E-Paper
Advertisement

Skin Care Tips: ఎప్పుడూ యవ్వనంగా ఉండాలంటే ఏం చేయాలి? అందరూ చేసే ఈ తప్పులు మీరు చేయకండి!

Skin Care Tips: ఎప్పుడూ యవ్వనంగా ఉండాలంటే ఏం చేయాలి? అందరూ చేసే ఈ తప్పులు మీరు చేయకండి!
Advertisement

Skin Care Tips: వయసు పెరగడాన్ని ఆపడం ఎవరి చేతుల్లోనూ ఉండదు. కానీ ఆ వయసు గుర్తులు ముఖంపై త్వరగా కనిపించాలా, లేక ఆలస్యంగా రావాలా అనేది మాత్రం చాలా వరకు మన జీవనశైలిపైనే ఆధారపడి ఉంటుంది. ముడతలు మొదలయ్యాక చాలామంది వెంటనే క్రీములు, ట్రీట్మెంట్లు, సర్జరీల వైపు మొగ్గు చూపుతారు. కానీ నిజం ఏమిటంటే.. చర్మం నిగారింపు కోల్పోవడం ఒక్క రోజులో జరిగేది కాదు. అలాగే మెరుపు కూడా ఒక్క క్రీమ్‌తో రాదు.

మనం రోజూ తీసుకునే ఆహారం, తాగే నీరు, నిద్ర, ఒత్తిడి.. ఇవన్నీ కలిసి మన చర్మానికి లోపలి నుండి ఆరోగ్యాన్నిస్తాయి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ నేపథ్యంలో ఖరీదైన క్రీములు, మేకప్ లేకుండానే సహజమైన గ్లో రావాలంటే.. పెద్ద మార్పులు అవసరం లేదు. కొన్ని సింపుల్ మార్గాల ద్వారా వయసు పెరిగినా చర్మం తాజాగా కనిపించేలా చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Also Read: ఓట్స్ తింటే నిజంగా బరువు తగ్గుతారా? చాలామందికి తెలియని అసలు నిజం ఇదే!

నిద్రతో పునరుజ్జీవం..

శరీరానికి ఇచ్చే విశ్రాంతే మన చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు చర్మ కణాలు తమను తాము మరమ్మత్తు చేసుకుంటాయి. రోజుకు కనీసం 7 – 8 గంటల నిద్ర ఉంటేనే కణాల పునరుత్పత్తి వేగంగా జరిగి, ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. ఇక ఆహార విషయానికొస్తే.. తాగా పండ్లు, కూరగాయలు, మంచి కొవ్వులు ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల చర్మానికి అవసరమైన యాంటీఆక్సిడెంట్లు అందుతాయి. ఇవి చర్మాన్ని మృదువుగా ఉంచి ముడతలు రాకుండా రక్షణ కల్పిస్తాయి.

శారీరక శ్రమ తప్పనిసరి..

Advertisement

శరీరంలో రక్త ప్రసరణ పెరిగితేనే చర్మానికి సరైన పోషణ అందుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి, చర్మ రంధ్రాల ద్వారా మలినాలు బయటకు పోతాయి. అలాగే, అధిక ఒత్తిడి వల్ల శరీరంలో విడుదలయ్యే కార్టిసాల్ హార్మోన్ చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందుకే యోగా లేదా ధ్యానం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆ ప్రశాంతత చర్మాన్ని యవ్వనంగా మారుస్తుంది.

ఈ జాగ్రత్తలు పాటించాలి..

వృద్ధాప్య ఛాయలు త్వరగా రావడానికి ప్రధాన కారణం సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత కిరణాలు. ఇవి చర్మం లోపలి పొరలను దెబ్బతీసి నల్లటి మచ్చలు, పిగ్మెంటేషన్, ముడతలకు దారితీస్తాయి. అందుకే ఎండలో వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. సహజమైన పద్ధతులతో చర్మాన్ని సంరక్షించుకోవడం వల్ల కేవలం అందమే కాకుండా, పూర్తి శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వయసు కేవలం అంకె మాత్రమే అని నిరూపించవచ్చు.

Also Read: మీకు నచ్చినవాళ్లందరూ దూరం అవుతున్నారా? అయితే ఈ అలవాట్లే కారణం కావచ్చు!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×