E-Paper
Advertisement

Chicken Fry Recipe: ఈ స్టైల్లో చికెన్ ఫ్రై చేసుకున్నారంటే.. గిన్నె మొత్తం ఊడ్చేస్తారు, అంత బాగుంటుంది!

Chicken Fry Recipe: ఈ స్టైల్లో చికెన్ ఫ్రై చేసుకున్నారంటే.. గిన్నె మొత్తం ఊడ్చేస్తారు, అంత బాగుంటుంది!
Advertisement

Chicken Fry Recipe: చాలామంది ఫేవరెట్ నాన్‌వెజ్ రెసిపీ చికెన్ ఫ్రై. ఈ వంటకాన్నే రెగ్యులర్‌గా చేసుకోవడానికి ఇష్టపడతాం. అయితే ఎప్పుడూ రొటీన్ పద్ధతిలోనే కాకుండా కాస్త భిన్నంగా ట్రై చేస్తే.. తక్కువ సమయంలోనే ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రైను ఆస్వాదించవచ్చు. ఇప్పుడు చెప్పకునే సింపుల్ స్టైల్లో చికెన్ ఫ్రై చేసుకున్నారంటే.. చికెన్ అంటే పెద్దగా ఇష్టం లేనివాళ్లు కూడా లొట్టలేసుకుని తినేస్తారు. మరి తయారీ విధానం ఎలాగో తెలుసుకుందామా.

కావాల్సిన పదార్థాలు:

చికెన్ – 500 గ్రాములు
ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)
అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
పచ్చిమిర్చి – 2 (సన్నగా కట్ చేసినవి)
కారం – రుచికి తగ్గట్టు
ధనియాల పొడి – కావాల్సినంత
గరం మసాలా – రుచికి సరిపడా
పసుపు – కావాల్సినంత
ఉప్పు – రుచికి సరిపడా
నిమ్మరసం – 1 టీస్పూన్
కరివేపాకు – పిడికెడు
నూనె – సరిపడా తీసుకోవాలి.

Advertisement

Also Read: బరువు తగ్గాలంటే బ్రేక్‌ఫాస్ట్‌లో ఇదే బెస్ట్ ఆప్షన్.. నిపుణులు చెబుతున్న బ్రోకలీ రెసిపీని ట్రై చేయండిలా!

తయారీ విధానం:

ముందుగా మీకు కావాల్సినంత చికెన్‌ను ఒక పెద్ద బౌల్‌లో వేసుకోవాలి. తర్వాత దానిమీద ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ కలిపి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కనీసం అరగంట పాటు నాననివ్వాలి. తర్వాత స్టౌవ్‌ మీద పాన్ పెట్టి, నూనె వేసుకుని, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఈ తర్వాత ఉల్లిపాయలు వేసి నెమ్మదిగా వేయించి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు కలుపుతూ ఉండాలి.

Advertisement

ఉల్లిపాయలు బాగా వేయించిన తర్వాత పక్కన పెట్టిన చికెన్‌ను పాన్‌లో వేసి మసాలా చుట్టూ పాకేలా కలపాలి. మంటను మీడియమ్‌లో ఉంచి మూతపెట్టి ఉడికించాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపితే చికెన్ అంటుకోదు. ఇక చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత మూతతీసి మంట కొంచెం పెంచి నీరు పూర్తిగా ఆరే వరకు ఫ్రై చేయాలి. చివరగా గరం మసాలా, నిమ్మరసం వేసి మరోసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ చికెన్ ఫ్రై రెడీ.

Also Read: మిగిలిపోయిన అన్నంతో గార్లిక్ ఫ్రైడ్ రైస్.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలనిపించే రుచి!

 

 

 

Tags

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×