E-Paper
Advertisement

Chikiri Hook Step Benefits: ‘చికిరి’ స్టెప్పులేస్తే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? డైలీ చేస్తే..

Chikiri Hook Step Benefits: ‘చికిరి’ స్టెప్పులేస్తే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా? డైలీ చేస్తే..
Advertisement

Chikiri Hook Step Benefits: ప్రస్తుతం ఎక్కడా చూసినా.. ఎవరి నోట విన్నా.. ఎవరు డ్యాన్స్ చేసినా ఒకటే మ్యూజిక్. అదేనండి.. పెద్ది సినిమాలో చికిరి చికిరి పాటకు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ వేసిన స్టెప్స్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందో మనందరికీ తెలిసిందే. అయితే, ఈ చికిరి పాటలో రామ్ చరణ్ వేసిన స్టెప్స్ వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు వైద్యు నిపుణులు. నిజమేనండీ బాబూ.. ఈ స్టెప్స్‌ను సరిగ్గా చేస్తే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు అంటున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

గుండె ఆరోగ్యం పదిలం:

మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం గుండె. కాబట్టి దీర్ఘకాల ఆరోగ్యం కోసం గుండెకు సంబంధించిన వ్యాయామాలు ఎంతో అవసరం. అయితే నేటి ఆధునిక జీవన శైలి, గంటల తరబడి కూర్చొని చేసే ఉద్యోగాల వల్ల చాలామందిని గుండె సమస్యలు ఎటాక్ చేస్తున్నాయి. అలాగే రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చికిరి స్టెప్స్‌తో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు వైద్యులు.

Advertisement

Read Also: జిమ్‌కు వెళ్లకుండానే ఈ మూడు పనులు చేయండి.. బాడీ ఫిట్‌నెస్ ఎందుకు రాదో చూద్దాం!

ఎలా చేయాలంటే?

ఈ చికిరి చికిరి స్టెప్స్ చాలా క్రియేటివ్‌గా అలాగే సింపుల్‌గా ఉంటుంది. ఈ స్టెప్స్‌లో చిన్నగా లెగ్స్ కదలిస్తూ, హ్యాండ్స్ మెల్లగా మూవ్ చేయాలి. దీనివల్ల మన శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. ఆక్సిజన్ సరఫరా సమానంగా జరిగి హార్ట్ రేట్ స్థిరంగా పెరుగుతుందట. గుండెకు అవసరమైన వ్యాయామం జరగడం వల్ల గుండె పదిలంగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

శారీరక శక్తి పెరుగుతుంది:

Advertisement

చికిరి చికిరి స్టెప్స్ వల్ల గుండెకు మాత్రమే కాదు.. మొత్తం ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది అంటున్నారు వైద్యులు. ఈ స్టెప్స్‌ వల్ల కేలరీలు బర్న్ కావడం, జీవక్రియ పెరగడం, శక్తి స్థాయి పెరగడం లాంటి లాభాలు బోలెడు ఉన్నాయి. అలాగే ఈ స్టెప్స్‌ను రోజూ సరిగ్గా ప్రయత్నిస్తే.. స్ట్రోక్, హై బ్లడ్‌ప్రెజర్ వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. అంతేకాదు.. చికిరి స్టెప్స్ వల్ల లెగ్స్, హ్యాండ్స్, కోర్ మజిల్స్, శారీరక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు.

ఇకపోతే.. ఈ చికిరి స్టెప్స్ చేయడం రాకపోతే.. కుర్చీలో కూర్చొని పాదాలను వేళ్లపై ఉంచి తిరిగి యథాస్థానానికి తిరిగి తీసుకురావాలి. అలాగే, మోకాలు నుంచి కాలును పైకి లేపి యాంకిల్‌ను పైకి, కిందకి కదిపితే సరిపోతుంది. ఇలా 10 సెట్లు చొప్పున రెండుసార్లు చేయాలి. ఎందుకంటే.. చాలామంది శారీరక వ్యాయామం లేకుండా ఎక్కువసేపు కూర్చొని ఉద్యోగాలు చేసే వాళ్లు, వాకింగ్ చేయడానికి వీలుకాని వాళ్లు కూర్చున్న చోటే ఇలాంటి చికిరి చికిరి స్టెప్స్ చేయడం వల్ల.. వాకింగ్ చేస్తే వచ్చే ఫలితాలు దాదాపుగా వస్తాయి.

Read Also: స్టైలిష్‌గా ఉందని స్మార్ట్‌వాచ్ వాడుతున్నారా.. మరి సైడ్ ఎఫెక్ట్స్ సంగతేంటి?

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×