటర్ బాటిల్ క్లీనింగ్.. ఇలా చేస్తే జిడ్డు, బ్యాక్టీరియా క్షణాల్లోనే మాయం

6. ఎగ్ యోక్ :
వినడానికి వింతగా ఉన్నా.. ఉన్ని లేదా సిల్క్ బట్టలపై కాఫీ మరకలకు ఇది బాగా పని చేస్తుంది. ఒక కోడి గుడ్డు సొనను కొంచెం గోరు వెచ్చని నీటిలో కలిపి మరకపై రాయండి. ఒక నిమిషం తర్వాత నీటితో కడిగేయండి. ఇందులో ఉండే ప్రోటీన్లు కాఫీ మరకలను క్లాత్ నుంచి వేరు చేస్తాయి.

7. ఎండలో ఆరబెట్టడం:
మరకను శుభ్రం చేసిన తర్వాత.. బట్టను ఎండలో ఆరబెట్టడం వల్ల సహజమైన బ్లీచింగ్ జరుగుతుంది. సూర్యరశ్మి మిగిలిపోయిన చిన్నపాటి మచ్చలను కూడా తొలగించగలదు.

మీరు ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నా.. కాఫీ మరకలు వాటి అందాన్ని పాడు చేయగలవు. కానీ పై చిట్కాలను సరైన సమయంలో పాటిస్తే.. మీ బట్టలు మళ్లీ కొత్త వాటిలా మెరుస్తాయి. ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది. తొందరగా స్పందించడం.రుద్దకుండా ఉండటం.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×