E-Paper
Advertisement

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!
Advertisement

Green tea for weight loss: బరువు తగ్గాలనే జర్నీలో మనలో చాలా మంది ఫస్ట్ పట్టుకునే ఆయుధం ‘గ్రీన్ టీ’.ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కప్పులకి కప్పులు గ్రీన్ టీ తాగేస్తుంటారు. సెలబ్రిటీల నుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు అందరూ గ్రీన్ టీ గురించే చెప్తారు. కానీ.. “నెల రోజులుగా గ్రీన్ టీ తాగుతున్నా.. ఒక్క కిలో కూడా తగ్గలేదు బాస్” అని తలపట్టుకునే వాళ్ళు ఎంతో మంది. అసలు గ్రీన్ టీ తాగుతున్నా బరువు ఎందుకు తగ్గడం లేదు ? మీ డైట్‌లో ఎక్కడ తేడా కొడుతోంది? ఎక్కడ తప్పు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గడం లేదా?
ఫిట్ గా అవ్వాలని సోషల్ మీడియాలో రీల్స్ చూసి ఇన్ స్పైర్ అయిపోయి.. మార్కెట్ లో దొరికే బెస్ట్ గ్రీన్ టీ ప్యాకెట్ కొనేసి ఉంటారు. రోజుకి రెండు మూడు సార్లు వేడి వేడిగా తాగేస్తుంటారు. కానీ వెయింగ్ మెషిన్ మీద నిలబడితే.. ముల్లు మాత్రం పక్కకి జరగదు. ఎందుకలా? గ్రీన్ టీలో లోపమా? లేక మనం తాగే పద్ధతిలో లోపమా? అంటే.. కచ్చితంగా మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే దీనికి కారణం.

Advertisement

1. చేదుగా ఉందని షుగర్, హనీ యాడ్ చేస్తున్నారా?
గ్రీన్ టీ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా, చేదుగా ఉంటుంది. అందుకే చాలామంది అందులో ఒక స్పూన్ పంచదార లేదా కొద్దిగా తేనె కలుపుతారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది! మీరు బరువు తగ్గడానికి మెటబాలిజం పెంచే గ్రీన్ టీ తాగుతూ.. అందులో క్యాలరీలు ఉండే షుగర్ గానీ, మార్కెట్ లో దొరికే కల్తీ తేనె గానీ కలిపితే ఇక లాభం ఏముంటుంది? గ్రీన్ టీ వల్ల వచ్చే బెనిఫిట్ ని ఈ స్వీట్నర్స్ జీరో చేసేస్తాయి. కాబట్టి, ప్లెయిన్ గ్రీన్ టీ తాగడానికి ట్రై చేయండి. టేస్ట్ కోసం కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే చాలు.

2. గ్రీన్ టీ తాగే టైమింగ్ :
చాలామంది భోజనం చేసిన వెంటనే లేదా బ్రేక్ ఫాస్ట్ తో పాటు గ్రీన్ టీ తాగేస్తుంటారు. ఇది చాలా పెద్ద తప్పు. తిన్న వెంటనే గ్రీన్ టీ తాగడం వల్ల మనం తిన్న ఆహారంలోని ఐరన్, ఇతర పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించలేదు. పైగా జీర్ణక్రియ మందగిస్తుంది. గ్రీన్ టీ తాగడానికి బెస్ట్ టైమ్ ఏంటంటే.. భోజనానికి ఒక గంట ముందు లేదా భోజనం చేసిన రెండు గంటల తర్వాత. అలాగే పరగడుపున తాగడం వల్ల కొందరిలో ఎసిడిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

Advertisement

3.బరువు తగ్గడం:
“ఎంత ఎక్కువ తాగితే అంత త్వరగా బరువు తగ్గుతాం” అనే ఓ పెద్ద అపోహ మార్కెట్ లో ఉంది. గ్రీన్ టీ మంచిదే కదా అని రోజుకి 5-6 కప్పులు తాగేస్తే అంతే సంగతులు. ఇందులో ఉండే కెఫిన్ వల్ల నిద్రలేమి, డీహైడ్రేషన్, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. నిద్ర సరిగ్గా లేకపోతే స్ట్రెస్ హార్మోన్లు పెరిగి, బరువు తగ్గడం పక్కన పెడితే ఇంకా పెరుగుతారు. రోజుకు 2 నుంచి గరిష్టంగా 3 కప్పులు మాత్రమే పర్ఫెక్ట్ డోస్.

4. మరుగుతున్న నీళ్లు:
గ్రీన్ టీ ఎలా ప్రిపేర్ చేస్తున్నారనే దానిపై కూడా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. నీళ్లు బాగా మరుగుతుండగా అందులో గ్రీన్ టీ ఆకులు లేదా టీ బ్యాగ్ వేసేసి మరిగించేస్తుంటారు. ఇలా చేయడం వల్ల.. గ్రీన్ టీలో ఉండే ‘కాటెచిన్స్’ నశించిపోతాయి. నీటిని మరిగించి, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత.. ఒక రెండు నిమిషాలు ఆగి, ఆ గోరు వెచ్చని నీటిలో గ్రీన్ టీ ఆకులు వేసి మూత పెట్టాలి. 3 నిమిషాల తర్వాత ఫిల్టర్ చేసుకుని తాగాలి.

5. కేవలం గ్రీన్ టీ:
అన్నిటికంటే ముఖ్యమైన విషయం.. గ్రీన్ టీ అనేది ఒక ‘కటలిస్ట్’ మాత్రమే, అది మ్యాజిక్ డ్రింక్ కాదు. బిర్యానీలు, పిజ్జాలు తినేసి, వర్కవుట్ అస్సలు చేయకుండా.. కేవలం గ్రీన్ టీ తాగితే బరువు తగ్గిపోతాం అనుకోవడం అత్యాశే అవుతుంది. ప్రాపర్ డైట్, డైలీ అట్లీస్ట్ 30 నిమిషాల ఫిజికల్ యాక్టివిటీతో పాటు గ్రీన్ టీని లైఫ్‌స్టైల్‌లో భాగం చేసుకుంటేనే అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి.

గ్రీన్ టీని సరైన పద్ధతిలో, సరైన సమయంలో తాగుతూ.. హెల్తీ ఫుడ్ తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ కరగడం ఖాయం. సో.. ఇవాల్టి నుంచే మీ గ్రీన్ టీ హ్యాబిట్స్ మార్చుకోండి. ఫిట్ గా మారండి.

Tags

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×