E-Paper
Advertisement

Cardamom: ఆరోగ్యమే కాదు.. శృంగార జీవితంలోనూ.. ఈ సుగంధ ద్రవ్యాల రాణి ఉండాల్సిందే!

Cardamom: ఆరోగ్యమే కాదు.. శృంగార జీవితంలోనూ.. ఈ సుగంధ ద్రవ్యాల రాణి ఉండాల్సిందే!
Advertisement

Cardamom: యాలకులను భారతదేశంతో పాటు భూటాన్, నేపాల్, ఇండోనేషియా వంటి దేశాల్లోనే ఎక్కువగా పండిస్తున్నారు. ఇవి జింగీబెరాసెయ్ అనే జాతికి చెందినవి. యాలకులు ప్రధానంగా ఆకుపచ్చ, నలుపు రంగులలో ఉంటాయి. మన దేశంలో ఆకుపచ్చ యాలకులనే అధికంగా పండిస్తున్నారు. ఇక యాలకుల వల్ల ఆనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా లైంగిక సమస్యలతో ఇబ్బంది పడే మగవారికి ఇవి దివ్యౌషధంగా పనిచేస్తాయి. ప్రతిరోజూ రెండు యాలకులు తీసుకుంటే చాలు.. శరీరంలో అనేక మార్పులు జరుగుతాయంటున్నారు వైద్య నిపుణులు.

పలు రోగాలు మటుమాయం:

ముఖ్యంగా యాలకులను నమిలి రసం మింగితే.. తలనొప్పి, ఒత్తిడి, పలు ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆస్తమా, దగ్గు, జలుబును తగ్గించడంలో ఇవి బాగా పని చేస్తాయి. వీటిని రోజూ తీసుకుంటే గుండె సమస్యలు దూరం అవుతాయి. రక్తహీనత సమస్య ఉన్నవారికి రక్తం పెరిగేందుకు ఇవి తోడ్పడుతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే అనేక ఇన్ఫెక్షన్లను సులభంగా తొలగించే గుణాలు యాలకులలో ఉన్నాయి.

డిప్రెషన్ నుంచి బయటపడాలంటే..

Advertisement

యాలకుల రుచి, సువాసన వల్ల మనలోని ఆందోళన, ఉద్రేకత, హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు తగ్గిపోతాయి. తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నవారు యాలకుల పొడిని టీ లేదా పాలలో వేసుకుని తాగొచ్చు. ఈ గింజలను నేరుగా తిన్నా మంచి ఫలితం ఉంటుంది. డిప్రెషన్ నుండి బయటపడాలంటే.. రోజుకు రెండు నుంచి మూడు యాలకులు తీసుకోవచ్చు. మానసిక పరిస్థితి బాగోలేక నెగెటివ్ ఆలోచనలు, ఆత్మహత్య ప్రయత్నాలు చేసేవారికి యాలకులు మంచి ఉపకారిగా పనిచేస్తాయి.

శృంగార సమస్యలకు చెక్:

సంతాన సాఫల్యతను పెంచడంలో యాలకులు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే సినియోల్ అనే సమ్మేళనం పురుషుల్లో నరాల పటిష్టతకు ఉపయోగపడుతుంది. నరాల బలహీనత, లైంగిక సామర్ధ్యం తక్కువగా ఉన్నవారు డైలీ రెండు యాలకులు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ చిటికెడు యాలకుల పొడి నీటిలో వేసుకుని తాగితే.. సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ యాలకులు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిలో మెటబాలిజాన్ని పెంచే గుణాలు ఉండటం వల్ల జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది.

క్యాన్సర్‌ను అడ్డుకునే గుణాలు:

Advertisement

కఫం, దగ్గు, ఊపిరాడకపోవడం వంటి సమస్యలున్న వారు యాలకులను రోజూ తినాలి. యాలకులు రక్త ప్రసరణను మెరుగుపరిచి, ఊపిరితిత్తులకు మేలు చేయడంతో కఫాన్ని తగ్గిస్తాయి. ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యల నివారణకు కూడా ఆకుపచ్చ యాలకులు ప్రయోజనకరం. యాలకుల్లోని యాంటీఆక్సిడెంట్ గుణాలు, ఫైబర్ గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. దీంతో కొలెస్ట్రాల్‌ స్థాయి తగ్గి, గుండెకు రక్త సరఫరా మెరుగుపడుతుంది. ముఖ్యంగా యాలకుల్లోని సహజ సిద్ధమైన యాంటీఆక్సిడెంట్ గుణాలు క్యాన్సర్‌ను అడ్డుకోవడం, దాని పెరుగుదలను నెమ్మదింపజేయడం, కొన్ని సందర్భాల్లో క్యాన్సర్‌ను తగ్గించే గుణాలు కూడా ఉన్నాయని జంతువులపై జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది.

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×