E-Paper
Advertisement

Free Wi-Fi: ఫోన్‌లో డేటా అయిపోయిందా ? ఫ్రీ వైఫై హాట్‌స్పాట్‌లను.. గుర్తించడానికి 10 ట్రిక్స్

Free Wi-Fi: ఫోన్‌లో డేటా అయిపోయిందా ? ఫ్రీ వైఫై హాట్‌స్పాట్‌లను.. గుర్తించడానికి 10 ట్రిక్స్
Advertisement

Free Wi-Fi: మొబైల్ డేటా అయిపోయినప్పుడు లేదా ప్రయాణాలు చేస్తునన్నప్పుడు ఉచిత వై-ఫై (Wi-Fi) దొరికితే కలిగే వచ్చే ఆనందం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ప్రయాణికులకు.. విద్యార్థులకు, ఫ్రీలాన్సర్‌లకు ఇంటర్నెట్ కనెక్టివిటీ చాలా కీలకం. మీరు ఉచిత వై-ఫై ఎక్కడుందో కనుక్కోవడానికి కొన్ని రకాల టిప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఉచిత వై-ఫై లభించే ప్రాంతాలు:
వ్యాపారులు తమ కస్టమర్‌లను ఆకర్షించడానికి , సేవలను మెరుగు పరచడానికి కాంప్లిమెంటరీ వై-ఫైని అందిస్తాయి. వీటిని గుర్తించడం చాలా సులభం.

Advertisement

కెఫేలు , రెస్టారెంట్లు: స్టార్‌బక్స్, మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ వంటి పెద్ద పెద్ద ఫుడ్ చైన్‌లలో దాదాపుగా ఉచిత వై-ఫై ఉంటుంది. అలాగే.. ప్రస్తుతం స్థానిక కాఫీ షాపులు కూడా ఈ సదుపాయాన్ని అందిస్తాయి. వై-ఫై పాస్‌వర్డ్ బిల్లుపై లేదా బోర్డుపై అందుబాటులో ఉంటుంది.

షాపింగ్ మాల్స్ , రిటైల్ స్టోర్‌లు: పెద్ద షాపింగ్ మాల్స్, అలాగే కొన్ని ప్రధాన రిటైల్ స్టోర్‌లు (సూపర్ మార్కెట్‌లు) ఉచిత నెట్‌వర్క్‌ను అందిస్తాయి.

Advertisement

గ్రంథాలయాలు, పబ్లిక్ పార్కులు: ప్రభుత్వ లైబ్రరీలు, మ్యూజియంలు, కొన్ని ప్రధాన పబ్లిక్ పార్కులలో ఉచిత వై-ఫై సేవలు అందుబాటులో ఉంటాయి.

రవాణా కేంద్రాలు : దాదాపు అన్ని విమానాశ్రయాలు , ప్రధాన రైల్వే స్టేషన్లు (ఉదాహరణకు, రైల్‌టెల్ నెట్‌వర్క్), పెద్ద బస్ టెర్మినల్స్‌లో పరిమిత సమయం వరకు ఉచిత పబ్లిక్ వై-ఫైని అందిస్తారు.

హోటల్ లాబీలు: కొన్ని హోటళ్లు తమ లాబీ ప్రాంతంలో ఉన్నవారికి కాంప్లిమెంటరీ వై-ఫైని అందిస్తాయి.కస్టమర్లు కానివారు కూడా అడిగి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

2. గుర్తించడానికి చిట్కాలు, యాప్‌లు:

వై-ఫై ఫైండర్ యాప్‌లు: ‘WiFi Map’, ‘Instabridge’ లేదా ‘Wifinity’ వంటి యాప్‌లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉచిత హాట్‌స్పాట్‌ల మ్యాప్‌లు, పాస్‌వర్డ్‌లను అందిస్తాయి. ఈ డేటా తరచుగా వినియోగదారుల ద్వారా అప్‌డేట్ చేయబడుతుంది.

గూగుల్ మ్యాప్స్ : కొన్ని ప్రదేశాలలో.. గూగుల్ మ్యాప్స్‌లోని బిజినెస్ లిస్టింగ్‌లలో సంస్థ ఉచిత వై-ఫైని అందిస్తుందో లేదో అనే సమాచారం అందుబాటులో ఉంటుంది.

సాధారణ పాస్‌వర్డ్‌లను ప్రయత్నించడం: కొన్ని చిన్న సంస్థలు వై-ఫై పాస్‌వర్డ్‌లను మార్చకుండా “12345678”, “guest”, లేదా “password” వంటి సాధారణ పదాలను వాడుతుంటాయి.

3. భద్రతా :
మీరు ఉచిత పబ్లిక్ వై-ఫైని ఉపయోగిస్తున్నప్పుడు.. మీ డేటా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం.

VPN ఉపయోగించండి: పబ్లిక్ వై-ఫై నెట్‌వర్క్‌లు సాధారణంగా సురక్షితమైనవి కావు. మీ డేటాను హ్యాకర్ల నుంచి రక్షించడానికి ఎల్లప్పుడూ వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (VPN) ను ఉపయోగించండి.

Also Read: మీరు కోరుకోని గట్ సమస్యలకు కాఫీనే కారణం ! ఇప్పటికైనా తప్పు తెలుసుకోండి

ఆన్ లైన్ చెల్లింపులు: పబ్లిక్ వై-ఫైకి కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఆన్‌లైన్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ లావాదేవీలు లేదా పాస్‌వర్డ్‌లను మార్చడం వంటి ముఖ్యమైన లావాదేవీలను నివారించండి.

ఫైల్ షేరింగ్ ఆఫ్ చేయండి: నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయినప్పుడు మీ పరికరంలో ఫైల్ షేరింగ్ ఫీచర్‌ను నిలిపివేయండి.

సరైన చిట్కాలు, కొద్దిపాటి భద్రతా జాగ్రత్తలతో.. మీరు ఎక్కడ ఉన్నా సులభంగా ఉచిత వై-ఫైని కనుగొని, మీ పనిని పూర్తి చేసుకోవచ్చు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×