E-Paper
Advertisement

Healthy Breakfast : నిద్రలేవగానే నీరసంగా అనిపిస్తుందా ? ఈ ‘పవర్ బ్రేక్‌ఫాస్ట్’ తో రీఛార్జ్ అవ్వండి!

Healthy Breakfast : నిద్రలేవగానే నీరసంగా అనిపిస్తుందా ? ఈ ‘పవర్ బ్రేక్‌ఫాస్ట్’ తో రీఛార్జ్ అవ్వండి!
Advertisement

Healthy Breakfast: మనం రోజంతా ఉత్సాహంగా పని చేయాలంటే శరీరానికి సరైన ఇంధనం కావాలి. రాత్రంతా ఖాళీగా ఉన్న కడుపులోకి మనం తీసుకునే మొదటి ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. “బ్రేక్‌ఫాస్ట్ రాజులా ఉండాలి” అనే సామెత ఊరికే పుట్టలేదు. ఇది మన జీవక్రియను వేగవంతం చేసి, మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది. సరైన ప్రొటీన్లు, ఫైబర్ కలిగిన బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల రోజంతా అలసట లేకుండా ఉండవచ్చు.

బ్రేక్ ఫాస్ట్ ఎందుకు ముఖ్యం ?
చాలా మంది బరువు తగ్గాలనే ఉద్దేశంతో లేదా సమయం లేక ఉదయం పూట ఏమీ తినకుండానే పనుల్లోకి వెళ్తుంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైన అలవాటు. రాత్రి భోజనానికి, ఉదయం అల్పాహారానికి మధ్య దాదాపు 10 నుంచి 12 గంటల సమయం ఉంటుంది. ఈ గ్యాప్‌ను భర్తీ చేస్తూ శరీరాన్ని రీఛార్జ్ చేసేదే బ్రేక్‌ఫాస్ట్.

Advertisement

బ్రేక్ ఫాస్ట్ లో ఉండాల్సిన ముఖ్యమైన అంశాలు:
1. ప్రొటీన్లు: కండరాల పటుత్వానికి, ఆకలిని నియంత్రించడానికి ప్రొటీన్లు అవసరం. గుడ్లు, పప్పు ధాన్యాలు, సోయా వంటివి ఇందులో చేర్చాలి.
2. ఫైబర్: జీర్ణ క్రియ సజావుగా సాగడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి పీచు పదార్థం (ఫైబర్) ఎంతో మేలు చేస్తుంది.

3. విటమిన్లు & ఖనిజాలు: తాజా పండ్లు, కూరగాయల ద్వారా ఇవి లభిస్తాయి.

Advertisement

బెస్ట్ బ్రేక్ ఫాస్టులు:
నానబెట్టిన బాదం, అక్రోట్లు: ఉదయం నిద్రలేవగానే కాఫీ, టీలకు బదులు 5 నానబెట్టిన బాదం పప్పులు, రెండు వాల్ నట్స్ తినండి. వీటిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు చురుకుదనాన్ని పెంచుతాయి. బాదం పొట్టు తీసి తినడం వల్ల అందులోని పోషకాలు శరీరానికి త్వరగా అందుతాయి.

ఓట్స్ లేదా మొలకెత్తిన గింజలు: ఓట్స్‌లో ‘బీటా-గ్లూకాన్’ అనే ఫైబర్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అలాగే.. మొలకెత్తిన పెసలు, శనగలు తీసుకోవడం వల్ల సహజసిద్ధమైన ప్రొటీన్లు అందుతాయి. ఇవి తింటే.. త్వరగా ఆకలి వేయదు. తద్వారా జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఉండవచ్చు.

Also Read: బట్టలపై కాఫీ,టీ మరకలా ? కంగారు పడకండి.. చిటికెలో మాయం చేసే చిట్కాలివిగో

తాజా పండ్లు: బ్రేక్‌ఫాస్ట్‌లో కనీసం ఒక పండు ఉండేలా చూసుకోండి. అరటిపండు తక్షణ శక్తిని ఇస్తే, బొప్పాయి జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. యాపిల్, జామ వంటి పండ్లు యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి.

జాగ్రత్తలు:
బ్రేక్‌ఫాస్ట్‌లో పంచదార ఎక్కువగా ఉండే సిరియల్స్, మైదాతో చేసిన బ్రెడ్స్ లేదా నూనెలో వేయించిన పదార్థాలను (బజ్జీలు, పూరీ) తగ్గించడం మంచిది. ఇవి తిన్న వెంటనే శక్తిని ఇచ్చినట్లు అనిపించినా.. కాసేపటికే మళ్ళీ నీరసం వచ్చేలా చేస్తాయి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×