// // Capsicum: శీతాకాలంలో క్యాప్సికం తింటే లెక్కలేనన్ని బెనిఫిట్స్! -->
E-Paper
Advertisement

Capsicum: క్యాప్సికమంటే మొహం చిట్లించుకుంటున్నారా?.. శీతాకాలంలో తింటే లెక్కలేనన్ని ప్రయోజనాలు!

Capsicum: క్యాప్సికమంటే మొహం చిట్లించుకుంటున్నారా?.. శీతాకాలంలో తింటే లెక్కలేనన్ని ప్రయోజనాలు!
Advertisement

Capsicum: చాలామందికి నచ్చని కూరగాయల్లో క్యాప్సికం ఒకటి. కానీ ఈ కూరగాయను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. క్యాప్సికం ఎరుపు, పచ్చ, పసుపు రంగుల్లో లభిస్తాయి. అంతేకాదు.. ఒక్కో క్యాప్సికంలో ఒక్కో విటమిన్స్, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు ఉంటాయి. అలాగే క్యాప్సికంలో క్యాలరీలు తక్కువ, డైటరీ ఫైబర్ ఎక్కువ. కాబట్టి.. ఇది శీతాకాలంలో మన రోగనిరోధ శక్తి వ్యవస్థను బలపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాక.. క్యాప్సికం జీర్ణవ్యవస్థ, గుండె, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మరి శీతాకాలంలో క్యాప్సికం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..

క్యాన్సర్‌కు అడ్డుకట్ట:

క్యాప్సికంలో లుటిన్, జియాక్సంతిన్ వంటి కెరోటినాయిడ్లు ఉంటాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. క్యాప్సికం బరువు తగ్గించడంలోనూ సహాయపడుతుంది. ముఖ్యంగా క్యాన్సర్‌ నిరోధంలో సహాయకారిగా నిలుస్తుంది. ఈ కూరగాయలో ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉండటం వలన.. ఇవి శరీరాన్ని ఆక్సీకరణ నష్టం నుండి రక్షిస్తాయి. రెడ్ క్యాప్సికమ్‌లో కనిపించే క్యాప్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్ చర్మాన్ని హానికరమైన UV కిరణాల నుంచి రక్షిస్తుంది.

Advertisement

Read Also: ఎంతసేపూ చికనూ మటనేనా.. అలసందల్లోనూ పోషకాలు మెండుగుంటాయ్!

అనేక వ్యాధులకు చెక్:

క్యాప్సికంలో ఎ, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతాయి. దీంతో అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. ఈ కూరగాయలో ఉండే ఐరన్ కంటెంట్ వలన రక్తహీనత సమస్య నుంచి బయటపడొచ్చు. ఇది రక్తహీనత ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడుతుంది. క్యాప్సికం‌లోని యాంటీఆక్సిడెంట్ లైకోపీన్, విటమిన్లు సి, ఎ లకు మంచి మూలం. ఈ పోషకాలన్నీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

అధిక బరువు నియంత్రణలో:

Advertisement

మధుమేహం, అధిక బరువు వంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్లు క్యాప్సికం తింటే ఎంతో ఉపయోగకరం. వారంలో రెండు నుంచి మూడుసార్లు క్యాప్సికం తీసుకుంటే.. సీజనల్ ఇన్ఫెక్షన్స్ బారి నుంచి తప్పించుకోవచ్చు. అంతేకాదు.. క్యాస్సికంలో క్యాలరీలు తక్కువగా ఉండటం వలన అధిక బరువును నియంత్రణలో ఉంచుతుంది. అలాగే ఈ కూరగాయలో ఉండే అపిజెనిన్, లూపియోల్, క్యాప్సియేట్, కెరోటినాయిడ్లు క్యాన్సర్‌తో పోరాడే యాంటీఆక్సిడెంట్లు. కాబట్టి.. అనేక వ్యాధులకు క్యాప్సికం ఔషధంగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

Read Also: ఈ కాంబినేషన్ మీకూ ఇష్టమా?.. ఆ సమయాల్లో తింటే అద్బుత‌మైన లాభాలు పొందొచ్చు!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×