E-Paper
Advertisement

Feet Health: గుండె ప్రమాదాన్ని తెలిపే పాదాలు, మీరు నిర్లక్ష్యం చేయకూడని 3 కీలక లక్షణాలు ఇవే !

Feet Health: గుండె ప్రమాదాన్ని తెలిపే పాదాలు, మీరు నిర్లక్ష్యం చేయకూడని 3 కీలక లక్షణాలు ఇవే !
Advertisement

Feet Health: గుండె ఆరోగ్యం అనేది మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అంశం. గుండె జబ్బుల లక్షణాలు చాలా తరచుగా ఛాతీ నొప్పి లేదా ఆయాసం రూపంలో కనిపిస్తాయి అనుకుంటాం. అయితే.. మనకు పెద్దగా తెలియని విషయం ఏమిటంటే.. గుండె సంబంధిత సమస్యలు తరచుగా మన పాదాలలో మొదలవుతాయి. పాదాలలో కనిపించే కొన్ని లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే అవి తీవ్రమైన గుండె లేదా రక్త ప్రసరణ సమస్యలను సూచిస్తాయి.

Advertisement

మీ పాదాలు చూపిస్తున్న 3 ముఖ్యమైన గుండె జబ్బుల లక్షణాలు:

1. వాపు: పాదాలు, చీలమండలు, కాళ్ళలో వాపు కనిపించడం గుండె జబ్బులకు సంబంధించిన అత్యంత సాధారణ లక్షణం. దీనిని వైద్య పరిభాషలో ఎడెమా అంటారు. గుండె బలహీనపడినప్పుడు అది రక్తాన్ని సమర్థవంతంగా పంప్ చేయలేదు. దీని కారణంగా రక్త నాళాల నుంచి ద్రవాలు గురుత్వాకర్షణ కారణంగా శరీరంలోని దిగువ భాగాలైన కాళ్లలో పేరుకుపోతుంది.

Advertisement

గుర్తించడం ఎలా?

మీ చీలమండ లేదా పాదంపై వేలితో నొక్కినప్పుడు.. అక్కడ గుంట పడి, అది నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తే, అది ద్రవం పేరుకుపోవడాన్ని సూచిస్తుంది. ఈ లక్షణం గుండె జబ్బులకు ప్రధాన సంకేతం కాబట్టి.. వాపు ఎక్కువ రోజులు ఉంటే లేదా నొప్పి ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.

2. నీలం లేదా ఊదా రంగు :

మీ పాదాలు లేదా కాలి వేళ్ళ చివర్లు నీలం లేదా ఊదా రంగులోకి మారడం అనేది రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నాయనడానికి సంకేతం. ఈ పరిస్థితిని సైనోసిస్ అంటారు. గుండె లేదా రక్త ప్రసరణ వ్యవస్థ సరిగ్గా పనిచేయనప్పుడు.. ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తం పాదాల చివర్లకు సమర్థవంతంగా చేరుకోదు. రక్తం సరఫరా నెమ్మదిగా ఉన్నప్పుడు.. అది డీఆక్సిజనేటెడ్ రక్తంగా మారి నీలి రంగులో కనిపిస్తుంది.

గుర్తించడం ఎలా?

పాదాల చర్మం లేదా కాలి వేళ్లపై గోళ్లు నీలం రంగులోకి మారుతాయి. ముఖ్యంగా చల్లని వాతావరణంలో ఈ రంగు మార్పు మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఇది రక్త ప్రసరణలో తీవ్రమైన సమస్యను సూచిస్తుంది. గుండె సరిగా పంప్ చేయకపోవడం లేదా రక్త నాళాలు అడ్డంకులకు గురికావడం వల్ల కూడా ఇలా జరిగే ప్రమాదం కూడా ఉంటుంది.

Also Read: గుండెకు రక్షణ, షుగర్‌కు చెక్.. పచ్చి అల్లం తింటే ఈ ప్రయోజనాలన్నీ మీ సొంతం !

3. కాలి జుట్టు రాలిపోవడం:

పాదాలు , కాళ్ళపై జుట్టు రాలిపోవడం లేదా చర్మం పల్చగా, మెరిసేలా మారడం అనేది రక్తనాళాల వ్యాధి వంటి తీవ్రమైన గుండె సంబంధిత సమస్యకు సంకేతం. గుండె నుంచి కాళ్ళకు రక్తాన్ని తీసుకువెళ్ళే ధమనులలో కొవ్వు నిక్షేపాలు పేరుకుపోయి, అవి ఇరుకుగా మారినప్పుడు సమస్యలు ఎదురవుతాయి. రక్త ప్రసరణ సరిగ్గాల లేకపోతే.. పాదాల చర్మానికి, వెంట్రుకల కుదుళ్లకు అవసరమైన పోషకాలు, ఆక్సిజన్ అందవు.

గుర్తించడం ఎలా ?

పాదాలు లేదా కాళ్ళపై జుట్టు రాలిపోవడం, చర్మం పల్చగా, మెరిసేలా మారడం, గోళ్లు నెమ్మదిగా పెరగడం లేదా పగుళ్లు రావడం వంటివి గమనించవచ్చు. ఇది పాదాల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా.. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు కూడా మూసుకుపోయే ప్రమాదం ఉందని సూచిస్తుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×