E-Paper
Advertisement

Fish Fry: చేపల వేపుడు చేసేందుకు పెద్దగా కష్టపడకండి, ఇలా సింపుల్ గా చేసేయండి

Fish Fry: చేపల వేపుడు చేసేందుకు పెద్దగా కష్టపడకండి, ఇలా సింపుల్ గా చేసేయండి
Advertisement

చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. చేపల్లో ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ డి లాంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. చేపలతో వండే వంటకాల్లో ఫిష్ ఫ్రై ఎంతో రుచిగా ఉంటుంది. కానీ దీన్ని చేయడం వచ్చిన వారు తక్కువమందే. నిజానికి చేపల వేపుడు చాలా సింపుల్ గా చేసేయచ్చు. స్పైసీగా చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో చేసి చూడండి.. ఫిష్ ఫ్రై అదిరిపోతుంది.

చేపల వేపుడు రెసిపీకి కావాల్సిన పదార్థాలు
చేప ముక్కలు – అర కిలో
కారం – ఒక స్పూను
పసుపు – పావు స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నిమ్మరసం – ఒక స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక స్పూన్
ధనియాల పొడి – ఒక స్పూన్
జీలకర్ర పొడి – ఒక స్పూన్
బియ్యపు పిండి లేదా కార్న్ ఫ్లోర్ – ఒక స్పూన్
నూనె – వేయించడానికి సరిపడా

Advertisement

చేపల వేపుడు రెసిపీ
1. మొదటగా చేప ముక్కలను బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి.
2. ఒక పెద్ద గిన్నెలో చేప ముక్కలను వేసి అందులో కారం, పసుపు, ఉప్పు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.
3. ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసి మసాలా పట్టించాలి. అలా అరగంట పాటూ మారినేట్ చేయాలి. ఇలా ఉంచితే చేపలో మసాలా బాగా కలుస్తుంది.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
5. నూనె వేడిగా అయ్యాక, చేప ముక్కలను ఒకటొకటిగా వేసి మీడియం మంట మీద వేయించాలి.
6. రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
7. వేయిస్తున్నప్పుడు మంట ఎక్కువగా పెట్టకూడదు. చేప బాగా వేగిన తర్వాత వాటిని తీసి టిష్యూ పేపర్ పై వేయాలి. ఇది అదనపు నూనెను పీల్చేస్తుంది.

ఫిష్ ఫ్రైని వేడి వేడి‌గా ఉల్లిపాయ ముక్కలు, నిమ్మముక్కలు, పచ్చిమిరపకాయలతో పాటు సర్వ్ చేస్తే రుచి మరింతగా ఉంటుంది. ఈ ఫిష్ ఫ్రైని భోజనంలో అన్నంతో తినవచ్చు లేదా స్నాక్‌లా సాయంత్రం టీతో కూడా తినవచ్చు. చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు గుండెకు మంచివి. అలాగే చేప తినడం వల్ల మెదడు పని తీరును మెరుగుపరుస్తుంది. కంటి చూపు బలంగా మారుస్తుంది. మీకు ఇష్టమైతే కరివేపాకు, కొత్తిమీర తరిగి చివర్లో వేస్తే రుచి, సువాసన అదిరిపోతుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×