E-Paper
Advertisement

ఆరెంజ్ vs గ్రీన్.. ఈ రెండు రకాల కొబ్బరి బొండాల్లో ఏది తాగితే ఎక్కువ బలం?

ఆరెంజ్ vs గ్రీన్.. ఈ రెండు రకాల కొబ్బరి బొండాల్లో ఏది తాగితే ఎక్కువ బలం?
Advertisement

King Coconut vs Green Coconut: ఎండలు రోజురోజుకీ మండిపోతున్నాయి.. అడుగు బయట పెడితే చాలు, దప్పికతో గొంతు ఎండిపోతోంది. ఇలాంటి టైం‌లో రోడ్డు పక్కన కొబ్బరి బొండాల బండి కనిపిస్తే చాలు, ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. అయితే, బండి దగ్గరికి వెళ్లగానే మనకు రెండు రకాలు కనిపిస్తాయి. ఒకటి మనకు తెలిసిన పచ్చ బొండాలు, ఇంకొకటి కాషాయం లేదా పసుపు రంగులో ఉంటాయి. వీటిని చూడగానే మనలో చాలామందికి ఒకటే డౌట్.. రంగును బట్టి రుచి మారుతుందా? ఏది తాగితే ఒంటికి ఎక్కువ బలం? అని. ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే.. ఆ రెండింటి మధ్య ఉన్న అసలు తేడాలేంటో ముందు తెలుసుకోవాలి.

ఆ రంగుల్లో తేడా ఎందుకు?

చాలామంది ఏమనుకుంటారంటే.. ఆరెంజ్ రంగులో ఉన్నవి బాగా ముదిరిపోయినవి లేదంటే స్పెషల్ అని. కానీ నిజానికి అది కేవలం ఆ చెట్టు రకాన్ని బట్టి వచ్చే రంగు. మనం చూసే పచ్చ బొండాలు కామన్ వెరైటీ అయితే, ఈ ఆరెంజ్ రంగులో ఉండే వాటిని కింగ్ కోకోనట్ అని పిలుస్తారు. దీనిలో ఉండే సహజమైన పిగ్మెంట్స్ వల్ల అవి అలా ఆరెంజ్ కలర్‌లో కనిపిస్తాయి. అంతే తప్ప.. రంగు చూసి అది ముదిరిపోయిందని అనుకోకూడదు.

Advertisement

Also Read: రాత్రంతా ఏసీ వేసుకుని పడుకుంటున్నారా? తెల్లారేసరికి మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!

ఎందులో బలం ఎక్కువ?

కొబ్బరి నీళ్లు మీకు తీయగా కావాలంటే.. కళ్లు మూసుకుని ఆరెంజ్ కలర్ బొండాన్ని తాగొచ్చు. ఇవి తాగడానికి భలే రుచిగా ఉంటాయి. పైగా వీటిలో పోషకాలు కూడా ఎక్కువే. ముఖ్యంగా జిమ్ వర్కవుట్స్ చేసేవాళ్లకు, ఎండలో తిరిగి నీరసించిపోయిన వాళ్లకు ఇది ఇన్‌స్టంట్ ఎనర్జీ డ్రింక్‌లా పనిచేస్తుంది. ఇక పచ్చ బొండాల విషయానికి వస్తే.. వీటిలో నీళ్లు కాస్త ఎక్కువ వస్తాయి. తీపి కొంచెం తక్కువగా ఉన్నా, లైట్‌గా తాగాలి అనుకునే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్.

ఆరోగ్యానికి ఏది బెస్ట్?

Advertisement

నిజం చెప్పాలంటే.. ఏ రంగు బొండం అయినా మన శరీరానికి మేలే చేస్తుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల బాడీ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. కిడ్నీల్లో రాళ్లు పడకుండా ఉంటాయి. అయితే చిన్న తేడా ఏంటంటే.. ఆరెంజ్ రంగు బొండాల్లో యాంటీ ఆక్సిడెంట్స్, మెగ్నీషియం లాంటివి కాస్త ఎక్కువ ఉంటాయని డాక్టర్లు చెబుతుంటారు. అంటే.. శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీని ఇవ్వడంలో ఆరెంజ్ బొండం ఒక మెట్టు పైనే ఉంటుంది. కానీ పచ్చ బొండాల్లో కూడా విటమిన్లు తక్కువేం లేవు. అవి కూడా జీర్ణక్రియకు చాలా మంచివి.

ఎవరు ఏది తాగాలి?

ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. మీరు గనుక డైట్‌లో ఉండి, కేలరీలు తక్కువగా ఉండాలి అనుకుంటే పచ్చ బొండం తాగొచ్చు. ఒకవేళ లేదు.. నాకు మంచి టేస్ట్ కావాలి, ఫుల్ ఎనర్జీ రావాలి అనుకుంటే మాత్రం ఆరెంజ్ కలర్ బొండాన్ని ఎంచుకోండి. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి.. బొండం ఏదైనా సరే, కొట్టించిన వెంటనే తాగేయాలి. అప్పుడే దాని ప్రయోజనాలను పొందగలరు. ఈ వేసవిలో కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లకుండా, ఇలాంటి నేచురల్ డ్రింక్స్‌తో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Also Read: చిన్నారులను చిదిమేస్తున్న ‘డిజిటల్ ఫీడింగ్’.. తల్లిదండ్రులు జాగ్రత్త పడకపోతే అంతే సంగతులు!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×