E-Paper
Advertisement

Benfits Of Tomato: ఇష్టమని చెప్పి అతిగా టమాటాలు తింటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా

Benfits Of Tomato: ఇష్టమని చెప్పి అతిగా టమాటాలు తింటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా
Advertisement

Benfits Of Tomato: టమాటాలు రెట్లు తరచూ పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. కొన్ని సార్లు వాటిని కొనుగోలు చేయాలంటేనే భయంగా ఉంటుంది. కిలో టమాట ధరతో ఏకంగా మరో మూడు కూరగాయలు కొనుగోలు చేసేలా ధరలు ఆకాశాన్నంటుతాయి. అయితే మరికొన్ని సార్లు మాత్రం కేవలం రూ. 1 కే కిలో టమాటలు కూడా దొరికిన రోజులు ఉన్నాయి. అయితే టమాటలను కూరల్లో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. కొన్ని కూరల్లో టమాట లేకపోతే అసలు దానికి రుచే ఉండదు అనిపిస్తుంది. చాలా మంది కూరల్లో టమాటాలను ఎక్కువగా వేసుకుని ఇష్టంగా తింటుంటారు. కానీ టమాటలను అతిగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతీ కూరగాయలోను ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూర్చే పోషకాలు, విటమిన్లు, ప్రోటీన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందులో ఒకటి టమాటా కూడా. టమాటా తినడం వల్ల ఆరోగ్యానికి ప్రయోజనాలతో పాటు, ఎక్కువగా తింటే అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. టమాటలను ఎక్కువగా తింటే కడుపు సంబంధింత సమస్యలు తెలత్తుతాయి. గ్యాస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది. దీనికి కారణం టమాటాల్లోని తొక్కలు, విత్తనాలే కారణం అని నిపుణులు చెబుతున్నారు. వాటిలో ఉండే ప్రకోప ప్రేగు సిండ్రోమ్ వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతాయట.

Advertisement

టమాటాలు ఎక్కువగా తీసుకుంటే అలెర్జీ లక్షణాలు కూడా ఉంటాయి. చర్మంపై దురద, గొంతులో దురద, తామర, ముఖం, నోరు, నాలుకపై వాపు వంటి చాలా సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు మూత్ర పిండాల సమస్యలతో బాధపడేవారు టమాటాలను తినకపోవడమే మంచిది. టమాటలో ఉండే హిస్టమిన్ రసాయనం రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. టమాటలో ఉండే సోడియం కంటెంట్ కారణంగా రక్తపోటు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టమాటను సూప్ చేసి తాగితే అందులో ఉండే సోడియం కారణంగా అలెర్జీ వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు గుండెల్లో మంట, శ్వాసకోశ సమస్యలు, కడుపులో నొప్పి వంటి చాలా రకాల సమస్యలను సృష్టిస్తుంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×