E-Paper
Advertisement

Makhana: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు పొరపాటున కూడా మఖానా తినొద్దు

Makhana: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు పొరపాటున కూడా మఖానా తినొద్దు
Advertisement

Makhana: ప్రస్తుత కాలంలో బరువు తగ్గాలనుకునే వారు, ఆరోగ్య స్పృహ ఉన్నవారు ఎక్కువగా ఇష్టపడే స్నాక్స్ లో మఖానా మొదటి వరుసలో ఉంటుంది. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండటం, క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల దీనిని ‘సూపర్ ఫుడ్’ అని పిలుస్తారు. అయితే.. ఏదైనా అతిగా తిన్నా లేదా అందరికీ ఒకేలా పడకపోయినా సమస్యలు తప్పవు.

Advertisement

ప్రముఖ ఆరోగ్య నిపుణుల హెచ్చరిక ప్రకారం..కింది 3 రకాల సమస్యలు ఉన్న వారు ఖానాను అస్సలు తీసుకోకూడదు లేదా చాలా పరిమితంగా తీసుకోవాలి. ఎవరు, ఎందుకు మఖానాినకోకూడదో వివరంగా తెలుసుకుందాం.

1. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు:

Advertisement

మఖానాలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. సాధారణంగా ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియం అవసరమే, కానీ కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి ఇది ఇబ్బందికరంగా మారుతుంది.

కారణం: కిడ్నీలో ఉండే రాళ్లు ఎక్కువగా ‘క్యాల్షియం ఆక్సలేట్’ స్పటికాలతో తయారవుతాయి. మఖానా ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో క్యాల్షియం స్థాయిలు పెరిగి, రాళ్ల పరిమాణం పెరగడానికి లేదా కొత్త రాళ్లు ఏర్పడటానికి కారణం కావచ్చు.

2. జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు:

మఖానాలో ఫైబర్ (పీచు పదార్థం) చాలా ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తుందని మనకు తెలుసు. కానీ ఇప్పటికే తీవ్రమైన గ్యాస్ట్రిక్ లేదా ఉబ్బరం సమస్యలతో బాధపడేవారికి ఇది రివర్స్ అవుతుంది.

కారణం: మఖానాను అతిగా తినడం వల్ల పొట్టలో గ్యాస్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు వీటిని తింటే జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది.

3. డయేరియా లేదా విరేచనాలతో బాధపడేవారు:

విరేచనాలు అవుతున్నప్పుడు మఖానా తినడం ఏమాత్రం మంచిది కాదు.

కారణం: మఖానాలో ఉండే ఫైబర్ విరేచనాల తీవ్రతను పెంచుతుంది. ఇది మలాన్ని మరింత లూజ్‌గా చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి, కడుపు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లేదా మోషన్స్ అవుతున్నప్పుడు వీటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం.

మరికొన్ని అదనపు జాగ్రత్తలు:

అలెర్జీ: కొందరికి తామర గింజలు లేదా విత్తనాల వల్ల అలెర్జీ రావచ్చు. మఖానా తిన్న తర్వాత చర్మంపై దద్దుర్లు లేదా దురద వస్తే వెంటనే మానేయాలి.

Also Read: హైపోథైరాయిడిజం.. చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు

షుగర్ పేషెంట్లు: మఖానా డయాబెటిస్ ఉన్నవారికి మంచిదే అయినప్పటికీ, ఇది ఇన్సులిన్ స్థాయిలను ప్రభావితం చేయగలదు. కాబట్టి మందులు వాడుతున్న వారు నిపుణుల సలహా తీసుకోవాలి.

గర్భిణీలు: గర్భధారణ సమయంలో మఖానా తీసుకోవడం సురక్షితమే కానీ, అధిక ఫైబర్ వల్ల మలబద్ధకం లేదా గ్యాస్ రాకుండా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.

మఖానా ఎలా తీసుకోవాలి?

మఖానాను నేరుగా పచ్చిగా తినడం కంటే, కొద్దిగా నెయ్యిలో వేయించి తీసుకోవడం వల్ల జీర్ణం సులభంగా అవుతుంది. అయితే.. మార్కెట్లో దొరికే ఎక్కువ ఉప్పు, మసాలాలు కలిపిన ప్యాకెట్ మఖానా కంటే ఇంట్లో వేయించుకున్నవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×