E-Paper
Advertisement

మెరిసే చర్మం, చల్లని శరీరం.. వేసవిలో ‘గోంత్ కతీరా’తో కలిగే 5 అద్భుత ప్రయోజనాలు

మెరిసే చర్మం, చల్లని శరీరం.. వేసవిలో ‘గోంత్ కతీరా’తో కలిగే 5 అద్భుత ప్రయోజనాలు
Advertisement

summer special drink: ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఫ్రిజ్ నీళ్లు, కూల్ డ్రింక్స్ తాగినా దాహం తీరదు, శరీరం చల్లబడదు. చాలా మందికి సబ్జా గింజల గురించి తెలుసు కానీ.. ఆయుర్వేదంలో అత్యంత శక్తివంతమైన కూలెంట్‌గా పేరున్న ‘గొంధు కటిరా’ గురించి చాలా తక్కువ మందికే అవగాహన ఉంది. ఇది ఒక రకమైన చెట్టు జిగురు. మండుతున్న ఎండల్లో.. వడదెబ్బ తగలకుండా.. శరీర ఉష్ణోగ్రతను నిమిషాల్లో అదుపులోకి తీసుకురావడంలో దీనికి సాటి మరొకటి లేదు. బార్లీ నీటితో దీనిని కలిపి తీసుకుంటే.. కలిగే ఆరోగ్య లాభాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

గొంధు కటిరా అనేది ఒక ఎండిన చెట్టు జిగురు. ఇది చూడటానికి చిన్న రాళ్లలా ఉన్నప్పటికీ.. దీని వెనక దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అపారం.

Advertisement

1. బాడీ హీట్‌ను తక్షణమే తగ్గిస్తుంది:
గొంధు కటిరాకు ఉన్న గొప్ప గుణం ఏంటంటే.. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గించడంలో ‘కూలింగ్ ఏజెంట్’లా పని చేస్తుంది. దీనిని రాత్రంతా నానబెడితే.. తెల్లని జెల్లీలా మారుతుంది. ఈ జెల్లీని తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే కడుపులో మంట, విపరీతమైన వేడి తగ్గి శరీరం చల్లబడుతుంది.

2. బార్లీ వాటర్, గోంద్ కతీరా కాంబినేషన్:
బార్లీ నీరు సహజంగానే కిడ్నీలను శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా శరీరానికి చలవ చేస్తుంది. ఈ బార్లీ వాటర్‌లో ఒక స్పూన్ నానబెట్టిన గోంద్ కతీరా జెల్లీని కలిపి తాగితే.. ఆ ప్రభావం రెట్టింపు అవుతుంది. ఇది వేసవిలో వచ్చే యూరిన్ ఇన్ఫెక్షన్లను అరికడుతుంది.

Advertisement

3. వడదెబ్బ నుంచి రక్షణ:
ఎండలో పనుల మీద తిరిగే వారికి వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువ. గోంద్ కతీరా తీసుకోవడం వల్ల శరీరానికి ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇది ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడి, డీహైడ్రేషన్ బారిన పడకుండా చూస్తుంది. ఆయుర్వేదంలో.. దీనిని వేసవి కాలపు “బెస్ట్ సీక్రెట్” అని పిలుస్తారు.

4. చర్మ సౌందర్యం, మలబద్ధకం:
వేసవిలో చర్మంపై వచ్చే చెమటకాయలు, దద్దుర్లు తగ్గడానికి గొంధు కటిరా సహాయ పడుతుంది. ఇందులో ఉండే పీచు పదార్థం మలబద్ధకం సమస్యను పోగొట్టి జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది. ఇది చర్మాన్ని లోపల నుంచి హైడ్రేట్ చేసి మెరిసేలా చేస్తుంది.

దీన్ని ఎలా ఉపయోగించాలి?
గోంద్ కతీరాకు సొంతంగా ఎలాంటి రుచి ఉండదు. కాబట్టి దీనిని ఏ డ్రింక్ నైనా కలుపుకోవచ్చు.

నానబెట్టడం: 1 లేదా 2 చిన్న గోంద్ కతీరా ముక్కలను గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయానికి అది మెత్తటి ఐస్ ముక్కలాంటి జెల్లీలా మారుతుంది.

డ్రింక్స్: ఈ జెల్లీని నిమ్మరసం, రూఅఫ్జా, షర్బత్, మిల్క్ షేక్స్ లేదా కేవలం చల్లని బార్లీ నీటిలో కలుపుకోవచ్చు.

రుచి కోసం: కొద్దిగా పటిక బెల్లం లేదా తేనె కలుపుకుంటే రుచిగా ఉంటుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×