E-Paper
Advertisement

Hormonal Imbalance: బరువు పెరుగుతున్నారా? పీరియడ్స్ సరిగ్గా రావడం లేదా? అయితే మీలో ఈ సమస్య ఉన్నట్టే!

Hormonal Imbalance: బరువు పెరుగుతున్నారా? పీరియడ్స్ సరిగ్గా రావడం లేదా? అయితే మీలో ఈ సమస్య ఉన్నట్టే!
Advertisement

Hormonal Imbalance: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య హార్మోన్ల అసమతుల్యత. పని ఒత్తిడి, మారిన జీవనశైలి వల్ల తెలియకుండానే ఈ సమస్య బారిన పడుతున్నారు. దీనివల్ల బరువు పెరగడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం వంటి ఇబ్బందులు ఎదురౌతున్నాయి. అయితే, దీన్నేదో పెద్ద సమస్యగా భావించి అంతలా కంగారు పడాల్సిన పనిలేదు. మనం తీసుకునే ఆహారంలో చిన్నపాటి మార్పులు చేసుకుంటే హార్మోన్లను సహజంగానే అదుపులో ఉంచుకోవచ్చు.

 ఆహారంలో ఫైబర్ ఉండాలి:

హార్మోన్లు సమతుల్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు సరైన మోతాదులో ఉండాలి. ముఖ్యంగా ఫైబర్ (పీచు) ఎక్కువగా ఉండే తాజా పండ్లు, ఆకుకూరలు, కాయగూరలను రోజూ తీసుకోవాలి. ఇది రక్తంలోని ఇన్సులిన్ స్థాయిని క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. బొప్పాయి, యాపిల్, జామ వంటి పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి అవసరమైన అందడమే కాకుండా హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది.

Advertisement

Also Read: రోజూ ఉదయాన్నే క్యారెట్ జ్యూస్ తాగితే.. మొండి కొవ్వు కరగడమే కాదు, చర్మం కూడా మెరుస్తుంది!

మంచి కొవ్వులు అవసరం:

సాధారణంగా కొవ్వు అనగానే చాలామంది భయపడతారు. కానీ శరీరంలో కొత్త కణాలు నిర్మితమవ్వాలన్నా, హార్మోన్ల ఉత్పత్తి సరిగ్గా జరగాలన్నా కొవ్వులు చాలా అవసరం. ముఖ్యంగా వెజిటబుల్ ఆయిల్స్‌లో ఉండే పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే, ఏది తిన్నా మితంగా ఉండటం ముఖ్యమని గుర్తుంచుకోవాలి.

అతిగా కెఫిన్ వద్దు:

Advertisement

చాలామంది అలసటగా ఉన్నప్పుడు లేదా ఏదైనా పని ఒత్తిడిలో ఉన్నప్పుడు కప్పుల కొద్దీ కాఫీలు తాగుతుంటారు. కాఫీ తాగడం వల్ల తక్షణ ఉపశమనం లభించినట్లు అనిపించినా.. దానిలో ఉండే కెఫీన్ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. అతిగా కాఫీ తాగడం వల్ల నిద్రలేమి సమస్య తలెత్తి, అది కాస్తా హార్మోన్ల గందరగోళానికి దారితీస్తుంది. కాబట్టి కాఫీని ఒక పరిమితిలో తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

Also Read: పోషకాల గని మొలకలు.. రోజూ తింటే మీ శరీరంలో జరిగే అద్భుతాలివే!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×