E-Paper
Advertisement

ఐస్‌క్రీమ్ ఎక్కువగా తింటున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే భయపడాల్సిందే!

ఐస్‌క్రీమ్ ఎక్కువగా తింటున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే భయపడాల్సిందే!
Advertisement

Ice Cream Side Effects: సీజన్ ఏదైనా తరచూ ఐస్‌క్రీమ్ తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఈ తీపి పదార్థం మన మూడ్‌ని అప్పటికప్పుడు ఉత్సాహంగా మార్చేస్తుంది. రుచికి బానిసై మీరు కూడా అతిగా ఐస్‌క్రీమ్‌ లాగించేస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే. ఐస్‌క్రీమ్‌లో ఉండే అధిక చక్కెర, కొవ్వు , రసాయనాలు మన అంతర్గత అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అప్పుడప్పుడు పరిమితంగా తింటే పర్వాలేదు కానీ.. దానిని వ్యసనంగా మార్చుకుంటే కలిగే అనర్థాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

ఐస్‌క్రీమ్ అతిగా తినడం వల్ల కలిగే ప్రధాన అనర్థాలు:

Advertisement

1. ఊబకాయం, బరువు పెరగడం:
ఐస్‌క్రీమ్‌లో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే అధిక చక్కెర , కొవ్వు పదార్థాలు శరీరంలో కొవ్వు నిల్వలను పెంచుతాయి. రోజూ ఐస్‌క్రీమ్ తినడం వల్ల శరీర మెటబాలిజం తగ్గి, చాలా త్వరగా బరువు పెరిగే అవకాశం ఉంది. ఇది చివరికి ఊబకాయానికి దారి తీస్తుంది.

2. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం:
ఐస్‌క్రీమ్‌లో శుద్ధి చేసిన చక్కెర అధికంగా ఉంటుంది. ఇది తిన్న వెంటనే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అకస్మాత్తుగా పెంచుతుంది. పదే పదే ఇలా జరగడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడి, టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

Advertisement

3. గుండె ఆరోగ్యంపై ప్రభావం:
ఐస్‌క్రీమ్‌లలో సాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. దీని వల్ల రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి గుండెపోటు, ఇతర గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

4. మెదడు పని తీరు మందగించడం:
అతిగా చక్కెర తీసుకోవడం వల్ల మెదడులోని ‘డోపమైన్’ స్థాయిలలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఒక అధ్యయనం ప్రకారం..అధికంగా శాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకునే వారిలో జ్ఞాపకశక్తి తగ్గడం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మందగించడం వంటి సమస్యలు కనిపిస్తాయి.

Also Read: గ్రీన్ టీ పవర్ పెరగాలా? పరిశోధనల ప్రకారం ఈ 3 సప్లిమెంట్లను మిక్స్ చేయండి!

5. జీర్ణక్రియ సమస్యలు:
ఐస్‌క్రీమ్ ఒక పాల ఉత్పత్తి. చాలా మందిలో ‘లాక్టోజ్ ఇంటాలరెన్స్’ఉంటుంది. అలాంటి వారు ఐస్‌క్రీమ్ తిన్నప్పుడు కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు వంటి సమస్యలు ఎదుర్కొంటారు. అలాగే ఇందులో ఉండే కృత్రిమ రంగులు, ఫ్లేవర్లు జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తాయి.

6. పంటి సమస్యలు:
ఐస్‌క్రీమ్‌లోని చక్కెర పళ్ల మీద ఒక పొరలా పేరుకుపోతుంది. నోటిలోని బ్యాక్టీరియా ఈ చక్కెరతో కలిసి యాసిడ్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది పంటి ఎనామెల్‌ను దెబ్బతీసి పిప్పి పళ్లు ఏర్పడటానికి కారణమవుతుంది.

ఐస్‌క్రీమ్ అనేది మన ఆనందం కోసం తినే పదార్థమే కానీ. అది ఆహారం కాదు. ఆరోగ్యంగా ఉండాలంటే ఐస్‌క్రీమ్‌ను అప్పుడప్పుడు మాత్రమే ఒక ‘ట్రీట్’లా తీసుకోవాలి. దీనికి బదులుగా ఇంట్లోనే తయారు చేసుకున్న ఫ్రూట్ జ్యూస్ లేదా పెరుగుతో చేసిన ‘ఫ్రోజెన్ యోగర్ట్’ వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం మంచిది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి రుచి కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×