E-Paper
Advertisement

Bedsheets: వారాల తరబడి బెడ్‌షీట్లు మార్చడం లేదా? అయితే ఈ సమస్యలు తప్పవు!

Bedsheets: వారాల తరబడి బెడ్‌షీట్లు మార్చడం లేదా? అయితే ఈ సమస్యలు తప్పవు!
Advertisement

Bedsheets: బెడ్‌షీట్లు ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి ? ఇది చాలా మందికి వచ్చే సందేహం. కొందరు వారానికి ఒకసారి మారిస్తే.. మరికొందరు నెలరోజులైనా వాటిని పట్టించుకోరు. కానీ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బెడ్‌షీట్లు మార్చడంలో నిర్లక్ష్యం వహిస్తే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీనికి గల కారణాలు పూర్తి వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం

Advertisement

బెడ్‌షీట్లను ఎన్ని రోజులకు మార్చాలి ?

సాధారణంగా ఆరోగ్యవంతులు వారానికి ఒకసారి తప్పనిసరిగా బెడ్‌షీట్లు, అంతే కాకుండా పిల్లో కవర్స్ తప్పకుండా మార్చాలి. ఒకవేళ మీరు ప్రతిరోజూ స్నానం చేసి పడుకునే అలవాటు ఉన్నవారైతే.. గరిష్టంగా రెండు వారాల వరకు అలాగే ఉంచవచ్చు. కానీ అంతకంటే ఎక్కువ రోజులు ఒకే దుప్పటిపై పడుకోవడం మాత్రం అస్సలు మంచిది కాదు.

Advertisement

మనం రోజూ రాత్రి పూట సుమారు 7 నుంచి 9 గంటల సమయం మంచం మీద గడుపుతాము. ఈ సమయంలో మనకు తెలియకుండానే కొన్ని ప్రక్రియలు కూడా జరుగుతాయి.

మృతకణాలు : ప్రతిరోజూ మన శరీరం నుంచి వేల సంఖ్యలో చర్మ కణాలు రాలిపోతాయి. ఇవి బెడ్‌షీట్ల పొరల్లో చాలా వరకు పేరుకుపోతాయి.

చెమట, నూనె: నిద్రలో మన శరీరం నుంచి సహజంగానే చెమట, చర్మం నుంచి జిడ్డు విడుదలవుతాయి. ఇవి దుప్పట్లకు అంటుకుంటాయి.

దుమ్ము పురుగులు : మనం వదిలే మృతకణాలను తినడానికి కంటికి కనిపించని ‘డస్ట్ మైట్స్’ బెడ్ షీట్లపై చేరుతాయి. ఇవి అలర్జీలకు ప్రధాన కారణంగా మారతాయి.

బ్యాక్టీరియా, వైరస్‌లు: బయట నుంచి వచ్చే దుమ్ము, జంతువుల వెంట్రుకలు, అంతే కాకుండా మన శరీరంపై ఉండే బ్యాక్టీరియా కూడా బెడ్‌షీట్ల మీదకు చేరుతాయి. ఇవి వివిధ రకాల ఆరోగ్య సమస్యను కలిగిస్తాయి.

ఎవరు తరచుగా బెడ్ షీట్లు మార్చాలి ?

కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వారానికి ఒకసారి కంటే ముందే అంటే ప్రతి 3-4 రోజులకు ఒకసారి బెడ్‌షీట్లు మార్చడం అవసరం.

అలర్జీ సమస్యలు : మీకు ఆస్తమా, తుమ్ములు లేదా దుమ్ము వల్ల అలర్జీ వస్తుంటే వెంట వెంటనే బెడ్ షీట్లను మార్చాలి.

చర్మ సమస్యలు: ముఖంపై మొటిమలు లేదా ఎగ్జిమా వంటి సమస్యలు ఉన్నవారు తరచుగా పిల్లో కవర్స్ మార్చాలి.

పెంపుడు జంతువులు: మీతో పాటు పిల్లులు లేదా కుక్కలు మంచంపై పడుకుంటే.. మాత్రం వాటి వెంట్రుకలు, బ్యాక్టీరియా వల్ల 3 రోజులకు ఒకసారి మార్చడం చాలా మంచిది.

అనారోగ్యం: జ్వరం, జలుబు లేదా ఇన్‌ఫెక్షన్ వచ్చినప్పుడు తగ్గిన వెంటనే బెడ్‌షీట్లు మార్చాలి. ఎందుకంటే.. ఆ వైరస్ మళ్ళీ మీకు అంటుకునే ప్రమాదం చాలా వరకు ఉంది.

రాత్రిపూట ఎక్కువ చెమట పట్టేవారు: మీకు నిద్రలో ఎక్కువగా చెమట పడితే.. వెంటనే మార్చడం చాలా మంచిది.

Also Read: సొరకాయతో షుగర్ కంట్రోల్.. ఇంకా దీని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు !

బెడ్‌షీట్లను ఎలా ఉతకాలి ?

కేవలం మార్చడమే కాదు.. బెడ్ షీట్లను సరిగ్గా ఉతకడం కూడా ముఖ్యం.

వేడి నీరు: వీలైనంత వరకు బెడ్‌షీట్లను వేడి నీటిలో (సుమారు 60°C) ఉతకడం వల్ల బ్యాక్టీరియా, డస్ట్ మైట్స్ వంటివి పూర్తిగా నశిస్తాయి.

ఎండలో ఆరబెట్టడం: సూర్యరశ్మి సహజమైన క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. కాబట్టి ఉతికిన దుప్పట్లను నేరుగా ఎండలో ఆరబెడితే మంచిది.

పిల్లో కవర్లు: బెడ్‌షీట్ల కంటే పిల్లో కవర్లను తరచుగా మార్చాలి. ఎందుకంటే మన ముఖం నేరుగా వాటికి అంటుకుంటుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×