E-Paper
Advertisement

Microwave Cleaning Tips: మీ మైక్రోవేవ్ కొత్తదానిలా మెరవాలా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి

Microwave Cleaning Tips:  మీ మైక్రోవేవ్ కొత్తదానిలా మెరవాలా? ఈ  సింపుల్ చిట్కాలు ట్రై చేయండి
Advertisement

Microwave Cleaning Tips: మైక్రోవేవ్ ఓవెన్ ప్రతి వంటింట్లోనూ ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఆహారాన్ని వేడి చేయడమే కాకుండా.. రకరకాల వంటకాలను నిమిషాల్లో వండటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అయితే.. తరచుగా మైక్రోవేవ్ ఓవెన్ వాడటం వల్ల ఆహార పదార్థాల మరకలు, జిడ్డు, దుర్వాసన మైక్రోవేవ్‌లో పేరుకుపోతుంటాయి. వీటిని అలాగే వదిలేస్తే.. బ్యాక్టీరియా పెరిగి ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. రసాయనాలతో కూడిన క్లీనర్ల కంటే ఇంట్లోనే దొరికే సహజ సిద్ధమైన వస్తువులతో మైక్రోవేవ్‌ను కొత్త దానిలా మెరిపించడం ఎలాగో ఇప్పుడు పూర్తి వివరాలను తెలుసుకుందాం.

మైక్రోవేవ్ శుభ్రం చేయడానికి ఉత్తమ మార్గాలు:
మైక్రోవేవ్‌ను శుభ్రం చేయడానికి కఠినమైన కెమికల్స్ వాడటం వల్ల లోపల ఉండే సున్నితమైన భాగాలకు నష్టం జరగవచ్చు. అందుకే కింద పేర్కొన్న ‘స్టీమ్ క్లీనింగ్’ అత్యంత ప్రభావవంతమైనది.

Advertisement

1. నిమ్మరసంతో స్టీమ్ క్లీనింగ్:
ఇది అత్యంత ప్రజాదరణ పొందిన, సులభమైన పద్ధతి. ఒక మైక్రోవేవ్-సేఫ్ బౌల్‌లో రెండు కప్పుల నీటిని తీసుకోండి. అందులో ఒక నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి రసాన్ని పిండండి. ఆ తొక్కలను కూడా నీటిలోనే వేయండి.

ఈ గిన్నెను మైక్రోవేవ్‌లో ఉంచి 5 నిమిషాల పాటు హై పవర్‌లో ఆన్ చేయండి. నీరు మరిగి ఆవిరి వస్తుంది. ఈ ఆవిరి లోపల ఉన్న గట్టిపడిన ఆహారపు మరకలను మెత్తబరుస్తుంది. వెంటనే తలుపు తెరవకుండా మరో 5 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత తలుపు తీసి, ఒక మెత్తటి గుడ్డతో లోపల తుడిచేయండి. నిమ్మరసం మంచి సువాసనను కూడా ఇస్తుంది.

Advertisement

2. వెనిగర్ :
జిడ్డు ఎక్కువగా ఉన్నప్పుడు వెనిగర్ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో సగం నీరు, సగం వైట్ వెనిగర్ కలిపి మైక్రోవేవ్‌లో ఉంచండి. 5 నిమిషాల పాటు వేడి చేయండి. వెనిగర్ ఆవిరి గోడలకు పట్టిన మొండి జిడ్డును వదిలిస్తుంది. తర్వాత తలుపు తీసి గిన్నెను జాగ్రత్తగా బయటకు తీసి, తడి క్లాత్‌ తో తుడిస్తే జిడ్డు సులభంగా వచ్చేస్తుంది.

3. బేకింగ్ సోడాతో మొండి మరకల తొలగింపు:
మైక్రోవేవ్ తలుపుపై లేదా మూలల్లో మొండి మరకలు ఉంటే బేకింగ్ సోడా వాడండి. బేకింగ్ సోడా,నీటిని కలిపి చిక్కటి పేస్ట్‌లా చేయండి. మరకలు ఉన్న చోట దీన్ని రాసి 10 నిమిషాల పాటు వదిలేయండి.
తర్వాత తడి స్పాంజ్ లేదా గుడ్డతో తుడిచేయండి. ఇది సహజ సిద్ధమైన స్క్రబ్బర్‌లా పనిచేస్తుంది.

4. తలుపు, గ్లాస్ క్లీనింగ్:
మైక్రోవేవ్ బయట, అద్దంపై చేతి ముద్రలు, దుమ్ము పేరుకుపోతాయి. నీరు, వెనిగర్ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్‌లో పోసి అద్దంపై చల్లండి. మైక్రో ఫైబర్ క్లాత్‌తో తుడిస్తే గ్లాస్ మెరుస్తుంది.

కంట్రోల్ ప్యానెల్ (బటన్స్) దగ్గర నీటిని నేరుగా స్ప్రే చేయకుండా.. గుడ్డపై చల్లి తూడ్చుకోవాలి.

జాగ్రత్తలు:
పవర్ ఆఫ్: క్లీనింగ్ ప్రారంభించే ముందు మైక్రోవేవ్ ప్లగ్ తీసివేయడం మర్చిపోకండి.

గ్లాస్ ట్రే: లోపల ఉండే గ్లాస్ ప్లేట్‌ను బయటకు తీసి విడిగా సబ్బు నీటితో కడగవచ్చు.

లోహపు వస్తువులు: ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ స్క్రబ్బర్లను వాడకండి. ఇవి స్క్రాచ్‌లు కలిగిస్తాయి.

దుర్వాసన: క్లీన్ చేసిన తర్వాత కూడా వాసన వస్తుంటే.. ఒక గిన్నెలో బేకింగ్ సోడా వేసి రాత్రంతా మైక్రోవేవ్ లోపల ఉంచితే అది వాసనను పీల్చుకుంటుంది.

వారానికి ఒకసారి ఈ పద్ధతులను అనుసరిస్తే.. మీ మైక్రోవేవ్ ఎప్పుడూ పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంటుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×