E-Paper
Advertisement

అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్.. ఎండాకాలంలో ఈ ‘ గోంద్ కతీరా’ అస్సలు మిస్ అవ్వకండి!

అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్.. ఎండాకాలంలో ఈ ‘ గోంద్ కతీరా’ అస్సలు మిస్ అవ్వకండి!
Advertisement

Gond Katira In Summer: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి.. ఈ వేసవిలో ఒంట్లో వేడిని తగ్గించుకోవడానికి కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ తింటున్నారా? అయితే జాగ్రత్త. వాటి వల్ల తాత్కాలికంగా హాయిగా ఉన్నా, ఆరోగ్యానికి చేటే. ప్రకృతి సిద్ధంగా లభించే ‘గోంద్ కతీరా’ను మీ డైట్‌లో చేర్చుకుంటే ఎండ దెబ్బ (Sunstroke) తగలకుండా ఉండటమే కాకుండా.. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. అసలు ఈ గోంద్ కతీరా వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు, అది ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎండాకాలంలో గోంద్ కతీరా ఆరోగ్య ప్రయోజనాలు:

Advertisement

1. బాడీ కూలెంట్‌గా అద్భుతం:
గోంద్ కతీరాలో సహజసిద్ధమైన కూలింగ్ గుణాలు ఉన్నాయి. ఎండలో తిరగడం వల్ల లేదా వేడి గాలి వల్ల వచ్చే ‘సన్ స్ట్రోక్’ నుంచి ఇది మనల్ని కాపాడుతుంది. అంతే కాకుండా ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి.. లోపల చల్లగా ఉంచుతుంది.

2. జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
చాలా మందికి ఎండాకాలంలో కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా మలబద్ధకం వంటి సమస్యలు వస్తుంటాయి. గోంద్ కతీరాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది. అంతే కాకుండా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

Advertisement

3. చర్మ సౌందర్యం:
దీనిలో ఉండే యాంటీ ఏజింగ్ గుణాలు ముడతలను తగ్గిస్తాయి. మొటిమలు, వేడి వల్ల వచ్చే దద్దుర్లు తగ్గడానికి ఇది బాగా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి మెరిసేలా చేస్తుంది.

4. ఎముకల బలం:
దీనిలో కాల్షియం , మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. రోజూ గోంద్ కతీరా తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది మంచి ఔషధం.

Also Read: ఎయిర్ ఫ్రైయర్ ఫుడ్.. చుక్క నూనె లేదు సరే, ఆరోగ్యం సంగతేంటీ?

5. ఎనర్జీ బూస్టర్:
నీరసంగా ఉన్నప్పుడు గోంద్ కతీరా కలిపిన పాలు లేదా షర్బత్ తాగితే తక్షణ శక్తి లభిస్తుంది. ముఖ్యంగా గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు ఇది బలాన్ని ఇస్తుంది.

ఎలా ఉపయోగించాలి?
గోంద్ కతీరాను నేరుగా తినకూడదు. రాత్రంతా నీళ్లలో నానబెడితే.. అది జెల్లీలాగా మారుతుంది. ఈ జెల్లీని మరుసటి రోజు..

1.మజ్జిగలో కలిపి తాగొచ్చు.

2.నిమ్మరసం లేదా నన్నారి షర్బత్‌లో వేసుకోవచ్చు.

3. పాలు, పండ్లు , డ్రై ఫ్రూట్స్‌తో కలిపి మిల్క్ షేక్ లాగా తీసుకోవచ్చు.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×