E-Paper
Advertisement

రూపాయి ఖర్చు లేకుండా.. ఇంట్లోని గాజు వస్తువులను డైమండ్‌లా మెరిపించే సూపర్ ఐడియా!

రూపాయి ఖర్చు లేకుండా.. ఇంట్లోని గాజు వస్తువులను డైమండ్‌లా మెరిపించే సూపర్ ఐడియా!
Advertisement

Glass Cleaning Tips: ఇంటిని ఎంత నీట్‌గా ఉంచినా.. బాత్రూమ్ షవర్ గ్లాస్ డోర్లు, అద్దాలు లేదా గాజు టేబుళ్లపై మొండి మరకలు పడితే చూడటానికి అందవిహీనంగా ఉంటుంది. వాటిని వదిలించడం కాస్త కష్టమైన పనే. అయితే, మన ఇంట్లో రోజూ వాడే బేకింగ్ సోడా, టూత్‌పేస్ట్‌లను కలిపి ఒక సూపర్ క్లీనర్‌ను తయారు చేసుకోవచ్చు. ఈ చిన్న చిట్కాతో గాజు వస్తువులను సరికొత్తగా ఎలా మెరిపించవచ్చో ఇప్పుడు చూద్దాం.

ఈ పేస్ట్ ఎలా పని చేస్తుందంటే?

బేకింగ్ సోడాకు మొండి మరకలను, జిడ్డును వదిలించే గుణం సహజంగానే ఉంటుంది. అలాగే టూత్‌పేస్ట్‌లోని క్లీనింగ్ ఏజెంట్లు మురికిని సులభంగా తొలగిస్తాయి. ఈ రెండింటినీ కలిపినప్పుడు ఒక పవర్‌ఫుల్ క్లీనింగ్ పేస్ట్ తయారవుతుంది. ఇది గాజు ఉపరితలంపై పేరుకుపోయిన గట్టి మరకలను, మురికిని స్క్రాచెస్ పడకుండా చాలా సున్నితంగా శుభ్రం చేస్తుంది.

Advertisement

Also Read: ఫ్రిడ్జ్ నుంచి వాటర్ లీక్ అవ్వడానికి ఈ 4 తప్పులే కారణం.. ఐదు నిమిషాల్లో ఫిక్స్ చేసుకోండిలా!

దీని వల్ల కలిగే ప్రయోజనాలు:

గ్లాస్ సర్ఫేస్‌లపై చేతులు పెట్టడం వల్ల పడే వేలిముద్రలు, నీటి వల్ల పడే తెల్లటి మరకలను వదిలించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కిచెన్‌లోని గాజు జార్లకు ఉన్న జిడ్డును, డైనింగ్ టేబుల్ గ్లాస్‌పై ఉన్న మొండి మురికిని ఇది ఈజీగా వదిలిస్తుంది. కేవలం శుభ్రం చేయడమే కాకుండా.. గాజు వస్తువులకు సరికొత్త మెరుపును కూడా ఇస్తుంది.

దీన్నెలా తయారు చేయాలి?

Advertisement

ఈ క్లీనింగ్ తయారీ చాలా సులువు. ఒక చిన్న గిన్నెలో ఒక చెంచా బేకింగ్ సోడా తీసుకోవాలి. అందులో తగినంత తెల్లటి టూత్‌పేస్ట్‌ను వేసి బాగా కలపాలి. ఈ రెండూ కలిసి ఒక చిక్కటి పేస్ట్‌లా మారేలా చూసుకోవాలి. ఒకవేళ మిశ్రమం మరీ గట్టిగా అనిపిస్తే, కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనకు నచ్చినట్లుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు.

ఉపయోగించే విధానం:

ముందుగా తయారుచేసుకున్న పేస్ట్‌ను ఒక మెత్తటి స్పాంజ్‌పైకి తీసుకోవాలి. దానితో గ్లాస్ ఉపరితలంపై వృత్తాకారంలో మెల్లగా రుద్దాలి. ఆ తర్వాత ఒక నిమిషం లేదా రెండు నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆపై ఒక తడి గుడ్డతో మిగిలిపోయిన పేస్ట్‌ను పూర్తిగా తుడిచేసి, చివరగా ఒక మైక్రోఫైబర్ క్లాత్‌తో తడి లేకుండా తూడిస్తే మీ ఇంటి అద్దాలు, గ్లాస్ వస్తువులు సరికొత్తగా మెరిసిపోతాయి.

Also Read: ఉల్లి పాయను ఇలా కోస్తే.. అసలు కళ్లే మండవు, మీరు చేస్తున్న తప్పు ఇదే!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×