E-Paper
Advertisement

Egg White for Skin: గుడ్డు తెల్లసొనను ఇలా వాడితే 40లోనూ యవ్వనమైన మెరుపు గ్యారెంటీ.. మీరూ ట్రై చేస్తారా మరి?

Egg White for Skin: గుడ్డు తెల్లసొనను ఇలా వాడితే 40లోనూ యవ్వనమైన మెరుపు గ్యారెంటీ.. మీరూ ట్రై చేస్తారా మరి?
Advertisement

Egg White for Skin: గుడ్డు కేవలం ఆరోగ్యానికే కాదు.. అద్బుతం అనిపించే సౌందర్య సాధనంగానూ పనిచేస్తుంది. ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ ఇచ్చే మెరుపును కేవలం గుడ్డులోని తెల్లసొనతో మనం ఇంట్లోనే పొందవచ్చు. ఈ సహజసిద్ధమైన పద్ధతుల ద్వారా మీ చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందామా.

యవ్వనమైన చర్మం మీ సొంతం:

వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలు, సన్నని గీతలను అడ్డుకోవడంలో గుడ్డులోని తెల్లసొన కీలకంగా పనిచేస్తుంది. దీనిని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవడం వల్ల చర్మం బిగుతుగా మారుతుంది. వారానికి రెండు సార్లు ఈ మాస్క్‌ను వేసుకోవడం వల్ల ముఖం తాజాగా, యవ్వనంగా కనిపిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Also Read: పాదాలు అందవిహీనంగా మారాయా? పార్లర్‌కు వెళ్లకుండా ఇంట్లోనే కోమలంగా మార్చుకోండిలా!

కళ్ల కింద వాపులకు స్వస్తి: 

అలసట లేదా నిద్రలేమి వల్ల కళ్ల కింద వచ్చే వాపులను తగ్గించడానికి గుడ్డు తెల్లసొన ఎంతగానో మేలు చేస్తుంది. ఈ సొనను కళ్ల కింద నెమ్మదిగా మర్దన చేసి, కాసేపయ్యాక చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా కొబ్బరినూనె రాస్తే.. కళ్ల చుట్టూ ఉండే చర్మం తేమను కోల్పోకుండా ఆరోగ్యంగా ఉంటుంది.

మొటిమలు మాయం:

Advertisement

మొటిమలు, వాటి తాలూకు మచ్చలతో ఇబ్బంది పడేవారికి ఇదొక మంచి పరిష్కారం. గుడ్డు తెల్లసొనలో రెండు చుక్కల టీట్రీ ఆయిల్ కలిపి.. మొటిమలు ఉన్న చోట అప్లై చేయాలి. ఇది చర్మంలోని బ్యాక్టీరియాను తొలగించి, మచ్చలు త్వరగా తగ్గేలా చేయడంలో తోడ్పడుతుంది.

పేరుకుపోయిన మురికి పోతుంది:

చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన దుమ్ము, ధూళిని తొలగించడానికి ముందుగా ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఆపై గుడ్డు తెల్లసొనను ముఖంపై ఒక పొరలా రాసి, అది పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చర్మ రంధ్రాలు శుభ్రపడి.. ముఖం కాంతివంతంగా మారుతుంది.

Also Read: సూర్యోదయం కంటే ముందే మీ రోజూ మొదలైతే.. ఆరోగ్యం మీ గుప్పిట్లో ఉన్నట్లే!

 

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×