E-Paper
Advertisement

Egg Nutrition Secrets: కోడిగుడ్లు నిజంగా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయా? ఈ నిజాలు తెలిస్తే అవాక్కే!

Egg Nutrition Secrets: కోడిగుడ్లు నిజంగా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయా? ఈ నిజాలు తెలిస్తే అవాక్కే!
Advertisement

Egg Nutrition Secrets: కోడిగుడ్లను రోజూ తినడం వల్ల ఊబకాయం లేదా కొలెస్ట్రాల్ సమస్యలు వస్తాయని చాలామంది భయపడుతుంటారు. కానీ ఇదొక అపోహ మాత్రమే అని కొట్టి పారేస్తున్నారు వైద్య నిపుణులు. నిజానికి.. గుడ్లు అనేవి శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ B12, విటమిన్ D, జింక్, సెలీనియంతో పాటు అనేక సూక్ష్మపోషకాలను సమృద్ధిగా అందించే ఆహారం. ప్రతిరోజూ రెండు బాయిల్డ్ ఎగ్స్ తినడం వల్ల మన శరీరానికి శక్తి మాత్రమే కాదు.. మొత్తం ఆరోగ్యానికే మంచిది అంటున్నారు వైద్య నిపుణులు.

ఇమ్యూనిటీ బూస్టర్:

ప్రస్తుత సీజన్ (శీతాకాలం)లో ప్రొటీన్ కోసం, అలాగే రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు ఎగ్స్ ఎంతో అవసరం. అందుకే ప్రతిరోజూ రెండు ఉడకబెట్టిన కోడిగుడ్లు తీసుకోవాలి. దీంతో చలికాలంలో చర్మానికి వెచ్చదనాన్ని అలాగే శక్తిని అందించినట్టు అవుతుంది. మన శరీరానికి బాయిల్డ్ ఎగ్స్‌ ఇమ్యూనిటీ బూస్టర్‌గా పని చేస్తుంది. దీంతో సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

Advertisement

Also Read: ప్రొటీన్ ఫుడ్‌పై ఏంటీ కన్ఫ్యూజన్.. ఈ రెండిట్లో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా?

కండరాలు బలంగా:

ప్రతిరోజూ మీ ఉదయాన్ని రెండు గుడ్లతో ప్రారంభించడం ద్వారా కండరాలకు బలం చేకూర్చినట్లు అవుతుంది. ఎగ్‌లోని ప్రొటీన్ శరీరానికి అవసరమైన అన్ని అమినో ఆమ్లాలను అందిస్తుంది. ఇది కండరాల పెరుగుదలకు, మరమ్మత్తులకు, రోజంతా ఉత్సాహంగా, చురుగ్గా ఉండటానికి దోహదపడుతుంది.

బరువు తగ్గేందకు:

Advertisement

గుడ్లు తక్కువ క్యాలరీలతో అధిక ప్రొటీన్ అందించే ఆహారం కాబట్టి.. అధిక బరువు తగ్గించుకోవడంలో కూడా సహాయపడతాయి. ప్రతిరోజూ రెండు నుంచి నాలుగు ఉడికించిన కోడిగుడ్లు తీసుకుంటే సులభంగా, త్వరగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. అలాగే ఎగ్స్ తింటే శరీరంలో మెటబాలిజం మెరుగుపడటంతో చర్మం, జుట్టు ఆరోగ్యానికి మంచిది.

అనేక పోషకాలు:

ఎగ్స్‌లో విటమిన్ A, D, B12, జింక్, సెలీనియం లాంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, శీతాకాలంలో జలుబు, దగ్గు, కాలానుగుణ అనారోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. వయసు పెరుగుతున్న వారికి ఇమ్యూనిటీ సిస్టమ్ బలంగా ఉండేందుకు గుడ్లు చాలా ఉపయోగపడతాయి.

మానసిక ప్రశాంతత:

కొన్ని పరిశోధనల్లో వెల్లడైన సమాచారం ప్రకారం.. గుడ్లలోని చాలా పోషకాలు, ప్రొటీన్, విటమిన్లు మానసిక శక్తిని పెంచుతాయి. ప్రతి ఉదయం కోడిగుడ్లు తినడం వల్ల ఆ రోజంతా ఉత్సాహంగా, మెరుగ్గా ఉండవచ్చు. ఎగ్స్‌లోని ప్రొటీన్ కంటెంట్ మానసిక ప్రశాంతతను అందించడమే కాకుండా ఒత్తిడి తగ్గించడంలోనూ సహాయపడతాయి.

Also Read: ఈ రెండిట్లో బ్రేక్‌ఫాస్ట్‌‌కి ఏది బెస్ట్?.. దీని వెనుకున్న అసలు విషయం ఇదే!

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×