E-Paper
Advertisement

Ginger Prawns: జింజర్ ప్రాన్స్.. ఇలా చేస్తే ప్లేటు ఖాళీ అవ్వాల్సిందే, రెసిపీ ఇదిగో

Ginger Prawns: జింజర్ ప్రాన్స్.. ఇలా చేస్తే ప్లేటు ఖాళీ అవ్వాల్సిందే, రెసిపీ ఇదిగో
Advertisement

మీకు సముద్రపు ఆహారాలు అంటే ఇష్టమా? అయితే రొయ్యలు మేము చెప్పిన విధంగా వండి చూడండి. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. అల్లంతో చేసే ఈ జింజర్ ప్రాన్స్ స్పైసీగా, టేస్టీగా ఉంటుంది. చలికాలంలో ఇలాంటి వంటకాలు తినాలి. ఇందులో వాడే రొయ్యలు, అల్లం రెండూ ఆహారానికి మేలు చేస్తాయి. ఈ రెసిపీని అన్నంతో, చపాతీలతోనూ కూడా తినవచ్చు. ఇంకెందుకు ఆలస్యం జింజర్ ప్రాన్స్ ఎలా చేయాలో తెలుసుకోండి.

జింజర్ ప్రాన్స్ రెసిపీకి కావలసిన పదార్థాలు
రొయ్యలు – పావు కిలో
అల్లం తురుము – రెండు స్పూన్లు
వెల్లుల్లి తురుము – ఒక స్పూను
ఉల్లిపాయ – ఒకటి
పచ్చిమిర్చి – రెండు
కారం – ఒక స్పూను
పసుపు – పావు స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – రెండు స్పూన్లు
కరివేపాకులు – గుప్పెడు
కొత్తిమీర తరుగు – ఒక స్పూన్
నిమ్మరసం – ఒక స్పూను

Advertisement

జింజర్ ప్రాన్స్ రెసిపీ
1. ముందుగా రొయ్యలను శుభ్రంగా కడిగి నీటిని వంపేసి పక్కన పెట్టుకోవాలి.
2. అందులో పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి పది నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా చేస్తే రొయ్యల వాసన రాకుండా ఉంటాయి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి అందులో కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
4. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి.
5. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం తురుము, వెల్లుల్లి వేసి రెండు మూడు నిమిషాలు వేయించాలి.
6. ఇప్పుడు కారం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి.
7. ఇది బాగా వేగిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న రొయ్యలను ఇందులో వేసి కలుపుకోవాలి.
8. రొయ్యలు త్వరగానే ఉడుకుతాయి. కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు.
9. చిన్న మంటపై పది నిమిషాలు పాటు వేయిస్తే రొయ్యలు బాగా వేగుతాయి.
10. ఇలా రొయ్యలు పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి పైన కొత్తిమీరను చల్లుకొని, నిమ్మరసం చల్లుకోవాలి.
11. అంతే టేస్టీ జింజర్ ప్రాన్స్ రెసిపీ రెడీ అయిపోయినట్టే.

జింజర్ ప్రాన్స్ ను వేడి వేడి అన్నంతో తింటే అదిరిపోతుంది. లేదా చపాతీ లేదా రోటీతో తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది. మీకు ఇగురులా కావాలంటే కొంచెం నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. లేదా డ్రైగా కావాలనుకుంటే నీరు లేకుండా చిన్న మంట మీదే ఉడికించుకుంటే సరిపోతుంది. ఒక్కసారైనా జింజర్ ఫ్రాన్స్ వండుకొని చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×